శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కెన్యాకు చెందిన దంపతుల నుంచి కేజీన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్ వచ్చిన వీరి వద్ద బంగారం ఉండటాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద బంగారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో దంపతులను అదుపులోకి తీసకుని, బంగారాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.