
బెంగళూరులో 20 కేజీల బంగారం పట్టివేత
ఈ నెల 18వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీ చేయగా అందులో 20 కేజీల బంగారు బిస్కెట్లతోపాటు కొంత నగదు బయటపడింది. దీంతో వాటని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నింధితులను అరెస్ట్ చేశారు. కాగా, పట్టుబడిన బంగారం విలువ రూ.6 కోట్ల ఉంటుందని అధికారులు తెలిపారు.