చెన్నై: విదేశాల నుంచి అక్రమ బంగారాన్ని తరలిస్తున్న ఘటనలు దేశంలో రోజూ ఏదో మూలన చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అక్రమ బంగార రవాణపై ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాకొంతమంది యధేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాజాగా రూ.2 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లును చెన్నై ఎయిర్ పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గత రాత్రి సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారుల తనిఖీలో బయటపడింది. తమిళనాడులోని పుదుకొట్టాయ్ గ్రామానికి చెందిన ఫైరోజ్ ఖాన్ అనే ప్రయాణికుడు దాదాపు 6 కేజీల బంగారు బిస్కెట్లను తీసుకొస్తూ కస్టమ్స్ కు చిక్కాడు. ప్రస్తుతం ఆ బంగారానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.