శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విమానంలో సీటు కింద అమర్చి బంగారాన్ని తరలించాలని ప్రయత్నించగా ఆ వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. మైక్రో ఓవెన్లో కిలో బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.