
విశాఖపట్నం: బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖపట్నం కస్టమ్స్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొలంబో నుంచి ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన శ్రీలంక వాసి అబ్దుల్ మహ్మద్ రజాక్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు విచారణ చేపట్టగా.. అతని మలద్వారంలో నాలుగు, ఉదరంలో మరి కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 800 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.