అమ్మ చేసిన అలవాటు.. ఆయన 5 కిలోల ‘గోల్డ్‌మన్‌’ | Goldman In Vizag 5 KG Gold Ornaments Mukka Srinivas | Sakshi
Sakshi News home page

అమ్మ చేసిన అలవాటు.. ఆయన 5 కిలోల ‘గోల్డ్‌మన్‌’

Published Tue, Apr 26 2022 9:25 PM | Last Updated on Wed, Apr 27 2022 1:43 PM

Goldman In Vizag 5 KG Gold Ornaments Mukka Srinivas - Sakshi

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఒంటిమీద కిలోలకొద్దీ బంగారం ధరించిన వ్యక్తులను మనం సోషల్‌ మీడియాలో చూస్తూ ఉంటాం. వారిని ఆ ప్రాంతంలో గోల్డ్‌మన్‌ అని పిలుస్తుంటారు. ఇప్పుడు మన వైజాగ్‌లో కూడా ఒక గోల్డ్‌మన్‌ ఉన్నాడు. ఆయనే సీతమ్మ ధారకు చెందిన ముక్క శ్రీనివాస్‌. ఆయన నిత్యం కనీసం కిలో బంగారాన్ని ధరిస్తారు. ఆయన వద్ద మొత్తంగా 5 కిలోల బంగారం ఉందట.

చిన్నప్పుడు అతికోపిష్టి అయిన శ్రీనివాస్‌కు కోపం తగ్గాలని వాళ్ల అమ్మ ఆయనకు చైను, రెండు ఉంగరాలు నిరంతరం పెట్టేదట. అప్పటి నుంచి అది అలవాటుగా మారి శ్రీనివాస్‌ ఇప్పుడు గోల్డ్‌మన్‌గా అవతరించాడు. బీచ్‌రోడ్డులో ఓ కార్యక్రమంలో ఆయన్ను సందర్శకులు ఎంతో ఆసక్తితో గమనించారు.
చదవండి👉🏻 చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement