ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం.. | Delhi Customs Seize 26 iPhone 16 Pro Max From Passenger At Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం.. ఎన్ని లక్షలంటే!

Published Wed, Oct 2 2024 12:34 PM | Last Updated on Wed, Oct 2 2024 1:16 PM

Delhi Customs Seize 26 iPhone 16 Pro Max From Passenger At Airport

న్యూఢిల్లీ:  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లు భారీగా పట్టుబడ్డాయి. ఇటీవలే యాపిల్‌ సంస్థ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అచితూ ఈ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన వ్యానిటీ బ్యాగ్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్‌లను టిష్యూ పేపర్లలో చుట్టి దాచిపెట్టిందని అధికారులు తెలిపారు. కాగా ఐఫోన్‌ సిరీస్‌లో.. 16 ప్రో మాక్స్‌ టాప్‌ మోడల్‌.

ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం.. హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ప్ర‌యాణిస్తున్న ఓ మ‌హిళ 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్ల‌ను తీసుకొచ్చింది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్ర‌యంలో ఆమెను ప‌ట్టుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మ‌రింత విచార‌ణ చేప‌డుతున్నట్లు పోలీసులు తెలిపారు.  స్మ‌గ్లింగ్ చేసిన ఆ ఫోన్లు ఖ‌రీదు సుమారు 37 ల‌క్ష‌లు ఉంటుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement