
అరటన్ను బంగారం, అర కేజీ వజ్రాలు స్వాధీనం
ఢాకా: బంగ్లాదేశ్ అధికారులు ఓ ప్రముఖ బంగారు వ్యాపారికి చెందిన అర టన్ను(500 కేజీలు) పసిడిని, అరకేజీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అపన్ జ్యువెల్లర్స్‌కు చెందిన ఐదు షాపుల్లో గత నెలలో దాడులు చేసి వీటిని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. బంగారం విలువ రూ.201 కోట్లు. అపన్ జ్యువెల్లర్స్ యజమాని కొడుకు ఓ కేసులో తొలుత అరెస్టయ్యాడు. తన గురించి పోలీసుల వద్ద అతను గొప్పలు చెప్పుకోవడంతో అనుమానమొచ్చిన అధికారులు దాడులు చేసి బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.