Foreign cigarettes worth Rs 3 crore seized in Andhra Pradesh - Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం

Published Wed, Jan 4 2023 5:24 AM | Last Updated on Wed, Jan 4 2023 11:19 AM

Foreign cigarettes worth Rs 3 crore seized Andhra Pradesh - Sakshi

పల్నాడు జిల్లా నరసరావుపేట లో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.3 కోట్లు విలువైన విదేశీ సిగరెట్లు

సాక్షి, అమరావతి: అక్రమంగా తరలిస్తోన్న రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను విజయవాడ కస్టమ్స్‌ అధికారులు పల్నాడు జిల్లాలో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల పారిస్‌ బ్రాండ్‌ సిగరెట్లను మయన్మార్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు విచారణలో వెల్లడైంది. బిహార్‌లోని ముజఫరాబాద్‌లో  ఓ లారీలో వీటిని లోడ్‌ చేసి అక్రమంగా రవాణా చేస్తుండగా కస్టమ్స్‌ అధికారులు నరసరావుపేట శివార్లలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు.

ఈ సిగరెట్లను గోధుమ పిండి బ్యాగుల్లో ప్యాక్‌ చేసి టార్పాలిన్లు కప్పి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిపై చట్టపరమైన హెచ్చరికలు ముద్రించి లేకపోవడంతో అధికారులు లారీని జప్తు చేసి కేసు నమోదు చేశారు. కాగా, గత 6 నెలల్లో విజయవాడ కస్టమ్స్‌ అధికారులు.. తనిఖీల్లో రూ.1.50 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement