స్పీకర్లు, టాల్కం పౌడర్ డబ్బాల్లో తీసుకొచ్చిన నిందితులు
శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ నజీర్, హైదరాబాద్ వాసి గులాంజిలానీ శుక్రవారం ఉదయం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఈకే 526 విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నజీర్ కారుకు ఉపయోగించే నాలుగు స్పీకర్లు, జిలానీ మూడు టాల్కమ్ పౌడర్ డబ్బాలు తీసుకొచ్చాడు. వీరి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో అధికారులు అదుపులోకి తీసుకొని పరిశీలించారు. స్పీకర్లతో పాటు పౌడర్ డబ్బాలో ఉన్న సుమారు రూ. 43లక్షలు విలువ చేసే 1.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
విమానాశ్రయంలో కిలోన్నర బంగారం పట్టివేత
Published Sat, Apr 5 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM
Advertisement
Advertisement