యువతిని వేధిస్తున్న బీటెక్‌ విద్యార్థి అరెస్ట్‌ | Btech student arrested for blackmailing uploading obscene photos of girl | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో న్యూడ్‌ ఫోటోలు పెడతానంటూ..

Published Tue, Nov 8 2016 6:26 PM | Last Updated on Wed, Jul 10 2019 2:44 PM

యువతిని వేధిస్తున్న బీటెక్‌ విద్యార్థి అరెస్ట్‌ - Sakshi

యువతిని వేధిస్తున్న బీటెక్‌ విద్యార్థి అరెస్ట్‌

సికింద్రాబాద్‌: ఫేస్‌బుక్‌లో నగ్న చిత్రాలు పెడతానంటూ ఓ యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థిని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సీతాఫల్‌మండిలో నివశిస్తున్న ఆకాష్‌ రెడ్డికి,అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఐదేళ్లక్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నిత్యం వీరు చాటింగ్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఫోటోలు మార్ఫింగ్‌ చేసి  ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తానంటూ ఆకాష్‌రెడ్డి సదరు యువతిని బెదిరించి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు.  అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement