akash reddy
-
మాటలు హత్తుకునేలా ఉన్నాయి – ‘దిల్’ రాజు
‘‘అలనాటి రామచంద్రుడు’ చిత్ర దర్శకుడు, నిర్మాత.. ఇలా అందరూ కొత్తవారే. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని థియేటర్లోకి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇకపై ఈ యూనిట్ అంతా చాలా కష్టపడాలి.. సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ‘దిల్’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అలనాటి రామచంద్రుడు’ టైటిల్ బాగుంది. మాటలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘సరికొత్త ప్రేమకథా చిత్రమిది. చక్కని వినోదం ఉంటుంది’’ అన్నారు చిలుకూరి ఆకాష్ రెడ్డి. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు శ్రీరామ్ జడపోలు. ‘‘అలనాటి రామచంద్రుడు’ వంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు కృష్ణవంశీ, మోక్ష. -
మూడు సినిమాలకు శ్రీకారం
‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేష¯Œ అండ్ గేమింగ్ కాలేజీ’ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి మూడు కొత్త చిత్రాలను ప్రకటించారు. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ల లోపు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ కూడా నిర్వహిస్తున్న సురేష్‌రెడ్డి ‘పి19 ఎంటర్టై¯Œ మెంట్’ సంస్థను స్థాపించి, శుక్రవారం మూడు చిత్రాలను ప్రకటించారు. ఈ మూడు చిత్రాల ప్రీ లుక్స్, లోగోలను ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా తొలి చిత్రానికి ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’, ‘పేపర్ బోయ్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రెండో సినిమాని ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ ఫేమ్ రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి నేను నిర్మిస్తాను. మూడో సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తారు’’ అన్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామిరెడ్డి, నిర్మాతలు కె.ఎల్. దామోదర ప్రసాద్, రాజ్ కందుకూరి, జీ5 క్రియేటివ్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
-
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
సికింద్రాబాద్: ఫేస్బుక్లో నగ్న చిత్రాలు పెడతానంటూ ఓ యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థిని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సీతాఫల్మండిలో నివశిస్తున్న ఆకాష్ రెడ్డికి,అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఐదేళ్లక్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. నిత్యం వీరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానంటూ ఆకాష్‌రెడ్డి సదరు యువతిని బెదిరించి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.