మాటలు హత్తుకునేలా ఉన్నాయి – ‘దిల్‌’ రాజు | Dil Raju unveils Alanati Ramachandradu teaser | Sakshi
Sakshi News home page

మాటలు హత్తుకునేలా ఉన్నాయి – ‘దిల్‌’ రాజు

Published Fri, Jan 26 2024 3:49 AM | Last Updated on Fri, Jan 26 2024 3:49 AM

Dil Raju unveils Alanati Ramachandradu teaser - Sakshi

మోక్ష, ‘దిల్‌’ రాజు, కృష్ణవంశీ

‘‘అలనాటి రామచంద్రుడు’ చిత్ర దర్శకుడు, నిర్మాత.. ఇలా అందరూ కొత్తవారే. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని థియేటర్లోకి తీసుకెళ్లడం గొప్ప విషయం. ఇకపై ఈ యూనిట్‌ అంతా చాలా కష్టపడాలి.. సినిమాని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. కృష్ణవంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’.

హైమావతి, శ్రీరామ్‌ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ‘దిల్‌’ రాజు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘అలనాటి రామచంద్రుడు’ టైటిల్‌ బాగుంది. మాటలు మనసుని హత్తుకునేలా ఉన్నాయి. ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘సరికొత్త ప్రేమకథా చిత్రమిది. చక్కని వినోదం ఉంటుంది’’ అన్నారు చిలుకూరి ఆకాష్‌ రెడ్డి. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు శ్రీరామ్‌ జడపోలు. ‘‘అలనాటి రామచంద్రుడు’ వంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు కృష్ణవంశీ, మోక్ష.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement