Producer Dil Raju Responded On Prabhas Adipurush Teaser Trolls - Sakshi
Sakshi News home page

Dil Raju On Adipurush Teaser: సినిమాను సినిమాలాగే చూడండి: దిల్ రాజు

Published Thu, Oct 6 2022 8:32 PM | Last Updated on Thu, Oct 6 2022 9:25 PM

Producer Dil Raju Responded On Prabhas Adipurush Teaser Trolls - Sakshi

అది పురుష్ టీజర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీజర్‌పై వస్తున్న కామెంట్లపై తొలిసారి ఆయన స్పందించారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగం ఎత్తినప్పుడు జెండ్‌బామ్ పెట్టి ట్రోల్స్ చేశారని అన్నారు. ఇప్పుడేమో ఆదిపురుష్‌పై రాముడు ఇలా ఉండాలి అంటూ ట్రోల్స్ చేస్తున్నారని దిల్‌ రాజు మండిపడ్డారు. సినిమాను కేవలం సినిమాలాగే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇటీవల అయోధ్య వేదికగా టీజర్ రిలీజవగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రోజురోజుకు ఆదిపురుష్‌ టీజర్‌పై విమర్శలు పెరిగిపోతున్నాయి. విడుదలైనప్పటి నుంచి సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్‌ ఓం రౌత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్‌ వక్రీకరించారంటూ హిందు సంఘాలు, బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement