ఆకాష్ రెడ్డి, కొవ్వూరి సురేష్‌రెడ్డి, రాజ్ మాదిరాజు, ప్రదిప్ మద్దాలి
‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేష¯Œ అండ్ గేమింగ్ కాలేజీ’ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి మూడు కొత్త చిత్రాలను ప్రకటించారు. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ల లోపు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ కూడా నిర్వహిస్తున్న సురేష్‌రెడ్డి ‘పి19 ఎంటర్‌టై¯Œ మెంట్’ సంస్థను స్థాపించి, శుక్రవారం మూడు చిత్రాలను ప్రకటించారు. ఈ మూడు చిత్రాల ప్రీ లుక్స్, లోగోలను ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా తొలి చిత్రానికి ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’, ‘పేపర్ బోయ్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రెండో సినిమాని ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ ఫేమ్ రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి నేను నిర్మిస్తాను. మూడో సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తారు’’ అన్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామిరెడ్డి, నిర్మాతలు కె.ఎల్. దామోదర ప్రసాద్, రాజ్ కందుకూరి, జీ5 క్రియేటివ్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment