logo released
-
హిట్ అయితే పెద్ద సినిమానే
‘‘ప్రేక్షకుల సహకారంతో 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. చిన్న, పెద్ద సినిమాలనేవి ఉండవు. హిట్ అయితే పెద్ద సినిమా.. ఫట్ అయితే చిన్న సినిమా. ‘విక్టర్ ది నెక్ట్స్ గాడ్’ సినిమాలో 200 మంది నటీనటులకు చాన్స్ ఉండటం హ్యాపీ. నూతన సాంకేతిక నిపుణులకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’’ అని సుమన్ అన్నారు. నూతన నటీనటులతో ప్రీతమ్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘విక్టర్ ది నెక్ట్స్ గాడ్’. అమేజింగ్ గ్లోబల్ మూవీ మేకర్స్‌పై రూపొందనున్న ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్ వేడుకని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుమన్ టైటిల్ లోగోని రిలీజ్ చేశారు. ప్రీతమ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సందేశాత్మక చిత్రం. 4 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రానుంది. ఏడు దేశాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జాకీ–రవి, సంగీతం: రమేష్ ముక్కెర, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: బీఏ వర్మ. -
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. ఈ టైటిల్ లోగో రిలీజ్ చేసిన నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నాను. కొత్త కంటెంట్ ఉన్న చిత్రాలను మన ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా ఇదే కోవలో ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘పక్కా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది’’ అన్నారు వేణుగోపాల్, విక్రమ్. -
‘టైటాన్స్’ లోగో ఆవిష్కరణ
అహ్మదాబాద్: ఈ ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేయ బోతున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ జట్టు లోగోను విడుదల చేసింది. ఎగిరే గాలిపటం ఆకారం స్ఫూర్తిగా ఈ లోగోను రూపొం దించినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే జట్టుగా టైటాన్స్‌ను అభివర్ణించారు. గుజరాత్ సాంస్కృతిక వారసత్వంలో గాలిపటాలు భాగమని, ఉత్తరాయణ పండుగలో గాలిపటాలు ఎగరవేయ డం ఆనవాయితీ అని, అందుకే గుజరాత్ ఆకాంక్షలకు ప్రతీకగా తమ లోగో ఉందని అన్నారు. ఇది అంతులేని తమ జట్టు లక్ష్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. ఆకాశం తాకే గాలిపటానికి ఎగరడమే తెలుసని... తమ జట్టు కూడా అదే విధంగా ఎదుగుతుందని లోగో ఆవిష్క రణ సందర్భంగా జట్టు వర్గాలు తెలిపాయి. -
మూడు సినిమాలకు శ్రీకారం
‘క్రియేటివ్ మెంటార్స్ యానిమేష¯Œ అండ్ గేమింగ్ కాలేజీ’ మేనేజింగ్ డైరెక్టర్ కొవ్వూరి సురేష్ రెడ్డి మూడు కొత్త చిత్రాలను ప్రకటించారు. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఇటీవల ప్రకటించిన 30 ఏళ్ల లోపు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త, ఏకైక తెలుగు వ్యక్తి సురేష్‌రెడ్డి. ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిలిం స్కూల్ కూడా నిర్వహిస్తున్న సురేష్‌రెడ్డి ‘పి19 ఎంటర్టై¯Œ మెంట్’ సంస్థను స్థాపించి, శుక్రవారం మూడు చిత్రాలను ప్రకటించారు. ఈ మూడు చిత్రాల ప్రీ లుక్స్, లోగోలను ప్రసాద్స్ గ్రూప్ చైర్మన్ అక్కినేని రమేష్ ప్రసాద్, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా తొలి చిత్రానికి ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’, ‘పేపర్ బోయ్’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ఆకాష్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. రెండో సినిమాని ‘ఋషి’, ‘ఆంధ్రాపోరి’, ‘ఐతే 2.0’ ఫేమ్ రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని ఎన్నారై రవికాంత్ జామితో కలిసి నేను నిర్మిస్తాను. మూడో సినిమాకి దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తారు’’ అన్నారు. ఆర్థోపెడిక్స్ డాక్టర్ దశరథరామిరెడ్డి, నిర్మాతలు కె.ఎల్. దామోదర ప్రసాద్, రాజ్ కందుకూరి, జీ5 క్రియేటివ్ హెడ్ నిమ్మకాయల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వాస్తవ ఘటనలతో జాంబీ రెడ్డి
‘అ!’, ‘కల్కి’ వంటి చిత్రాలతో ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘అ!’తో జాతీయ అవార్డు పొందిన ప్రశాంత్ వర్మ తాజాగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘జాంబీ రెడ్డి’. యాపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజ్‌శేఖర్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు. నిర్మాత రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘తెలుగులో తొలి జాంబీ మూవీ ‘జాంబీ రెడ్డి’తో మా సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రశాంత్ వర్మ విజ¯Œ , ఫిల్మ్‌మేకింగ్ స్టైల్‌పై ఒక నిర్మాతగా నాకు అమితమైన నమ్మకం ఉంది. కరోనాకీ, ‘జాంబీ రెడ్డి’కీ మధ్య కనెక్షన్ ఏంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.. థియేటర్లు తెరుచుకున్నాక తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు మా సినిమా రెడీ అవుతోంది’’ అన్నారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘నిజ జీవిత ఘటనలను ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఒక హై కాన్సెప్ట్ ఫిల్మ్ ఇది. అన్ని రకాల ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని కచ్చితంగా చెప్పగలను. త్వరలోనే మా చిత్రంలోని తారాగణం వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబి¯Œ , కెమెరా: అనిత్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి. -
రాముడు లంకకు వెళ్లొస్తే...
పురాణాల్లో రావణుడు సీతని అపహరిస్తే ఆంజనేయుడు తొలుత లంకకి వెళ్లొచ్చాడు. రాముడే మొదటగా వెళ్లుంటే? అనే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బడిదొంగ’. మహేష్ సూర్య సిద్దగోని హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. బేబి శ్రీనిత్య సమర్పణలో సన్ మీడియా కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రంలో ఇషిక వర్మ, రవికిరణ్ ఇతర కీలకపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా లోగోని వ్యాపార వేత్తలు రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. మహేష్ సూర్య మాట్లాడుతూ– ‘‘22 ఏళ్లుగా మీడియా, సినీ రంగాల్లో కొనసాగుతున్నాను. పలు యాడ్ ఫిల్మ్స్ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ మూవీగా రూపొందనున్న చిత్రమిది. మూడేళ్ల పాటు ఈ కథపై పని చేశాను. హైదరాబాద్, యాదగిరిగుట్ట పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ‘‘గోవిందుడు అందరివాడేలే, రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల్లో నటించాను. హీరోయిన్గా ఇదే తొలిచిత్రం’’ అన్నారు ఇషిక వర్మ. నటుడు రవి కిరణ్, సంగీత దర్శకుడు రాజా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజా, కెమెరా: వంశీ, సహనిర్మాతలు: రామ్ వశిష్ట, శ్రీనిత్య, హర్ష వర్ధన్, టి.మల్లికార్జున్ రావ్, జగదీశ్. -
ప్రయాణం మొదలు
హైడ్‌లైన్ చూసి మహేశ్ బాబు ఎక్కడికైనా ప్రయాణం మొదలెడుతున్నారు అనుకుంటున్నారా? అవును. అయితే ఇది వ్యక్తిగత ప్రయాణం కాదు.. సినిమా ప్రయాణం. ఆ ప్రయాణం గురించిన వివరాలు తెలియాలంటే ఆగస్ట్ 9వరకూ ఆగాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘దిల్’రాజు, అశ్వనీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది మహేశ్ 25వ చిత్రం. ఈ సినిమా లోగోను శనివారం మహేశ్ బాబు కుమార్తె సితార, వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 9న రిలీజ్ చేయనున్నారు. ‘‘ఆగస్ట్ 9న మా జర్నీ మొదలవుతుంది. మా జర్నీలో మీరూ ఓ భాగం అవ్వండి’’ అని పేర్కొన్నారు వంశీ పైడిపల్లి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. ∙సితార, ఆద్య -
రియల్ హైదరాబాద్
మనో ఆర్య, మహి వర్మ ముఖ్య తారలుగా మనోహర్ చిమ్మని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నమస్తే హైదరాబాద్’. ప్రదీప్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ దయాకర్ విడుదల చేసారు. దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ –‘‘హైదరాబాద్ అంటే ఒక అద్భుతం, ఒక ఫ్యాంటసీ, ఓ అమ్మ వొడి. ఇక్కడ అడుగుపెట్టిన అందర్నీ వారి గమ్యానికి కచ్చితంగా చేరుస్తుంది. హైదరాబాద్‌లోని యువతీ యువకుల జీవితాలు ఎలా ఉంటాయి? అనే కథతో మనోహర్ ఈ చిత్రం తెరకెక్కిస్తుండటం హ్యాపీ’’ అన్నారు. మనోహర్ చిమ్మని మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో రియలిస్టిక్‌గా సాగే చిత్రమిది. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఆశలు, ఆశయాలతో యువతీ యువకులు హైదరాబాద్‌కి వస్తుంటారు. ఈ మహానగరం వారిని ఎలా ప్రభావితం చేసి, వారి జీవితాలను ఏ గమ్యాలను చేరుస్తుందన్నదే కథాంశం. సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని ఆరు పాటలు హైదరాబాద్‌ని కొనియాడేలా ఉంటాయి’’ అన్నారు సంగీత దర్శకుడు, చిత్రనిర్మాత ప్రదీప్ చంద్ర. -
క్రీస్తు చరిత్ర
చండ్ర పార్వతమ్మ సమర్పణలో చండ్రస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న చిత్రం ‘లోకరక్షకుడు’. బ్రహ్మం సి.హెచ్. దర్శకత్వం వహిస్తున్నారు. గత నెల 29న లండన్ పార్లమెంట్లో చిత్రం లోగో విడుదల చేశారు. నేడు ఈస్టర్ పండగ సందర్భంగా చంద్రశేఖర్ చండ్ర మాట్లాడుతూ– ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రలోని కొత్త అంశాలతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాం.ఇంగ్లాండ్‌లో రెండో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. ఈ ఏడాది క్రిస్మస్కు చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని అన్నారు. ‘‘ఏసుక్రీస్తు జీవిత చరిత్రపై ఇదో మంచి సినిమా అవుతుంది. ఎక్కడ రాజీ అన్నదే లేకుండా చిత్రాన్ని నిర్మిచేందుకు నిర్మాతలు సహాయం చేస్తున్నారు’’ అని చిత్రదర్శకుడు బ్రహ్మం సి.హెచ్ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం: ఎ.కె రిసాల్ సాయి.