రియల్‌ హైదరాబాద్‌ | Namasthe Hyderabad Movie Logo Launch | Sakshi
Sakshi News home page

రియల్‌ హైదరాబాద్‌

Apr 17 2018 12:17 AM | Updated on Aug 28 2018 4:32 PM

Namasthe Hyderabad Movie Logo Launch - Sakshi

ఎన్‌.శంకర్, మనోహర్‌ చిమ్మని, దయాకర్‌

మనో ఆర్య, మహి వర్మ ముఖ్య తారలుగా మనోహర్‌ చిమ్మని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నమస్తే హైదరాబాద్‌’. ప్రదీప్‌ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని వరంగల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ దయాకర్‌ విడుదల చేసారు. దర్శకుడు ఎన్‌. శంకర్‌ మాట్లాడుతూ –‘‘హైదరాబాద్‌ అంటే ఒక అద్భుతం, ఒక ఫ్యాంటసీ, ఓ అమ్మ వొడి. ఇక్కడ అడుగుపెట్టిన అందర్నీ వారి గమ్యానికి కచ్చితంగా చేరుస్తుంది. హైదరాబాద్‌లోని యువతీ యువకుల జీవితాలు ఎలా ఉంటాయి? అనే కథతో మనోహర్‌ ఈ చిత్రం తెరకెక్కిస్తుండటం హ్యాపీ’’ అన్నారు.

మనోహర్‌ చిమ్మని మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌ నేపథ్యంలో రియలిస్టిక్‌గా సాగే చిత్రమిది. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ఆశలు, ఆశయాలతో యువతీ యువకులు హైదరాబాద్‌కి వస్తుంటారు. ఈ మహానగరం వారిని ఎలా ప్రభావితం చేసి, వారి జీవితాలను ఏ గమ్యాలను చేరుస్తుందన్నదే కథాంశం. సెప్టెంబర్‌లో సినిమాను రిలీజ్‌  చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని ఆరు పాటలు హైదరాబాద్‌ని కొనియాడేలా ఉంటాయి’’ అన్నారు సంగీత దర్శకుడు, చిత్రనిర్మాత ప్రదీప్‌ చంద్ర.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement