
అహ్మదాబాద్: ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేయ బోతున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ జట్టు లోగోను విడుదల చేసింది. ఎగిరే గాలిపటం ఆకారం స్ఫూర్తిగా ఈ లోగోను రూపొం దించినట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. ఉన్నత లక్ష్యాలను సాధించే జట్టుగా టైటాన్స్‌ను అభివర్ణించారు. గుజరాత్ సాంస్కృతిక వారసత్వంలో గాలిపటాలు భాగమని, ఉత్తరాయణ పండుగలో గాలిపటాలు ఎగరవేయ డం ఆనవాయితీ అని, అందుకే గుజరాత్ ఆకాంక్షలకు ప్రతీకగా తమ లోగో ఉందని అన్నారు. ఇది అంతులేని తమ జట్టు లక్ష్యాలను ప్రతిబింబిస్తుందన్నారు. ఆకాశం తాకే గాలిపటానికి ఎగరడమే తెలుసని... తమ జట్టు కూడా అదే విధంగా ఎదుగుతుందని లోగో ఆవిష్క రణ సందర్భంగా జట్టు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment