మహేశ్ బాబు, సితార, ఆద్య
హైడ్‌లైన్ చూసి మహేశ్ బాబు ఎక్కడికైనా ప్రయాణం మొదలెడుతున్నారు అనుకుంటున్నారా? అవును. అయితే ఇది వ్యక్తిగత ప్రయాణం కాదు.. సినిమా ప్రయాణం. ఆ ప్రయాణం గురించిన వివరాలు తెలియాలంటే ఆగస్ట్ 9వరకూ ఆగాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ‘దిల్’రాజు, అశ్వనీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది మహేశ్ 25వ చిత్రం.
ఈ సినిమా లోగోను శనివారం మహేశ్ బాబు కుమార్తె సితార, వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్య కలిసి రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్ట్ 9న రిలీజ్ చేయనున్నారు. ‘‘ఆగస్ట్ 9న మా జర్నీ మొదలవుతుంది. మా జర్నీలో మీరూ ఓ భాగం అవ్వండి’’ అని పేర్కొన్నారు వంశీ పైడిపల్లి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
∙సితార, ఆద్య
Comments
Please login to add a commentAdd a comment