సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే 35మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది.
తాజాగా ఈ పాటకు మహేశ్ కూతురు సితార అదిరిపోయే స్టెప్పులేసింది. కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ అచ్చం తండ్రిలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment