kalavathi
-
ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యా
సాక్షి, పార్వతీపురం మన్యం: ఏజెన్సీలో గిరిజన ప్రజలందరికీ నేను ఆత్మబంధువును. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఆడబిడ్డనయ్యాను. పదేళ్లుగా పాలకొండ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ప్రేమాభిమానాలు మున్ముందూ ఇలాగే సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. నియోజకవర్గంలోని 102 సచివాలయాల పరిధిలోని దాదాపు 78 వేల గడపల వద్దకు వెళ్లి వారందరితో మమేకమయ్యా. కష్టసుఖాలు తెలుసుకున్నా. ఇన్ని వేల కుటుంబాలను నాకు ఇచ్చింది జగనన్నే.’’ అని పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలకొండ నియోజకవర్గంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి, ఇంకా చేయబోయే పనులు..కూటమి దుష్ప్రచారం తదితర అంశాలను ‘సాక్షి’తో ముఖాముఖిలో ఆమె వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రజల కోసమే..పదవిమా కుటుంబంలో చాలామంది ఎమ్మెల్యేలున్నారు. నేను రెండుసార్లు గెలిచాను. పదవులు మాకు ము ఖ్యం కాదు. విలువలతో కూడిన ఎదుగుదల మా పెద్దల నుంచి నేర్చుకున్నా. అందుకే ఎప్పుడూ నిరా డంబరంగా ఉంటా. మా ప్రజల ప్రతి కష్టసుఖంలో నూ తోడుగా ఉంటా. వారితో కలిసిపోతాను. ఎప్పు డూ ప్రజల్లోనే ఉండాలని మా అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. అందుకే అందరూ నన్ను ఆశీర్వదిస్తూ, వారి బిడ్డగా చూసుకుంటారు. ఇప్పు డు ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ఎక్కడికక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మరింతగా ప్రజలకు సేవ చేసుకుంటాం.ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అయితేనే తమకు మేలు చేస్తాడన్న నమ్మకం, భరోసా గిరిజనులందరిలోనూ ఉందని వైఎస్సార్సీపీ పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వాస రాయి కళావతి అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వివిధ సంక్షేమ పథకాల కింద దాదాపు రూ.1,300 కోట్ల మేర నియోజకవర్గంలోని పేదలకు అందించామని చెప్పారు. నాన్ డీబీటీ కింద సుమారు రూ.218 కోట్ల మేర వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులు పొందారని వివరించారు. గడిచిన 59 నెలల కాలంలోనే ఇదంతా సాధించామని చెప్పారు. ఎన్నికలొచ్చాయని ప్రజల ముందుకు బూటకపు హామీలతో వస్తున్న విషపు కూటమి నేతలను ఎవరూ నమ్మవద్దని హితవు పలికారు.సంపూర్ణంగా మహిళా సాధికారత2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికీ అందాయి. జీవితాలను బాగు చేశాయి. గతంలో ఏ ప్రభుత్వమూ ఇన్ని పథకాలను విజయవంతంగా 99 శాతం అమలు చేసింది లేదు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఒడి పథకాన్ని రూ.17 వేలకు పెంచుతున్నాం. రైతులకు ఇచ్చే భరోసా మొత్తం రూ.16 వేలు అవుతుంది. దీనివల్ల రైతుకు మరింత సాయం అందించేవారమవుతాం. మహిళల సాధికారత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి పథకం మహిళలకే అందుతోంది. చేయూత పథకం ద్వారా ఎంతో మంది స్వయం ఉపాధి పొందారు. కొందరు భూములు, బంగారం కొనుగోలు చేసుకుని భవిష్యత్తు అవసరాలకు ఉంచుకున్నారు.నిన్ను ఎలా నమ్ముతారు బాబూ..గత టీడీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా గిరిజనులకు ఎటువంటి పథకాలూ అందలేదు. కనీసం రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు వంటివి కూడా లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఇంటికీ మేలు చేశాం. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూటమిగట్టి..బూటకపు హామీలిస్తున్నాయి. అవేవీ నమ్మశక్యంగా లేవు. 2014 మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని అమలు చేశారు? పోనీ, ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. కూటమిలోని బీజేపీ దూరంగా ఉంది. అంటే..దాని అమలు మీద వారిలో వారికే నమ్మకం లేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు..అభివృద్ధి అంటే ఇది కాదా?59 నెలల కాలంలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధి నియోజకవర్గంలో చేసి చూపించాం. కొన్ని పెండింగ్ పనులు మిగిలిపోయాయంటే..అది గత టీడీపీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరే. ఆ విషయం విజ్ఞులైన నియోజకవర్గ ప్రజలు, మేధావులందరికీ తెలుసు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 4,086 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాం. కిమ్మి–రుషింగి వంతెన నిర్మాణం రూ.27.50 కోట్లతో పూర్తి చేశాం. సీతంపేటలో సుమారు రూ.50 కోట్లతో మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. సీతంపేట ఆస్పత్రిని రూ.19 కోట్లతో అప్‌గ్రేడ్ చేశాం. టీటీడీ ద్వారా రూ.10 కోట్లతో ఆలయాన్ని నిర్మించాం. 146 దేవాలయాలకు ఒక్కో గుడికి రూ.10 లక్షలు చొప్పున టీటీడీ దేవస్థానం నుంచి మంజూరు చేయించాం. బత్తిలిలో రూ.2.5 కోట్లతో మోడల్ పోలీస్‌స్టేషన్ నిర్మాణం చేపట్టాం. నియోజకవర్గంలో రూ.214 కోట్లతో సుమారు 234 కి.మీ. మేర రోడ్లు, 41 కి.మీ మేర డ్రైన్లు వేశాం. 102 సచివాలయాల నిర్మాణం, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్ల నిర్మాణం, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి మా హయాంలోనే చేపట్టాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలు చొప్పున వెచ్చించి మరిన్ని పనులు చేశాం. సంక్షేమ పథకాల లబ్ధి కోసం మరో రూ.1,500 కోట్లకుపైగా వెచ్చించాం. ఇదంతా అభివృద్ధి కాదా? ముందు ప్రభుత్వాలు ఇవేవీ ఎందుకు చేయలేదు? మాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వీటికి సమాధానం చెప్పగలరా? కరోనా వంటి కష్టకాలంలో పేదలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా వారి వద్దకు వెళ్లగలుగుతున్నాం. పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం.పర్యాటకంగా అభివృద్ధి, ఉపాధిసీతంపేటలో పర్యాటకంగా అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. రూ.2.5 కోట్లతో అడలి వ్యూపాయింట్, గిరిజన మ్యూజియం అభివృద్ధితోపాటు, మరికొన్ని ప్రాంతాలు, జలపాతాలపై దృష్టి సారించాం. ఇప్పటికే ఇక్కడ అడ్వెంచర్పార్కు ఉంది. నేను అభివృద్ధి కోరుకునేదానిని. టూరిజం కోసం అప్పట్లోనే ప్రశ్నించా. యువతకు కూడా స్థానికంగా నే ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పరిశ్రమలు తె చ్చే ఆలోచన ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. దాదాపు 10 వేల మంది వరకూ ఇక్క డే ఉపాధి లభిస్తే బాగుంటుందన్నది నా ఆలోచన.కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు..కూటమి పేరుతో ఓట్ల కోసం వస్తున్న వారి గత చరిత్ర ఎలాంటిదో ఇక్కడ అందరికీ తెలుసు. వారి అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ప్రజలే ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారు. -
యథా సీఎం..తథా కళావతి
పాలకొండ రూరల్: సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఎలా మమేకమై..ఎంత ఆప్యాయంగా కలిసిపోతున్నారో రాష్ట్రప్రజలందరికీ విదితమే. యథా రా జా తథా ప్రజా అన్నట్లు తమ నాయకుడి బాటలోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమైపోతున్నారు. వారి కష్టాలను విని చలించిపోతున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న వైఎస్సార్సీపీ పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి విశ్వాసరాయి కళావతికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆమె పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న క్రమంలో వృద్ధురాలు పడాల కామమ్మ కళావతి చేతిలో ఉన్న జగనన్న చిత్రపటాన్ని చూసి దగ్గరకు వచ్చింది. తనకు జగన్ బాబు మనుమడని, ఆయన వల్లనే పింఛన్ వస్తోందంటూ సంతోషం వెలిబుచ్చింది. వలంటీర్లు లేకపోవడంతో రెండు నెలులుగా పింఛన్ కోసం తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది. దీంతో చలించిపోయిన కళావతి సదరు వృద్ధురాలిని ఆలింగనం చేసుకున్నారు. ప్రతిపక్షాల కుట్రే ఈ పరిస్థితికి కారణమని, మీరంతా జగనన్నను, తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, సంక్షేమం మీ గడప వద్దకే వలంటీర్ల ద్వారా అందిస్తామని చెప్పారు. ప్రజల సమక్షంలో కామమ్మను సన్మానించి, పాధాభివందనం చేశారు. అనుకోని ఈ ఘటనతో కళావతి సున్నిత మనస్తత్వానికి చప్పట్లతో స్థానికులు హర్షం తెలిపారు. జై జగన్ నినాదంతో ప్రజలు ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. -
ప్రజాసంక్షేమమే అభిమతం
పార్వతీపురం మన్యం: విశ్వసరాయి కళావతి.. సామాన్య గిరిజన మహిళ... తమ ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అవకాశం ఇవ్వడంతో 2014, 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేగా తనదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేయ డంలో సఫలమయ్యారు. ముచ్చటగా మూడోసారి విజయాన్ని అందుకునేందుకు ప్రచారం ఆరంభించారు. ఉగాది సందర్భంగా ‘సాక్షి’తో మంగళవారం కాసేపు ముచ్చటించారు. ఆమె మాటల్లోనే.. జగనన్న స్ఫూర్తితో.. 2014–19 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో టీడీపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించింది. నా నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంది. కానీ నేను వై.ఎస్.జగన్మోహన్రెడ్డినే స్ఫూర్తిగా తీసుకున్నాను. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒకే మాట మీద నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం. నిత్యం ప్రజలతోనే ఉండాలన్నది జగన్ మాకు చూపిన బాట. ప్రజా జీవితంలో ఉన్నంతకాలం ఆయన చూపిన బాటలోనే సాగుతాం. ఆ స్ఫూర్తే గత రెండు ఎన్నికల్లో విజయా న్ని చేకూర్చింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. గిరిజనాభివృద్దికి పెద్దపీట... ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా అందజేస్తోంది. జిల్లాలో 54 వేల ఎకరాలకు సంబంధించిన పట్టాలను గిరిజనులకు ఇచ్చారు. వారందరికీ వైఎస్సార్ రైతు భరోరోసా పథకం కింద ఏటా పెట్టుబడి సాయం అందుతోంది. ఏజెన్సీలోని గ్రామ సచివాలయాలన్నింటిలోను ఉద్యోగాలను గిరిజన అభ్యర్థులకే ఇవ్వడం జగన్మోహన్రెడ్డి అందించిన గొప్ప వరం. 50 ఏళ్లు నిండిన ప్రతీ గిరిజనుడికి వైఎస్సార్ పింఛన్‌కానుక అందిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం. సాంకేతిక కారణాల వల్ల ప్రజల్లో ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోయినా, మరే ఇతర సమస్యలు ఉన్నా వలంటీర్లు వ్యవస్థ ద్వారా గుర్తించాం. క్షేత్ర స్థాయిలో వాటిని వెంటనే పరిష్కరించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడింది. ప్రతీ సచివాలయం పరిధిలో రూ. 20 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం అవసరాల దృష్ట్యా రూ.40 లక్షలు చొప్పున కేటాయించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి కృషిచేశారు. ప్రగతి పథం.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అవినీతి, అక్రమాలకు తావులేకుండా వందలాది కోట్ల రూపాయాలతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారు. టీడీపీ వదిలేసిన తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులకు రూ.193 కోట్లతో జీవంపోశారు. రూ.38 కోట్ల ఉపాధిహామీ నిధులతో గ్రామీ ణ రోడ్లు బాగుచేశారు. రూ.34.64 కోట్ల వ్యయంతో 93 గ్రామ సచివాలయాలు, రూ.21.25 కోట్ల ఖర్చుతో ఆర్బీకేలు నిర్మించారు. నాడు–నేడు నిధు లు రూ.19.57 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ భవనాలను అభివృద్ధి చేశాం. వివిధ సంక్షేమ, అభివృద్ది పనులను చేపట్టి ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు తీసుకువచ్చాం. అందుకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడుగుతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నాం. -
కథల అమ్మమ్మ
నాగరకత ముసుగులో... ఆదివాసీలకు ఆధునిక సమాజం పెట్టే పరీక్షలు... అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు... పల్లెపదాలు... జానపదజావళులకు... ఆమె అక్షరమైంది. అలాగే... అమెరికా ప్రకృతి అందాలు... మనవాళ్ల ప్రగతి సుగంధాలు కూడ. ఆరుపదులు దాటిన ఆమెలోని రచయిత్రి...ఇప్పుడు... పిల్లలకు కథల అమ్మమ్మ అవుతోంది. విజయనగరం జిల్లా... స్వచ్ఛతకు, అమాయకత్వానికి నిలయం. అణచివేత, దోపిడీలను ప్రశ్నించే గళాలను పుట్టించిన నేల. ఇంటి గడపలే సప్తస్వరాలుగా సరిగమలు పలికే గుమ్మాలు ఒకవైపు. అరాచకాన్ని ఎదిరిస్తూ గళమెత్తిన స్వరాలు మరొకవైపు... పడుగుపేకల్లా అల్లుకుని సాగిన జీవన వైవిధ్యానికి ప్రత్యక్ష సాక్షి కోరుపోలు కళావతి. నాటి అమానవీయ సంఘటనలకు సజీవ సాక్ష్యాలు ఆమె రచనలు. చదివింది పదవ తరగతే. కానీ ‘వాస్తవాలను కళ్లకు కట్టడానికి గొప్ప పాండిత్యం అవసరం లేదు, అన్యాయానికి అక్షరరూపం ఇవ్వగలిగితే చాలు. వాస్తవ జీవితాలు చెప్పే నీతి సూత్రం కంటే పాండిత్యం చెప్పగలిగిన న్యాయసూత్రం పెద్దదేమీ కాద’ని నిరూపిస్తోందామె. ఇటీవల ‘మన్యంలో మధురకోయిల’ రచనను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అక్షర జ్ఞాపకాలివి. ‘‘మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం. మా నాన్న పెదపెంకి కూర్మినాయుడు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. వంగపండు ప్రసాదరావుగారితో కలిసి ప్రజాచైతన్యం కోసం పనిచేశారు. నేను చదివింది పదవ తరగతి వరకే. కానీ రాయాలనే దాహం తీరనంతగా ఉండేది. యద్దనపూడి సులోచనారాణి పెద్ద చదువులు చదవకపోయినా లెక్కలేనన్ని నవలలు రాశారని తెలిసి నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆమె స్ఫూర్తితోనే రచనలు మొదలుపెట్టాను. మా వారు టాటా స్టీల్‌లో అధికారి కావడంతో పెళ్లి తర్వాత మేము పాతికేళ్లపాటు ‘కడ్మా’లో నివసించాం. కడ్మా అనేది జార్ఖండ్‌లో జెమ్షెడ్పూర్ నగరానికి సమీపంలో, టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులు నివసించేప్రాంతం. అక్కడ అన్నిప్రాంతాలు, రకరకాల భాషల వాళ్లతో కలిసి జీవించడం నాకు మంచి అనుభవం. పిల్లలు పెద్దయ్యే వరకు ఇంటి బాధ్యతలే ప్రధానంగా గడిచిపోయింది నా జీవితం. కడ్మాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఉగాది సంచిక కోసం వ్యాసాలు సేకరించడం, రాయడంతో సంతోషపడేదాన్ని. పదిహేనేళ్ల కిందట యూఎస్‌లో ఉన్న మా అమ్మాయి దగ్గర కొంతకాలం ఉన్నాను. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి ప్రకృతి, మనవాళ్లు సాధిస్తున్న ప్రగతిని ‘అమెరికా అందాలు గంధాలు’ పేరుతో నవల రాశాను. అదే తొలి నవల. నేను రాయగలననే నమ్మకం వచ్చిన రచన కూడా. ఆ తర్వాత మా జిల్లా సంగీత కౌశలాన్ని వివరిస్తూ ‘భారత్‌లో భాసిల్లిన విద్యల నగర సౌధము’ రాశాను. మా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు జీవితాన్ని చిన్న పదాలతో అల్లేసి, రాగయుక్తంగా పాడుతారు. ఆ వైనాన్ని ‘జానపద జావళి’ పేరుతో రాశాను. ఆదివాసీల స్వచ్ఛతకు అద్దం పట్టే ‘గడ్డిగులాబీలు’, ప్రతిమ, చిగురించే ఆశలు, వసివాడిన వసంతం, అవనిలో ఆంధ్రావని, జీవన స్రవంతి... ఇలా రాస్తూ ఉన్నాను, రాయడంలో ఉన్న సంతోషాన్ని ఇనుమడింప చేసుకుంటున్నాను. ‘మన్యంలో మధురకోయిల’ సుమారు యాభై ఏళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన మన్యం బాలికల యదార్థగాధ. అంతకుమునుపు రాసిన ‘ప్రతిమ’ అరకు చుట్టూ సాగింది. ఒక ఫొటోగ్రాఫర్ అరకు ప్రకృతి సౌందర్యాన్ని, అడవిబిడ్డ అచ్చమైన స్వచ్ఛతను ఫొటో తీయడానికి తరచూ వస్తుండేవాడు. ఒక గిరిజన అమ్మాయిని ఫొటోలు తీసి, పోటీకి పంపించి అవార్డు తెచ్చుకుంటాడు కూడా. ఫొటోల పేరుతో మళ్లీ అరకు బాట పట్టిన ఆ ఫొటోగ్రాఫర్ అవకాశవాదం నుంచి తమ అడవి బిడ్డను కాపాడుకోవడానికి గిరిజనులు పెట్టిన ఆంక్షలకు కథారూపమిచ్చాను. ఆలయాలు సరే... ఆశ్రమాలూ కట్టండి! నన్ను నేను వ్యక్తం చేసుకునే అవకాశాన్నిచ్చింది అక్షరమే. కథ అంటే ఊహల్లో నుంచి రూపుదిద్దుకోవాలని అనడం కూడా విన్నాను. కానీ నా కథాంశాలన్నీ వాస్తవాలే. అమెరికాలో మనవాళ్లు... మన సంస్కృతికి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మిస్తుంటారు. భాషల పరంగా సంఘాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కానీ భారతీయుల కోసం ఒక్క వృద్ధాశ్రమాన్నయినా కట్టారా? వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంగ్లిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలోనే చేరుస్తారు. అక్కడ మనవాళ్లకు భాష తెలియక పోవడంతో మాట రాని మూగవాళ్లుగా జీవిస్తుంటారు. అదే మన భారతీయులే వృద్ధాశ్రమాలను నిర్మించి నిర్వహిస్తే... రిటైర్ అయిన తల్లిదండ్రులు మన ఆహారం తింటూ, మన భాష వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ సేదదీరుతారు కదా! అలాగే పండుగలు, సెలవులప్పుడు వీలు చూసుకుని కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు వెళ్లి కలవడానికి వీలవుతుంది. నాకు కలిగిన ఈ ఆలోచననే ఆ రచనలో చెప్పాను. నా అక్షరాలకు చిత్ర రూపం! నా రచనలకు ముఖచిత్రం నా మనుమరాలు హర్షిత వేస్తుంది. తను సెవెన్త్ క్లాస్, ఇంగ్లిష్‌లో చిన్న చిన్న కథలు సొంతంగా రాస్తుంది. యూఎస్‌లో ఉన్న పెద్ద మనుమరాలు నందిని నా తొలి నవలను ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తానని తీసుకువెళ్లింది. నా ఇద్దరబ్బాయిలూ విజయనగరంలో ఇంజనీర్లే. నేను, మా వారు వాళ్ల దగ్గర శేషజీవితాన్ని గడుపుతున్నాం. నా రచనల్లో కర్పూరకళిక, వలస వచ్చిన వసంతం, వాడినపూలే వికసించునులే, కలలగూడు’ వంటి వాటికి పుస్తకరూపం ఇవ్వాలి. పిల్లలకు కథలు చెప్పే నానమ్మలు, అమ్మమ్మలు కరవైన ఈ రోజుల్లో ‘బాలానందం’ పేరుతో పిల్లల కథల పుస్తకం రాశాను. అది ముద్రణ దశలో ఉంది. అక్షరంతో స్నేహం... నాకు జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలను ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్నిచ్చింది. నా ఈ స్నేహిత ఎప్పటికీ నాతోనే ఉంటుంది’’ అన్నారు కళావతి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: కంది గౌరీ శంకర్, సాక్షి, విజయనగరం తొలివాక్యం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది! నేను రాసిన తొలివాక్యం ‘కొట్టు కొనమంటుంది– పోట్ట తినమంటుంది’. ఈ వాక్యానికి ఐదు రూపాయల పారితోషికం అందుకున్నాను. ఆ ఐదు రూపాయలను ఖర్చు చేయకుండా చాలా ఏళ్లు దాచుకున్నాను. అప్పుడు నేను ఐదవ తరగతి. చందమామ పత్రికలో ఫొటో ఇచ్చి ఒక వాక్యంలో వ్యాఖ్యానం రాయమనేవారు. మా పెద్దన్నయ్య భాస్కరరావు పుస్తకం తెచ్చిచ్చి క్యాప్షన్ రాయమన్నాడు. ‘ఒక చిన్న కుర్రాడు ఆకలితో పచారీ కొట్టు ముందు బేలగా నిలబడి వేలాడదీసిన అరటి గెల వైపు చేయి చూపిస్తూ ఉన్నాడు. కొట్టతడేమో డబ్బిస్తేనే ఇస్తానంటూ కసురుకుంటున్నాడు’ ఇదీ అందులో విషయం. ఆ తొలివాక్యమే కవయిత్రి కావాలనే కలకు కారణం అయింది. నేను చూసిన సంఘటనలు, నా గమనింపునకు వచ్చిన అంశాలు కొత్త రచనకు ఇంధనాలయి తీరుతాయి. అలా ఒక వాక్యంతో మొదలైన నా అక్షరవాహిని జీవనదిలా సాగుతోంది. – కోరుపోలు కళావతి,రైటర్ -
మనం కలిసికట్టుగా మళ్ళీ సీఎం జగన్నే గెలిపించుకుందాం
-
ఎమ్మెల్యే కళావతికి మరోసారి అస్వస్థత..
సాక్షి, పాలకొండ: ప్రజా సేవకై అలుపెరగకుండా, రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాల్లో పాల్గొంటూ పాలకొండ నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో నిర్విరామంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 21న దోనుబాయిలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె అస్వస్థత గురయ్యారు. కాగా, గత నాలుగు రోజులుగా స్వగ్రామం వండవలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కళావతి బుధవారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే ఆమెను పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్సలు అందించారు. సామాన్య ప్రజలలాగే ఆమె ఏరియా ఆసుపత్రిలో చేరారు. దీంతో సూపరింటెండెంట్ జి. నాగభూషణరావు, ఆర్.ఎం జె.రవీంద్రకుమార్.. ఎమ్మెల్యే కళావతికి వైద్య చికిత్సలు అందజేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండి వైద్య చికిత్సలు పొందిన ఎమ్మెల్యే కళావతి సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం, నెల రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. కాగా, ఏరియా ఆసుపత్రిలోని వైద్య సేవలపై ఎమ్మెల్యే కళావతి సంతృప్తి వ్యక్తం చేశారు. అలుపెరగని ప్రజాసేవ.. పాలకొండ ఎమ్మెల్యే విశ్వానరాయి కళావతి 2014 నుండి 2019 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజల పట్ల ఆమెకున్న దీక్షా దక్షతను చూసి 2019లో మరో మారు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా అఖండ విజయం కట్టబెట్టారు. ప్రతి పక్షం నుండి అధికార పక్షంలో అడుగుపెట్టిన కళావతికి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడమే పనిగా మారింది. దీంతో 2019లో అధికారం వచ్చిన తర్వాత నుండి ప్రజా సేవలోనే మమేకమవుతూ వస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేదా తెలుసుకునేందుకు ముందుకు సాగారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 21వ తేదీ వరకు నియోజకవర్గంలో 32 పంచాయతీల్లో 82 రోజుల పాటు అవిశ్రాంతంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇలా ప్రజల సుఖాలు తెలుసుకుంటూ వారికి బాసటగా నిలిచారు. అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 21న దోనుబాయిలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో, తమ అభిమాన ఎమ్మెల్యే కళావతి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. -
ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి బొడ్డున ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజు అనే దళిత యువకుని దారుణ హత్య... మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో స్పష్టం చేస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన అస్రీన్ సుల్తానా అనే యువతి, వికారాబాద్‌కు చెందిన నాగరాజు ప్రేమించుకొని మూడు నెలల క్రితం ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీన్ని సహించలేకపోయిన సుల్తానా సోదరుడు, అతడి స్నేహితులు హైదరాబాద్‌లో నాగరాజుపై దాడి చేసి, హత్య చేశారు. నాగరాజుపై పదిహేను నిముషాల పాటు వరుసగా రాడ్లతో దాడి చేసారనీ... జనం చూస్తూ వీడియోలు తీస్తున్నారు తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదనీ, తాను ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకొచ్చి సాయపడలేదనీ, వాళ్ళను వేడుకొంటూ తాను సమ యాన్ని వృథా చేసాననీ సుల్తానా మీడియా ముందు వాపోయింది. గతంలోనే తన సోదరుడు ఈ పెళ్ళి చేసు కోవద్దని తనను బాగా కొట్టాడనీ, ఉరివేసి చంపడానికి ప్రయత్నించాడనీ, తనను ఉరి వేసుకుని చనిపొమ్మని ఆదేశించాడనీ కూడా తెలిపింది. గతంలో రెండుసార్లు తాము పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తమకు ప్రాణహాని ఉందనీ, రక్షణ కలిగించాలనీ విజ్ఞప్తి చేసినట్లుగా కూడా ఆమె తెలియజేసింది. ఇక్కడ అనేక విషయాలు మనల్ని ఆలోచింప జేస్తున్నాయి. మన వ్యవస్థలన్నీ ఇంత నిర్వీర్యం అయిపోయాయా? మనం ఇంత క్రూరమైన సమాజంలో నివసిస్తున్నామా? వీటిని నిరోధించే అవకాశమే లేదా? మనలో కూడా తెలిసిగానీ తెలియకుండా గానీ ఇలాంటి అమానుషత్వం దాగి ఉన్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకా ఈ అంశం ఇవ్వాళ ఎన్నో రకాల చర్చలకు, సమాలోచనలకు కేంద్రంగా నిలిచింది. సాధారణంగానే దళిత సంఘాలు ముస్లిం సంఘాల మీద కోపాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలపై హిందూత్వ శక్తులు దాడులు చేసిన ఎన్నో సందర్భాలలో ఆ బాధ తెలిసిన దళితులుగా తాము ముస్లింలకు మద్ధతుగా నిలిచామనీ, ఇప్పుడు ముస్లింల చేతిలో దళిత యువకుడు హత్యకు గురికావడం తట్టు కోలేనిదిగా ఉందనీ అభిప్రాయాలు వచ్చాయి. పలు ముస్లిం సంఘాలు కూడా తమకు దళితులపై గౌరవం ఉందనీ, ఈ హత్యను ఖండిస్తున్నామనీ, నిందితులను కఠినంగా శిక్షించాలనీ ప్రకటనలు చేశాయి. ఈ హత్యను వ్యక్తిగతంగానే చూడాలనీ, ఇది రాజకీయమైనది కాదనీ కొందర న్నారు. (ఆ హత్యను ఖండిస్తున్నాం) పైకి ఇది పరువు హత్యగా కనిపిస్తుంది. కానీ దీని వెనక సమాజంలో వేళ్ళూనుకు పోయి ఉన్న మౌఢ్యాల చరిత్ర, కొత్త తరాలకు సరైన విలువలు, ఆదర్శాల్ని ఇవ్వలేకపోతున్న ఆధునికతా వైఫల్యాలు దాగి ఉన్నాయి. – జి. కళావతి ‘అధ్యాపక జ్వాల’ సహాయ సంపాదకులు -
'కళావతి' పాటకు మహేశ్ బాబు కూతురు సితార స్టెప్పులు
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే 35మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ పాటకు మహేశ్ కూతురు సితార అదిరిపోయే స్టెప్పులేసింది. కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ అచ్చం తండ్రిలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
అంగన్వాడీ ఆయా మృతి.. హరీశ్‌రావు దిగ్భ్రాంతి
గజ్వేల్: తన జీవితంలో వెలుగొస్తుందని ఎదురు చూసిన ఆమె ఆశ.. ఆడియాసగానే మిగిలింది. చివరకు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆపరేషన్‌లో కాళ్లు, చేతులు కోల్పోయి జీవచ్ఛవంలా మారిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పెరగడంతో తుదిశ్వాస విడిచింది. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్వాడీ ఆయా కళావతి విషాధాంతమిది. దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన అంగన్వాడీ ఆయా కరికె కళావతి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాల్లో అపశృతి చోటు చేసుకొని విద్యుత్‌షాక్‌తో తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్న కళావతిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా.. సరైన వైద్యం అందించలేమని చేతులెత్తేయడంతో తిరిగి గజ్వేల్‌కు తీసుకొచ్చారు. 20 రోజులుగా ఆమె గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళావతి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఈనెల 7న స్వయంగా ఆసుపత్రిని సందర్శించి కళావతి పరిస్థితిని పరిశీలించి చలించిపోయారు. తక్షణ సాయం కింద రూ. 50 వేలు అందించడమే గాకుండా ఆమెను కాపాడడానికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్‌ను ఆదేశించారు. ఈ క్రమంలోనే కళావతి విద్యుత్‌షాక్‌కు గురైన చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ అగిపోవడమే గాకుండా ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని గుర్తించిన వైద్యులు ఈనెల 10న శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా మోకాళ్ల కింది వరకు రెండు కాళ్లను, మోచేతి కిందికి ఎడమ చేయిని, మోచితిపైకి కుడి చేయిని తొలగించారు. అయినా తన జీవితంలో వెలుగొస్తుందనే ఆశతో ఆమె ఎదురు చూస్తూ వచ్చింది. ఆపరేషన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటల ప్రాంతంలో కళావతి తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ తెలిపారు. కాగా కళావతి విషాధ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలు కుటుంబీకులకు సానుభూతిని ప్రకటించారు. ఇదిలా ఉంటే జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్‌రెడ్డి అక్కడికి చేరుకొని మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రూ. 50 వేల సాయాన్ని అందజేశారు. కళావతి కుటుంబాన్ని ఆదుకుంటాం.. సిద్దిపేటజోన్: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కళావతి బుధవారం మృతి చెందడం పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల ప్రగాడ సంతాపాన్ని తెలియచేస్తు కళావతి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అదుకుంటామని భరోసా ఇచ్చారు. గత 20 రోజులుగా ఇటిన్సీవ్ కేర్ యూనిట్లో శాస్ర చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ కళావతి మృతి చెందడం కలచివేసిందన్నారు. ఆమె కుటుంబానికి ఇన్స్‌రెన్స్ బీమాను అందించడంతో పాటు అండగా ఉంటామని సృష్టం చేశారు. -
విషాదం మిగిల్చిన విద్యుత్‌షాక్
గజ్వేల్: విద్యుత్ షాక్ ఆమెకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. చేతులు, కాళ్లను కోల్పోవాల్సిన దయనీయ స్థితిని కల్పించింది. ఇన్ఫెక్షన్ పెరిగిపోవడంతో అవయవాలను తొలగించక తప్పని పరిస్థితి నెలకొన్నది. వివరాలిలా ఉన్నాయి... దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన అంగన్వాడీ ఆయా కరికె కళావతి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంబరాల్లో అపశృతి చోటు చేసుకొని విద్యుత్‌షాక్‌తో తీవ్రగాయాల పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్న కళావతిని హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించగా... సరైన వైద్యం అందించలేమని చేతులెత్తేయడంతో తిరిగి గజ్వేల్‌కు తెచ్చారు. గత వారం రోజులుగా ఆమె గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళావతి దయనీయ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఈనెల 7న స్వయంగా ఆసుపత్రిని సందర్శించి కళావతి పరిస్థితిని పరిశీలించి చలించిపోయారు. తక్షణ సాయం కింద రూ. 50వేలు అందించడమేగాకుండా ఆమెను కాపాడడానికి అవసరమైన శస్త్ర చికిత్సలు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్‌ను ఆదేశించారు. అంతేగాకుండా ఆమెకు జీవితకాలం ప్రభుత్వ వేతనం అందేలా చూస్తానని, ఆమె అవసరాల కోసం అవసరమైన నగదును కూడా వ్యక్తిగత ఖాతాలో జమచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే బుధవారం కళావతి విద్యుత్‌షాక్‌కు గురైన చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ అగిపోవడమేగాకుండా ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని గుర్తించిన వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా మోకాళ్ల కింది వరకు రెండు కాళ్లను, మోచేతి కిందికి ఎడమ చేయిని, మోచితిపైకి కుడి చెయ్యిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సలో ముగ్గురు ఆర్థోపెడిషియన్లు, ముగ్గురు మత్తు మందు డాక్టర్లు, ఒక సర్జన్, ఐదుగురు స్టాఫ్ నర్సులు, ఇద్దరు థియేటర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. కళావతికి జరిగిన శస్త్ర చికిత్స తన కేరీర్‌లోనే అరుదైనదిగా డాక్టర్ మహేష్ అభివర్ణించారు. మరో పదిహేను రోజుల పాటు ఇక్కడే కళావతి తమ పరిశీలనలో ఉంటుందని పేర్కొన్నారు. -
సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మహిళల్లో ధైర్యం వచ్చింది
-
ప్రజా సంక్షేమమే ధ్యేయం
సాక్షి, పాలకొండ రూరల్ (శ్రీకాకుళం): రాజకీయ జీవితంలో ఎప్పుడూ అవినీతి మరకలు అంటని నేత. నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం. మాయ మాటలు చెప్పడం రాదు. నమ్మిన వాళ్లను అక్కున చేర్చుకుంటారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా నిరాడంబర జీవితం గడపడంలో ఆమెకు ఆమే సాటి. ఆమే వైఎస్సార్సీపీ పాలకొండ అసెంబ్లీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల అండదండలతో ఫ్యాన్ హోరు గాలిలో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం అధికంగా ఉండే ఈ రోజుల్లో.. ప్రజల విశ్వాస నియత, ప్రేమానురాగాలతో విజయ సాధనకు కృషి చేస్తున్నారు. కళావతితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. సాక్షి: నియోజకవర్గ ప్రజలతో ఎలా మమేకమయ్యారు? కళావతి: ఈ ప్రాంతంలో పుట్టిన ఆదివాసీ బిడ్డగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి వారి కష్టాలు తెలసుకున్నాను. ఆసెంబ్లీలో ప్రాంత సమస్యలపై గళమెత్తాను. అధికారం లేకపోయినా నçన్ను ప్రజలు ఆదరించారు. అధికార పార్టీ నన్ను ఇబ్బంది పెట్టినా ప్రజలు నాకు అండగా నిలిచారు. సాక్షి: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలు ఏమిటి? కళావతి: ఈ ప్రాంతలంలో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాగు నీరు లేక ఏటా వారు పడుతున్న కష్టాలు నన్ను కలచి వేశాయి. అలాగే గిరిజనులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ఏనుగుల సమస్యతో సతమతమవుతున్నారు. భామిని మండంలో వంశధార పనులు, జంపరకోట జలాశయం వంటి సాగునీటి ప్రాజెక్టుల సమ్యలు వేధిస్తున్నాయి. సాక్షి: సమస్యల పరిష్కారానికి ఏలా కృషి చేస్తారు? కళావతి: ఇప్పటికే నియోజకవర్గ సమస్యలు మా పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను. పాదయాత్ర ద్వారా జగన్ ఇక్కడి సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పాలకొండ నియోజవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇక్కడి బహిరంగ సభలో కూడా చెప్పారు. ఆయన మాటపై నమ్మకం ఉంది. అవసరమైతే నేను ఈ ప్రాంత అభివృద్ధికి పోరాటాలకు వెనుకాడను. సాక్షి: నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? కళావతి: నియోజకవర్గంలో యువత, నిరుద్యోగులు ఉపాధి లేక వలసలు పోతున్నారు. దీనిపై దృష్టి పెడతాను. ఈ ప్రాంతంలో చిన్నతరహా పరిశ్రములు ఏర్పాటుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ పారిశ్రామికికరణతోపాటు చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటాం. తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి, ఆర్థిక పురోగతి చేకూరుతుంది. సాక్షి: పట్టణ ప్రజల అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? కళావతి: పాలకొండ పట్టణంలో ఇంటి పన్నులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమిస్తాం. అలాగే తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. నన్ను నమ్మిన ప్రజలకు ఊపిరి ఉన్నంతవరకు సేవలందిస్తాను. సాక్షి: ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మీ వ్యూహాలు ఏమిటి? కళావతి: నేను వ్యూహాలతో విజయం సాధించే వ్యక్తిని కాను. ఎందుకంటే నేను ప్రజల మనిషిని. నా విశ్వసనీయత, జగనన్నపై ప్రజలకున్న విశ్వాసమే నన్ను విజయతీరం దాటిస్తుంది. టీడీపీ మాదిరి అధికారం కోసం అడ్డదారులు తొక్కను. గడిచిన ఐదేళ్లలో ఎన్నో ప్రలోభాలకు అధికారు పార్టీ గురిచేసింది. తలొగ్గలేదు. చివరకు నా ప్రోటోకాల్‌ను సైతం పక్కనపెట్టి అవమాన పర్చినా భరించాను. దీనిని ప్రజలు గమనించారు. ప్రజా ఆశీస్సులే తిరుగులేని విజయానికి బాటలు వేస్తాయన్న నమ్మకముంది. సాక్షి: టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరు ఎలా న్యాయం చేస్తారు? కళావతి: టీడీపీ పాలనలో ప్రజలే కాదు నేను ఇబ్బందులు పడ్డాను. ఓ మహిళగా ప్రజల కష్టాలను ఐదేళ్లగా దగ్గరగా చూశాను. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తాను. ఎటువంటి వివక్ష లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరీ సమస్య పరిష్కరానికి ఎంత దూరమైనా వెళ్తాను. -
మాయమాటలతో మోసగించడమేనా!
శ్రీకాకుళం , వీరఘట్టం: జన్మభూమి–మాఊరు గ్రామసభల ద్వారా మరోసారి మాయమాటలతో ప్రజలను మోసగించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. స్వగ్రామం వండువలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత ఐదు విడతల్లో చేపట్టిన జన్మభూమి–మాఊరు గ్రామ సభల్లో ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదని అన్నారు. టీడీపీ ప్రచారం కోసం ప్రజాధనం వృథా చేస్తోందన్నారు. జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జన్మభూమి కమిటీలు పక్షపాత ధోరణిలో పచ్చ చొక్కాలకే కట్టబెడుతున్నాయని మండిపడ్డారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందజేయడంలో అధికార యంత్రాంగం కూడా విఫలమైందని, పూర్తిగా పచ్చచొక్కాలకే దాసోహమంటూ ఊడిగం చేయడం భావ్యంకాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి పథకంలో ఇంటింటా సర్వే చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇంటిలోనే ఉండి అధికారులు సర్వేల పేరుతో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు రాకుండా చేయడం పద్ధతిగా లేదని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు మాయమాటలు చెప్పి రూ.10 వేలు రుణమాఫీ చేస్తామని చెప్పి దానిని విడతల వారీగా వారి ఖాతాల్లోకి మళ్లీస్తామన్నారు. ఇంతవరకు ఎంతమందికి రుణమాఫీ వర్తించిందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు మరోసారి గారఢీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకే జన్మభూమి అంటూ టీడీపీ డ్రామాలు ఆడుతుందన్నారు. -
రజనీకాంత్ ఇంట్లో విషాదం
చెన్నై, పెరంబూరు: నటుడు రజనీకాంత్ అన్నయ్య సత్యనారాణన్ భార్య కళావతిబాయి (70) ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బెంగళూర్‌లో కన్నుమూశారు. ఆమె అంతిమ చూపు కోసం రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో సహా సోమవారం ఉదయం బెంగళూర్ వెళ్లారు. రజనీకాంత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నయ్య సత్యనారాయణన్, వదిన కళావతి వద్దే పెరిగారు. రజనీకాంత్‌ను చెన్నైకి పంపి, నటుడయ్యే వరకూ ఆయన బాగోగులు అన్నయ్య వదినలే చూసుకున్నారు. ఇదిలాఉండగా రజనీకాంత్ వదిన కళావతిబాయి గత కొంత కాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. బెంగళూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె వైద్యం ఫలించక ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. కళావతిబాయి మరరణ వార్త విన్న రజనీకాంత్ సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా విమానం ద్వారా బెంగళూర్ వెళ్లారు. కళావతిబాయికి సోమవారం సాయంత్రం బెంగళూర్‌లో అంత్యక్రియలు జరిగాయి. -
మహిళా శక్తిని మేల్కొలుపుతూ..
జనగామ అర్బన్: జనగామ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వృత్తిలో రాణిస్తునే సమాజాన్ని మేల్కొలిపేలా కవితలు రచిస్తూ తోటి మహిళకు స్ఫూర్తినిస్తున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన గుంటిపల్లి కళావతి చిన్నతనం నుంచే కష్టాలను అనుభవించింది. సమాజంలో ఆడపిల్లలపై వివక్షను గుర్తించింది. రాజ్యాంగంలోని హక్కులపై బాలికలు, మహిళల్లో అవగాహన కల్పిస్తేనే గానీ ‘మహిళా సాధికారత’ సిద్ధిస్తుందని తెలుసుకుంది. ఇందుకోసం సమాజాన్ని చైతన్యం చేసే పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. 2000 సంవత్సరంలో బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరింది. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూనే తన రచనలతో విలువైన సందేశాలను ఇస్తోంది. సంపాదకురాలిగా.. సమాజంలో స్త్రీ స్థానానికి ఉన్న గౌరవాన్ని వివరించే ప్రయత్నంలో భాగంగా ‘అన్వేషణ’, ‘ఆమెను చూసారా..!’ పేర్లతో వంద కవితలను రచించింది. ‘అధ్యాపక జ్వాల’ పత్రికకు సంపాదకురాలిగా పనిచేస్తూ పలు పుస్తకాల ఆవిష్కరించింది. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లో రాష్ట్ర కౌన్సిలర్‌గా వ్యవహరిస్తోంది. బాలల హక్కులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తోంది.ఉత్తమ సేవలకు గానూ కళావతికి 2013లో లయన్స్ క్లబ్ వారు ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును అందజేశారు. అలాగే, 2016, 2017లో సావిత్రిబాయి పూలే అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం ఆమె జనగామ మండలం లింగాలఘణపురం మండలం నవాబుపేట హైస్కూల్లో విధులు నిర్వర్తిస్తోంది. హక్కులపై అవగాహన పెరగాలి మహిళలు హక్కులపై అవగాహన పెంచుకోవాలి. న్యాయం వైపు ధైర్యంగా నిలబడాలన్న స్పృహ కలిగినప్పుడే మహిళా సాధికారతకు అర్థం ఉంటుంది. సమాజంలో లింగ వివక్షను రూపుమాపాలి. మహిళలకు హాని కలిగించే ఏ చర్యలను ప్రోత్సహించొద్దు. గుంటిపల్లి కళావతి, ప్రభుత్వ ఉపాధ్యాయులురాలు -
పథకాలు అడిగితే బినామీలంటారా..
పాలకొండ రూరల్: జన్మభూమి గ్రామసభల్లో పథకాలు వర్తింపజేయాలని గట్టిగా అడిగిన వారిని బినామీలుగా మంత్రి కళావెంకటరావు వ్యాఖ్యానించడం తగదని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ గత నాలుగు జన్మభూమి సభల్లోనూ అర్జీలు చేసుకున్న వారే తాజా గ్రామసభలోనూ దరఖాస్తు చేసుకున్నారని, అయినా వారికి న్యాయం జరగడం లేదన్నారు. పక్షపాత ధోరణితో జన్మభూమి కమిటీలు అర్హులకుఅన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు పింఛన్ల కోసం దరఖాస్తులు అందిస్తే వారికి కొత్త పేర్లు పెట్టి అవమానించటం శోచనీయమన్నారు. ఆన్లైన్లో నమోదు ఉంటే వారు అర్హులనే విషయాన్ని మంత్రి గుర్తించాలన్నారు. పచ్చ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు కట్టపెట్టిన అధికార పార్టీని ప్రజలు అన్నిచోట్టా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం తప్పదన్నారు. -
ప్రతిభావంత విద్యార్థినికి అభినందనలు
అనంతపురం రూరల్ : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ విద్యార్థిని బి. కళావతిని ఆ కళాశాల చైర్మ¯న్ పల్లె రఘునాథరెడ్డి అభినందించారు. ఈ విద్యార్థిని జైలు వార్డెన్, స్టాఫ్ సెలెక్షన్, పోస్టల్ డిపార్ట్మెంట్, పోలీసు డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ ఎస్సై, సివిల్ ఎస్సై పోస్టులను సాధించింది. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని పలువురు అభినందించారు. పల్లె మాట్లాడుతూ కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందన్నారు. ఇందుకు ఈ విద్యార్థినే నిదర్శనమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్‌రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
బాలింతను కాటేసిన విద్యుదాఘాతం
చెన్నేకొత్తపల్లి(రాప్తాడు) : చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దెల గ్రామంలో విద్యుదాఘాతానికి కళావతి(23) మృతి చెందినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ప్రస్తుతం ఆమె ఐదు నెలల బాలింత. గ్రామానికి చెందిన కళావతి, ఈశ్వర్ దంపతులు మగ్గం నేస్తూ జీవనం సాగించే వారు. కళావతి శుక్రవారం ఉదయం తడి దుస్తులను ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న ఇనుప తీగపై ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయినట్లు వివరించారు. భర్త, ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే ఆమెను చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరామర్శించేందుకు వస్తూ... కళావతి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలియగానే న్యామద్దల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చెన్నేకొత్తపల్లి పీహెచ్‌సీకి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి, మృతురాలి భర్తను ఓదార్చారు. వారిలో జయకృష్ణ అనే గ్రామస్తుడు కూడా ఉన్నాడు. అతను పరామర్శ అనంతరం స్వగ్రామానికి బైక్‌లో వెళ్లూ మార్గమధ్యంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అదే పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. -
బాక్సర్ కళావతికి స్వర్ణం
హైదరాబాద్: రాష్ట్రస్థాయి స్కూల్ బాక్సింగ్ టోర్నమెంట్లో గండిపేట మండల పరిధిలోని పుప్పాలగూడ గ్రామానికి చెందిన జి. కళావతి స్వర్ణ పతకాన్ని సాధించింది. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగిన ఈ టోర్నీలో కళావతి 46-48 కేజీల విభాగంలో విజేతగా నిలిచింది. ఈనెల 25వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయి పోటీలకు కళావతి ఎంపికైయిందని ఆమె కోచ్ శివకుమార్ తెలిపారు. 9వ తరగతి చదువుతోన్న కళావతి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ నేర్చుకోవడంతో పాటు పలు పోటీలలో పాల్గొని పతకాలు గెలిచింది. జాతీయస్థాయి పోటీల్లోనూ ఆమె ఇదే జోరును కొనసాగించి పతకం సాధిస్తుందని కోచ్‌లు శివకుమార్, వినేశ్బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. -
రెండో రోజు కొనసాగిన సీఐడీ అధికారుల విచారణ
ప్రొద్దుటూరు క్రైం: హౌస్ బిల్డింగ్ సొసైటీలో శనివారం కూడా విచారణ కొనసాగింది. శుక్రవారం వైఎంఆర్ కాలనీలోని హౌస్‌బిల్డింగ్ సొసైటీపై వచ్చిన పలు అభియోగాలపై సీఐడీ సీఐ కళావతి సిబ్బందితో కలిసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మొదటి రోజు అధికారులను ఆమె విచారించారు. కందుల బాలనారాయణరెడ్డి కాలనీకి సంబంధించిన ఫ్లాట్లలో బినామీల పేరుతో విక్రయాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్లు సమాచారం. శనివారం కాలనీకి వెళ్లిన సీఐ ఫ్లాట్లను పరిశీలించారు. ఫ్లాట్ల వారీగా పేర్లను పరిశీలించి వారు బినామీలా లేక అసలు వ్యక్తులా అనే విషయమై ఆరా తీశారు. అధికారులతో పాటు కొందరు పాలకవర్గ సభ్యులను కూడా ఆమె విచారించారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని సీఐ చెప్పారు. -
ప్రత్యేక ఉద్యమం కేసులో కోర్టుకు హజరైన ఎమ్మెల్యే
పాలకొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హదా కోసం ఉద్యమం చేసిన కేసులో స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు 21 మంది వైఎస్ఆర్ సీపీ నాయకలు బుధవారం స్థానిక కోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి 28న వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే కళావతి, వైఎస్ఆర్ సీపీ నాయకులు పాలవలస విక్రాంత్, వెలమల మన్మదరావు, కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, కనపాక సూర్యప్రకాష్, కోరాడ సూర్యనారాయణబాబు, దుంపల చిన్ని పాలవలస దవళేశ్వరరావు, బలగ మన్మధరావు, కారెపు చిట్టిబాబు, కండాపు ప్రసాదరావు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం వీరంతా న్యాయమూర్తి వివేకానంద్ శ్రీనివాస్ ముందు హజరై సంతకాలు చేశారు. ఈ కేసును ఈ నెల 22కు వాయిదా వేశారు. -
సమస్యలకు పరిష్కారం చూపాల్సిందే: ఎమ్మెల్యే కళావతి
భామిని: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అధికారులు పరిష్కారం చూపాల్సిందేనని స్థానిక ఎమ్మెల్యే వి. కళావతి అన్నారు. ఆమె బుధవారం భామిని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ఈ నెల 27లోగా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తెలిపారు. లేకుంటే ఉన్నతాధికారుల ముందు నించోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బియ్యం అంద డం లేదని చాలామంది గిరిజనులు వాపోయారని ఎమ్మె ల్యే తెలిపారు. బయోమెట్రిక్ లోపాలపై డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును నిలదీశారు. గృహాలకు బిల్లుల పెండింగ్‌పై హౌసింగ్ డీఈఈ విక్టర్‌ను నిలదీశారు. ఏపీఏ లలితకుమారిని స్త్రీనిధి రుణాలపై ప్రశ్నించారు. ఎంపీడీఓ చల్లా మల్లేశ్వరరావు, ఈఓఆర్డీ రాంప్రసాద్, హౌసింగ్ ఏఈఈలు శివరామకృష్ణ, ఎం.ఈశ్వరరావు, ఆర్ఐలు గోవిందరాజులు, ఎస్.రాంబాబులు పాల్గొన్నారు. -
నిలదీతలు... నీళ్లు నమలడాలు!
ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు ఉపకార వేతనాల దుర్వినియోగంపై ప్రశ్నించిన కళావతి ఇంజినీర్లే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని ఆరోపణ ఐసీడీఎస్ పనితీరుపై ఆగ్రహం సీతంపేట: సీతంపేట పీఎంఆర్సీలో గురువారం జరిగిన సీతంపేట ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సా గింది. కార్యక్రమం ఆద్యంతం ఎమ్మెల్యేలు అధికారులను పలు సమస్యలపై నిలదీస్తూనే ఉన్నారు. పలు ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చినా మరికొన్నింటిని దాట వేసే ప్రయత్నం చేశారు. గిరిజన పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో లేని విద్యార్థులను ఉన్నట్టు చూపి బీసీ సంక్షేమ నిధులను కాజేసిన ఏటీడబ్ల్యూవో, వార్డెన్లపై చర్యలెందుకు తీసుకోలేదని స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ లక్ష్మీనృసింహం బదులిస్తూ రూ.కోటి 44 లక్షలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఏసీబీ, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల విచారణ పూర్తయిందని తెలిపా రు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ ద్వారా జరిగిన 42 రహదారి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని నివేదిక ఇచ్చానని వాటి విచారణ ఏం చేశారని ఎమ్మెల్యే వెంకటరమణ ప్రశ్నించగా 11 రహదారులపై రూ.71 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు తనకు అధికారులు నివేదిక ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. అడ్డంగి, అబలాసింగి రహదారి అవినీతిపై ఆర్ఆర్ యాక్టు పెట్టి రికవరీ చేయిస్తామని, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను సస్పెండ్ చేయిస్తానని ఆయన చెప్పారు. విచారణ ఆదరాబాదరాగా కాకుండా పద్ధతి ప్రకారం చేయాలని మం త్రి అచ్చెన్నాయుడు సూచించారు. రహదారుల వెరిఫికేషన్ కమిటీలో తమకు ఎందుకు అవకాశం కల్పించలేదని పాల కొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించగా సమాధానం రాలేదు. పీఆర్ జేఈ సరెండర్ సీతంపేటలో ఒక పీఆర్ జేఈ బి.నాగేశ్వరరావు కాంట్రాక్టర్ అవతారెమెత్తి పనులు చేయిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే కళావతి, జెడ్పీటీసీ దా మోదర్లు పట్టుబట్టారు. దీంతో ఆయన్ను సరెండర్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఐటీడీఏలో సమావేశం గదిని ఇంతవరకు ఎందుకు నిర్మించలేకపోయారని ఈఈ శ్రీనివాస్‌ను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మరో నాలుగు నెలల్లో పూర్తి చేస్తానని ఈఈ తెలిపారు. భామిని వెలుగు కార్యాలయంలో రూ.18 లక్షలు అక్రమాలు జరిగాయని, దీనిపై ఆడిట్ ఎందుకు చేయించలేదని ఎమ్మెల్యే కళావతి సంబంధిత అధికారులను నిలదీశారు. మందుల మాటేంటి..? వైద్యం కోసం సీతంపేట పీహెచ్‌సీకి వెళితే మందులు బయట కొనుగోలు చేయమంటున్నారని ఎంపీపీ ఎస్.లక్ష్మి తెలిపారు. నాయకులకే ఈ పరిస్థితి ఎదురైందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే కళావతి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వైద్యాధికారి, ఏఎన్ఎంకు చార్జ్‌మెమో ఇవ్వాలని డీఎంఅండ్‌హెచ్‌వో శ్యామలకు ఆదేశించారు. సెలైన్ బాటిళ్లు, ఇతర మందులు కొనుగోలు చేయడానికి ఐటీడీఏ నుంచి నిధులు సమకూర్చానని ఐటీడీఏ పీవో జె.వెంకటరావు సమాధాన మిచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎల్టీపై ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే కళావతి ఫిర్యాదు చేశారు. దోనుబాయిలో వైద్యుడ్ని నియమించాలని కోరగా వైద్యున్ని నియమించినట్టు పీఓ తెలి పారు. దోమతెరలు ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించగా నాలుగు లక్షలు దోమతెరలు అన్ని జిల్లాలకు మంజూరయ్యాయని త్వరలో ఏజెన్సీలో పంపిణీ చేస్తామని డీఎంహెచ్‌వో శ్యామల తెలిపారు. జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి ఏజెన్సీలో 1897 మంది పదో తరగతి ఉత్తీర్ణత చెందితే వారిలో 600ల మందికి ఇంటర్మీడియట్ సీట్లు ఇస్తే మిగ తా 1200ల మంది పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే కళావతి ప్రశ్నించారు. 90 సీట్లు పెంచినట్టు గురుకులం నుంచి ఆదేశాలు వచ్చాయని పీవో వెంకటరావు తెలిపారు. పాలకొండలో ఆశ్రమ పాఠశాలకు స్థల పరిశీలన చేయాలని ఆర్డీవో గున్నయ్యకు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులున్నచోట ఉ పాధ్యాయులు లేరని చాలా పాఠశాలల్లో సమస్య ఉందని కళావతి తెలిపారు. సీతంపేట యూపీ పాఠశాలలో పిల్లలు 47 మంది ఉంటే ఉపాధ్యాయులు 13 మంది ఉన్నారని, ఇంతమంది ఎందుకని ప్రశ్నించారు. ఈ స్కూల్లో ఉన్న టీచర్లను వేరే పాఠశాలలకు పదిమందిని పంపించాలని కలెక్టర్ డీఈవో దేవానందంకు తెలిపారు. జూలై ఒకటి నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్స్ పనిచేయించాలని పీవోకు కలెక్టర్ సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో కుక్, కమాటీ పోస్టులను నియమించాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. దీనిపై కమిషనర్‌కు ప్రతిపాదించామని త్వరలో భర్తీ చేస్తామని పీవో తెలిపారు. కులాంతర వివాహాలు, గిరిపుత్రిక కల్యాణ పథకానికి నిధులు వెచ్చించాలని స్థానిక ఎమ్మెల్యే కళావతి తెలిపారు. గాఢ నిద్రలో ఐసీడీఎస్ ఐసీడీఎస్ శాఖ గాఢనిద్రలో ఉందని కలెక్టర్ లక్ష్మీనృసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు ఎంతమంది ఉన్నారనేదానిపై కూడా పూర్తి సర్వే చేయలేకపోవడమేమిటని ఐసీడీఎస్ పీడీ తనూజా రాణి ని ప్రశ్నిం చారు. పలుచోట్ల పిల్లలు లేకుండా కేంద్రాలు నిర్వహిస్తున్నారని విప్ రవికుమార్ ఆరోపించారు. ట్రైబల్ ఏరి యాకి పీడీ ఎప్పుడు వచ్చారని ఎమ్మెల్యే కళావతి ఆగ్రహించారు. న్యూట్రీషియన్ కౌన్సిలర్ పోస్టుల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించగా వాటిని రద్దుచేస్తున్నట్టు పీవో ప్రకటించారు. గిరిగోరు ముద్దల పథకంలో పాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఏనుగుల సమస్య పరిష్కరించండి ఏనుగుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కళావతి, వెంకటరమణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తోట ముఖలింగంలు కోరారు. పంట నష్టపరిహారం కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఇళ్లు కూల్చేసిన, పట్టా లు లేకపోయినా పరిహారం ఇవ్వడం లేదని తెలిపారు. పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అటవీ హక్కుల పత్రాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ఏనుగులు నష్టపరిస్తే పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి వ్యవసాయశాఖ, హార్టీకల్చర్,రెవెన్యూ శాఖలు వెళ్లి పరిహారం అంచనా వేయాలని తెలిపారు. అలాగే దేవనాపురం, పెదరామ వంటి చోట్ల విద్యుత్ తీగల సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. కడగండి ప్రాంతంలో నాలుగురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు ఫోన్లకు స్పం దించాలని ఎమ్మెల్యే వెంకటరమణ కోరగా అదే పెద్ద సమస్యని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రా మ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మోహన్‌మురళి, డుమా పీడీ కూర్మనాథ్, డీడీ ఎంపీవీనాయిక్, డిప్యూటీ డీఈవో వి.మల్లయ్య, సీఎం వో శ్రీనివాసరావు, ఏపీడీ సావిత్రి, అడిషనల్ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డీసీహెచ్ఎస్ వీరాస్వామి, రేంజర్లు జగదీష్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తీరు మారలేదు!
తూతూ మంత్రంగా ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ముగ్గురు ఎమ్మెల్యేలు, అరుకు ఎంపీ గైర్హాజర్ మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్సీ ప్రతిభాభారతి 16 శాఖలపై జరగని చర్చ సమస్యలపై నిలదీసిన విపక్ష ఎమెల్యే కళావతి సీతంపేట: మళ్లీ అదే తీరు.. అదే పద్ధతి.. ఏమాత్రం మార్పులేదు. కొంతమంది ప్రజాప్రతినిధుల గైర్హాజర్, ఎనిమిది శాఖలపై చర్చలతోనే సీతంపేట ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశం సుమారు నాలుగు గంటల్లో తూతూ మంత్రంగా ముగిసింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. దీనికి ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం ఎమ్మెల్యేలతో పాటు అరుకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత గైర్హాజరయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు సమావేశానికి హాజరైనప్పటకీ శుక్రవారం కేబినెట్ సమావేశానికి వెళ్లాలంటూ మధ్యలోనే వెళ్లిపోగా.. ఆయనతో పాటే ఎమ్మెల్సీ ప్రతిభాభారతీ పలాయనం చిత్తగించారు. సమస్యలపై తనదైన శైలిలో పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధికారులను నిలదీశారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ, నరసన్నపేట ఎమ్మెల్యే బి.లక్ష్మణరావు, ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి హాజరయ్యారు. మొత్తం 24 శాఖలపై చర్చ జరాగాల్సి ఉన్నప్పటికీ కేవలం ఎనిమిది శాఖలపై మాత్రమే చర్చ జరిపి 16 శాఖలను వదిలేశారు. ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. కీలకమైన గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్, ఎస్ఎంఐ, వెలుగు, గృహనిర్మాణం, గిరిజన సహకార సంస్థ, సమగ్రనీటి యాజమాన్య కార్యక్రమం, మలేరియా, జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రత్యేక చిన్ననీటి వనరుల శాఖ, ఆర్థిక చేయూతనిచ్చే పథకం, మత్స్యశాఖ తదితర శాఖలపై చర్చ జరగలేదు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాత్రం పలు శాఖల లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో సరైన సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. ఒకానొక సందర్భంలో ప్రభుత్వ పథకాలపై అధికారులను నిలదీస్తుంటే ప్రభుత్వ విప్ కూనరవికుమార్ అడ్డుతగిలారు. గత సమావేశంలో శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎజెండా రూపొందించినప్పటకీ వాటిని చదువ లేదు. అలాగే వ్యవసాయశాఖ, ట్రాన్స్‌కో, పట్టుపరిశ్రమ, అటవీహక్కుల గుర్తింపు చట్టం వంటి శాఖలపై ముందు చర్చ జరిగింది. కేవలం కీలకశాఖలైన గిరిజన సంక్షేమశాఖ విద్య, వైద్య శాఖలపై మాత్రమే ఆఖరున చర్చ జరగడం గమానార్హం. ప్రతీ సమావేశంలో గిరిజన విద్య, ఇంజినీరింగ్ వంటి శాఖలు ముందు చర్చజరిగేది. ఈ దఫా అంతగా ప్రాధాన్యం లేని శాఖలపై తొలుత చర్చించడంతో ప్రజాప్రతినిధులు అసహనం చెందారు. అలాగే సమావేశంలో సబ్‌ప్లాన్ మండలాల నుంచి వచ్చిన ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు సైతం సమావేశంలో మాట్లాడే అవకాశం లభించలేదు. -
ఆమె... ఓ మోహం!
‘మోహిని’ అంటే మనసును మత్తులో ముంచేసే అందమని అర్థం. కథానాయిక త్రిష అందం కూడా అంతే. దాదాపు పధ్నాలుగేళ్లగా తన అందంతో, అభినయంతో వెండితెర మోహినిగా అభిమానులను మైమరిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘మోహిని’ అనే పాత్రతో మురిపించడమే కాదు.. భయపెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారామె. పధ్నాలుగేళ్ల కెరీర్లో గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రలకు కూడా ఓకే చెబుతూ వచ్చారు. ఈ మధ్య అయితే కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలపై మక్కువ చూపుతున్నట్లనిపిస్తోంది. అది కూడా హారర్ చిత్రాలు చేయడం విశేషం. ‘కళావతి’ తర్వాత ఓ హారర్ చిత్రాన్ని పూర్తి చేశారు త్రిష. ఇప్పుడు ‘మోహిని’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. మాధేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహిని పాత్ర కోసం త్రిష ప్రత్యేకంగా ప్రోస్థటిక్ మేకప్ కూడా వేసుకోనున్నారట. ఈ చిత్రం షూటింగ్ మొత్తం యూకే, మెక్సికోల్లో జరుగుతుంది. మోహిని అనే అమ్మాయికి ఎదురయ్యే భయానక అనుభవాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారట.