ప్రతిభావంత విద్యార్థినికి అభినందనలు
Published Mon, Jun 19 2017 11:46 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
అనంతపురం రూరల్ : ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ విద్యార్థిని బి. కళావతిని ఆ కళాశాల చైర్మ¯న్ పల్లె రఘునాథరెడ్డి అభినందించారు. ఈ విద్యార్థిని జైలు వార్డెన్, స్టాఫ్ సెలెక్షన్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, పోలీసు డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్ ఎస్సై, సివిల్ ఎస్సై పోస్టులను సాధించింది. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని పలువురు అభినందించారు. పల్లె మాట్లాడుతూ కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సొంతం అవుతుందన్నారు. ఇందుకు ఈ విద్యార్థినే నిదర్శనమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్‌రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement