సమస్యలకు పరిష్కారం చూపాల్సిందే: ఎమ్మెల్యే కళావతి
Published Wed, Jul 20 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
భామిని: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అధికారులు పరిష్కారం చూపాల్సిందేనని స్థానిక ఎమ్మెల్యే వి. కళావతి అన్నారు. ఆమె బుధవారం భామిని మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గడపగడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ఈ నెల 27లోగా సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తెలిపారు. లేకుంటే ఉన్నతాధికారుల ముందు నించోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బియ్యం అంద డం లేదని చాలామంది గిరిజనులు వాపోయారని ఎమ్మె ల్యే తెలిపారు. బయోమెట్రిక్ లోపాలపై డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును నిలదీశారు. గృహాలకు బిల్లుల పెండింగ్‌పై హౌసింగ్ డీఈఈ విక్టర్‌ను నిలదీశారు. ఏపీఏ లలితకుమారిని స్త్రీనిధి రుణాలపై ప్రశ్నించారు. ఎంపీడీఓ చల్లా మల్లేశ్వరరావు, ఈఓఆర్‌డీ రాంప్రసాద్, హౌసింగ్ ఏఈఈలు శివరామకృష్ణ, ఎం.ఈశ్వరరావు, ఆర్‌ఐలు గోవిందరాజులు, ఎస్.రాంబాబులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement