
హోంగార్డులకు మరిన్ని సంక్షేమ పథకాలు
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : హోంగార్డుల సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు వరంగల్ అర్బన్ ఎస్పీ ఎ.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణిం చిన హోంగార్డు కె.సదానందం కుటుంబానికి ఆర్థికసాయం కింద రూ.2,23,800 చెక్కును మంగళవారం ఎస్పీ అందజేశారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు సదానందం అనారోగ్యంతో గత అక్టోబర్‌లో మృతిచెందారు. జిల్లా హోంగార్డు సిబ్బంది ఒక్కరోజు గౌరవ వేతనం మొత్తాన్ని ఆర్థిక సాయం కింద అర్బన్ ఎస్పీ చేతుల మీదుగా సదానందం భార్య కళావతికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు సిబ్బంది సంక్షేమాన్ని ప్రతి పోలీ సు అధికారి బాధ్యతగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో హోంగార్డ్సు ఆర్‌ఐ సదానందం, ఇన్‌చార్జ్ ఏఆర్ ఎస్సై శ్యాంసుందర్, హోంగార్డుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మా మిండ్ల తిరుపతిగౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి నర్సయ్య, కోశాధికారి సదానందం పాల్గొన్నారు.