'కళావతి' మూవీ రివ్యూ | Kalavathi Movie Review | Sakshi
Sakshi News home page

'కళావతి' మూవీ రివ్యూ

Jan 29 2016 10:40 AM | Updated on Sep 3 2017 4:34 PM

'కళావతి' మూవీ రివ్యూ

'కళావతి' మూవీ రివ్యూ

'చంద్రకళ'కు సీక్వల్గా తెరకెక్కిన 'కళావతి' తెలుగు ఆడియన్స్ను ఏ మేరకు భయపెట్టింది..?

టైటిల్ : కళావతి
జానర్ : హార్రర్ కామెడీ
తారాగణం : సిద్దార్థ్, సుందర్.సి, త్రిష, హన్సిక
సంగీతం : హిప్ హాప్ తమిజా
దర్శకత్వం : సుందర్ సి
నిర్మాత : గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్

 

2014లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన చంద్రకళ (అరణ్మనై) సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన మరో హార్రర్ కామెడీ చిత్రం అరణ్మనై 2. ఈ చిత్రాన్ని 'కళావతి' పేరుతో తెలుగులో అనువాదం చేసి  రిలీజ్ చేశారు. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ జానర్గా పేరున్న హార్రర్ కామెడీలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్దార్థ్, త్రిష లాంటి స్టార్లు కూడా యాడ్ అవ్వడం సినిమా మీద అంచనాలను పెంచేసింది. మరి 'చంద్రకళ'కు సీక్వెల్గా తెరకెక్కిన 'కళావతి' తెలుగు ఆడియన్స్ను ఏ మేరకు భయపెట్టింది..?

కథ
ఓ జమీందార్ బంగ్లా చుట్టూ తిరుగుతోంది కళావతి కథ. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం అక్కడికి వచ్చే వారిని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం మూలంగానే జమీందార్ కోమాలోకి వెళతాడు. అతని పెద్ద కొడుకుపై కూడా దెయ్యం దాడి చేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల పని పట్టాలనుకుంటాడు జమీందార్ చిన్న కొడుకు (సిద్దార్థ్), అందుకు అతనికి కాబోయే భార్య (త్రిష) సాయం చేస్తుంది. ఈ పోరాటంలో బంగ్లాలో ఉన్న దెయ్యం చనిపోయిన తన చెల్లెలు కళ(హాన్సిక) అని తెలుసుకుంటాడు సిద్దార్థ్. అసలు కళ దెయ్యంగా ఎలా మారింది..? చివరకు సిద్దార్థ్ కళకు ఎలా విముక్తి కలిగించాడు అన్నదే మిగతా కథ.

నటీనటులు
తొలిసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బీచ్ సాంగ్తో కమర్షియల్ కంటెంట్ను యాడ్ చేసింది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.

సాంకేతిక నిపుణులు
చంద్రకళ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సుందర్.సి మరోసారి అదే ఫామ్ చూపించాడు. ముఖ్యంగా తొలి భాగం విజయం సాధించటంతో తన మీద ఏర్పడ్డ అంచనాలను అందుకునే స్థాయి సినిమాను తెరకెక్కించటంలో విజయం సాధించాడు. హిప్ హాప్ తమీజా సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్
సిద్దార్థ్, హన్సిక
స్క్రీన్ ప్లే
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
రొటీన్ హర్రర్ కామెడీ జానర్

ఓవరాల్గా కళావతి, సౌత్ సిల్వర్ స్క్రీన్పై హర్రర్ కామెడీలకు తిరుగులేదని ప్రూవ్ చేసిన సక్సెస్ఫుల్ సినిమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement