మేమిద్దరం స్నేహితులమే! | Hansika tells about Kalavathi movie | Sakshi
Sakshi News home page

మేమిద్దరం స్నేహితులమే!

Published Tue, Jan 26 2016 11:21 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

మేమిద్దరం స్నేహితులమే!

మేమిద్దరం స్నేహితులమే!

- హన్సిక
క్యూట్‌గాళ్ హన్సిక ఆ మధ్య ‘చంద్రకళ’లో బాగానే భయపెట్టగలిగారు. ఈసారి మళ్లీ ‘కళావతి’గా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సుందర్.సి దర్శకత్వంలో  ‘అరణ్మణై-2’  పేరుతో  తమిళంలో  తెరకెక్కిన ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంయుక్తంగా ‘కళావతి’  పేరిట తెలుగులో అందిస్తున్నాయి. శుక్రవారం ‘కళావతి’ రిలీజవుతున్న సందర్భంగా హన్సిక  ఏమంటున్నారంటే...
 
* నేను మొదటి నుంచి బబ్లీ గాళ్ తరహా పాత్రలే చేస్తూ వచ్చా. కానీ దర్శకుడు సుందర్ ‘చంద్రకళ’లో గ్రామీణ యువతి పాత్ర చేయించారు. మొదట్లో సందేహించా. కానీ ఆ పాత్ర అందరికీ నచ్చేసింది. ఈ ‘కళావతి’ కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో తొలిసారిగా గర్భవతిగా కనిపిస్తాను. గర్భవతులు ఎలా నడుస్తారో గమనించా.

* సిద్ధార్థ్‌తో నాకిది మూడో సినిమా. అతను మంచి కో-యాక్టర్. సుందర్. సి డెరైక్షన్‌లోనే ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ చేశాం. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో ఈ సినిమా చేశా.
     
* ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో నాకు, త్రిషకు ఏవో మనస్పర్థలు వచ్చాయనీ, త్రిష కోపంగా ఉందనీ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అలాంటిదేం లేదు. నేను వెంటనే కాల్ చేసి ఆమెను అడిగాను కూడా. ఇద్దరం నవ్వేసుకున్నాం. చివరకు మా మధ్య అలాంటిదేమీ లేదని త్రిషే మీడియాలో చెప్పింది. అప్పుడు, ఇప్పుడు మేమిద్దరం స్నేహితులమే. దర్శకుడు సుందర్ నన్నూ, త్రిష, పూనమ్ బజ్వాని ఎలా హ్యాండిల్ చేయాలని భయపడ్డారట. కానీ షూటింగ్‌లో మేమంతా ఫ్రెండ్లీగా ఉండటంతో ఆయనకి టెన్షన్ తీరింది.
     
* విచిత్రం ఏంటంటే, 13 ఏళ్ల తర్వాత నేను చూసిన మొదటి హార్రర్ సినిమా ‘చంద్రకళ’, ఇప్పుడు రెండో సినిమా ‘కళావతి’. నాకు దెయ్యం సినిమాలంటే ఇప్పటికీ భయమే. మా అమ్మ తోడుండాల్సిందే.
     
* సన్నగా ఎందుకయ్యావ్...? అని చాలా మంది అడుగుతున్నారు. ఇది వరకటి హన్సిక అయితే బాగా ఫుడీ. కానీ ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అందుకే అవసరానికి మించి తినడం లేదు.
     
* నాకు మనసు బాగోలేకపోయినా, ఒత్తిడిగా అనిపించినా పెయింటింగ్స్ వేస్తా. మా అమ్మ కోసం గురునానక్ పెయింటింగ్ వేసి గిఫ్ట్ ఇచ్చా. చారిటీ కోసం ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా.
     
* ఈ ఏడాది నాలుగు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో నాకు సినిమాలు చేయాలనే ఉంది. కానీ డేట్స్ ఎడ్జెస్ట్ కాక కుదరడం లేదు. త్వరలోనే తెలుగు సినిమా గురించి ఓ మంచి కబురు వింటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement