ఇంకో చంద్రకళ రెడీ ! | another chandrakala is ready ... | Sakshi
Sakshi News home page

ఇంకో చంద్రకళ రెడీ !

Published Thu, Jan 7 2016 10:59 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

ఇంకో చంద్రకళ రెడీ !

ఇంకో చంద్రకళ రెడీ !

 హారర్ నేపథ్యంలో గత ఏడాది వచ్చిన ‘చంద్రకళ’ సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలో హన్సిక నటనకు మంచి పేరొచ్చింది. ప్రముఖ దర్శకుడు సి.సుందర్ తెరకెక్కించిన ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తయారైంది. ఈసారి హన్సికతో పాటు సిద్ధార్థ్, త్రిష లాంటి టాప్ స్టార్స్ నటించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సర్వంత్రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంస్థలు పొందాయి. ‘‘ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఈ చిత్రంలో ఉంటుంది. అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఇందులో హైలైట్’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు, సంగీతం: హిప్ హాప్ తమిళ, దర్శకత్వం: సుందర్.సి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement