chandra kala
-
అఖిలేశ్ మెడకు మైనింగ్ కేసు!
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సీబీఐ విచారణ ఎదుర్కొనే చాన్సుంది. ఈ మేరకు నమోదైన కేసు వివరాల్ని సీబీఐ వెల్లడించింది. ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రా, బీఎస్పీ నాయకుడు సంజయ్ దీక్షిత్ సహా మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి శనివారం సీబీఐ అధికారులు.. యూపీ, ఢిల్లీలో నిందితులకు చెందిన 14 చోట్ల సోదాలు నిర్వహించారు. 2012–16 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లాలో ఇసుక, కంకర లాంటి ఖనిజాల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్నది తాజా కేసులో ప్రధాన ఆరోపణ. 2012–17 మధ్య కాలంలో నాటి సీఎం అఖిలేశ్ 2012–13లో గనుల శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అందుకే ఆయన పాత్రపై సీబీఐ దృష్టిసారించే వీలుంది. అక్రమంగా కాంట్రాక్టులిచ్చారు.. 2012–14 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రకళ ఈ–టెండర్ నిబంధనల్ని ఉల్లంఘించి కాంట్రాక్టులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె అక్రమంగా కొత్త అనుమతులిచ్చారని, పాత వాటిని పునరుద్ధరించారని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు అనుమతిచ్చిన చంద్రకళ, ఇతర అధికారులు.. గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్‌కు ఎంపికై, యూపీ కేడర్ అధికారిగా నియమితులయ్యారు. -
మెరిసిన చంద్రలేఖ
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో చంద్రలేఖ (101 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవడంతో ఆంధ్ర జట్టు నాలుగో విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పై ఆంధ్ర జట్టు 62 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర నాలుగింట గెలిచి 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. చంద్రలేఖ అర్ధసెంచరీకి తోడు హిమబిందు (67 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం ఆంధ్ర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి 3, కెప్టెన్ పద్మజ 2, ఝాన్సీ లక్ష్మి, పుష్పలత, మల్లిక ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్‌పై గోవా, విదర్భపై హరియాణా గెలిచాయి. -
భర్త వేధింపులు తాళలేక..
భర్త వేధింపులు తాళలేక వివాహిత పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోరా రంగస్వామికి పదేళ్ల క్రితం చంద్రకళ(28)తో వివాహం అయింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి బంధంలో కుటుంబ కలహాలు చెలరేగాయి. దీంతో మనస్తాపానికి గురైన చంద్రకళ ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. -
మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటిన వ్యక్తి అరెస్ట్
నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
ఇంకో చంద్రకళ రెడీ !
హారర్ నేపథ్యంలో గత ఏడాది వచ్చిన ‘చంద్రకళ’ సంచలన విజయం సాధించింది. ఆ చిత్రంలో హన్సిక నటనకు మంచి పేరొచ్చింది. ప్రముఖ దర్శకుడు సి.సుందర్ తెరకెక్కించిన ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తయారైంది. ఈసారి హన్సికతో పాటు సిద్ధార్థ్, త్రిష లాంటి టాప్ స్టార్స్ నటించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను సర్వంత్రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ సంస్థలు పొందాయి. ‘‘ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం ఈ చిత్రంలో ఉంటుంది. అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఇందులో హైలైట్’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు, సంగీతం: హిప్ హాప్ తమిళ, దర్శకత్వం: సుందర్.సి. -
అంగన్వాడీల వినూత్న నిరసన
ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కో రుతూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆదివారం నోటికి నల్ల గుడ్డలు ధరించి మౌన ప్రదర్శన ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ చేపట్టిన అంగన్వాడీలు కొత్త బస్టాండ్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు సాగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ పిలుపు మేరకు చేపట్టిన అంగన్వాడీ, సహాయకుల అ సోసియేషన్ నాయకులు గోదావరి, చంద్రకళ, లక్ష్మీ, జగదాంబ, సునంద, కవిత, అరుణ, వసంత, వని త, భూలక్ష్మి, సీఐటీయూ నాయకులు కుతాడి ఎల్లయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. నందిపేట: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నందిపేట మండల కేంద్రంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మౌన ప్రదర్శన చేశారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయం నుంచి మౌన ప్రదర్శన చేస్తు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టార్ లీడరులు గీత, విమల, వనిత, అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలు పాల్గొన్నారు.