
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో చంద్రలేఖ (101 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవడంతో ఆంధ్ర జట్టు నాలుగో విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పై ఆంధ్ర జట్టు 62 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర నాలుగింట గెలిచి 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది.
చంద్రలేఖ అర్ధసెంచరీకి తోడు హిమబిందు (67 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం ఆంధ్ర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి 3, కెప్టెన్ పద్మజ 2, ఝాన్సీ లక్ష్మి, పుష్పలత, మల్లిక ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్‌పై గోవా, విదర్భపై హరియాణా గెలిచాయి.