భర్త వేధింపులు తాళలేక వివాహిత పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
భర్త వేధింపులు తాళలేక వివాహిత పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోరా రంగస్వామికి పదేళ్ల క్రితం చంద్రకళ(28)తో వివాహం అయింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి బంధంలో కుటుంబ కలహాలు చెలరేగాయి. దీంతో మనస్తాపానికి గురైన చంద్రకళ ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.