అంగన్‌వాడీల వినూత్న నిరసన | anganvadi employees are variety strike | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల వినూత్న నిరసన

Published Mon, Feb 24 2014 4:47 AM | Last Updated on Sat, Jun 2 2018 8:39 PM

అంగన్‌వాడీల వినూత్న నిరసన - Sakshi

అంగన్‌వాడీల వినూత్న నిరసన

 ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కో రుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆదివారం నోటికి నల్ల గుడ్డలు ధరించి మౌన ప్రదర్శన ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు.

 

ఆర్మూర్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ చేపట్టిన అంగన్‌వాడీలు కొత్త బస్టాండ్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు సాగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ పిలుపు మేరకు చేపట్టిన  అంగన్‌వాడీ, సహాయకుల అ సోసియేషన్ నాయకులు గోదావరి, చంద్రకళ, లక్ష్మీ, జగదాంబ, సునంద, కవిత, అరుణ, వసంత, వని త, భూలక్ష్మి, సీఐటీయూ నాయకులు కుతాడి ఎల్లయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.  
 

 

నందిపేట: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నందిపేట మండల కేంద్రంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మౌన ప్రదర్శన చేశారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయం నుంచి మౌన ప్రదర్శన చేస్తు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టార్ లీడరులు గీత, విమల, వనిత, అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆయాలు పాల్గొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement