armuru
-
తల్లి దారుణహత్య! పాపం చిన్నారి..
నిజామాబాద్: ఆర్మూర్‌లో పట్టపగలు వివాహిత దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం రాసురి లాస్య (22)ను దుండగులు గొంతుకోసి హతమార్చారు. వివరాలిలా ఉన్నాయి. వేల్పూర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన లాస్యకు రెండేళ్ల క్రితం ఆర్మూరుకు చెందిన రాసూరి రాకేశ్‌తో వివాహమైంది. వీరి కి ఏడు నెలల పాప శ్రీలక్ష్యణ ఉంది. రాకేశ్ మూడు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. లాస్య అత్త చిన్నుబాయితో కలిసి ఉంటోంది. శనివారం ఉదయం చిన్నుబాయి కోరుట్లలో గల తన కూతురు వద్దకు వెళ్లింది. లాస్య మధ్యాహ్నం ఒంటి గంట వరకు తన ఇంటి సమీపంలో ఓ ఇంట్లో బీడీలు చేసి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటల సయయంలో పాప ఏడుస్తుండడంతో పక్క ఇంట్లో ఉంటున్న చిట్టి అనే మహిళ వెళ్లి చూడగా లాస్య రక్తపుమడుగులో కనిపించింది. దీంతో ఆమె స్థానికులకు చెప్పడంతో వారు అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌హెచ్‌వో రవికుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. లాస్యను హత్య చేసిన వారు ఆమె మెడలోని బంగారు నగలు, చెవి దుద్దులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. పాపం చిన్నారి.. రక్తం మడుగులో పడి ఉన్న తల్లి వద్ద చిన్నారి ఏడుస్తుండటం కలచి వేసింది. తండ్రి దగ్గర లేకపోవడం తల్లి చనిపోవడంతో ఆ పాప గుక్కపెట్టి ఏడవగా స్థానికులు అక్కున చేర్చుకొని ఓదార్చారు. కాగా తెలిసినవారే లాస్యను హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: ఎలుగుబంటి దాడిలో ఇద్దరు జీడి రైతులు మృతి -
నిజామాబాద్: గత ఎన్నికల్లో సీట్లు గెలిచినప్పటికీ.. సిట్టింగ్‌లలో టెన్షన్
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ బృందంతో జిల్లాలో నెలల తరబడి అన్ని అంశాలపై ఎమ్మెల్యేల గురించి సమగ్రంగా సర్వే చేయించారు. ఇందుకు సంబంధించిన నివేదికపై కేసీఆర్ పోస్ట్‌మార్టం చేస్తున్నారు. సాక్షి, నిజామాబాద్: ఆది నుంచి టీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో అన్ని సీట్లు గెలిచినప్పటికీ, కేవలం మూడు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కల్వకుంట్ల కవిత ఓటమి నేపథ్యంలో జిల్లాపై సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి సర్వే నివేదికలపై, కొందరు ఎమ్మెల్యేల గు ట్టుమట్లపై ప్రత్యేక పరిశీలన చేయనున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఆశావహుల బలాలు, బలహీనతలను కూడా బేరీజు వేసుకుంటూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి, నడవడిక, అక్రమాలు, పర్సంటేజీలు, కేడర్‌కు అందుబాటులో లేని పరిస్థితి, భూదందాలు, దాడులు చేయించడం తదితర అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన ఒ క ఎమ్మెల్యే అయితే ఏకంగా పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులనే విచ్చలవిడిగా బెదిరింపులకు గురిచేసిన అంశాలను సైతం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా నుంచి కొందరు సిట్టింగ్‌లను మార్చాల నే నేపథ్యంలో అన్ని రకాల అంశాలను క్రో డీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సమీకరణాలివి.. బాన్సువాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ నేత, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడైన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఈసారి టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఆదినుంచి క్షేత్రస్థాయిలో తిరుగులేని పట్టు కలిగి ఉన్న భాస్కర్‌రెడ్డి కి ఈ స్థానం కేటాయిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మూ ర్ నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే పలుసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను బెదిరింపులకు గురి చేసినట్లు సోషల్ మీడియాలో ఆడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై కూడా సర్వేలో పూర్తివివరాలు సేకరించినట్లు సమాచారం. ఈసారి ఆర్మూర్ శాసనసభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అర్వింద్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ స్థానంలో సిట్టింగ్‌ను కొనసాగించాలా లేక అర్వింద్ సామాజిక వర్గానికి చెందిన ఆకుల లలితకు టిక్కెట్టు కేటాయించాలా అనే విషయమై కూడా లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కవితను బరిలోకి దింపుతారనే చర్చ పార్టీ వర్గాల్లో, స్థాని క ప్రజాప్రతినిధుల్లో జరుగుతోంది. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం విషయానికి వస్తే గణేష్ గుప్తా పనితీరు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రత్యర్థులు ఎవరెవరుంటారు.. గెలుపోటముల పరిస్థితి ఏమిటనే విషయమై లెక్క లు వేసి సర్వే నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బలాబలాల బేరీజు.. ఈ సర్వే నేపథ్యంలో జిల్లాలో ఎవరెవరికి టిక్కెట్ల కోత పెట్టాలనే విషయమై నిర్ణయించనున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరితో పోటీ ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరించారు. టీఆర్ఎస్ కార్యకర్తల్లో, ఉద్యమకారుల్లో పార్టీ నాయకులపై ఉన్న అభిప్రాయాలను కూడా సేకరించినట్లు తెలిసింది. ఇక ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో సదరు అంశంపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లాలో ఎలా ఉంటుందనే విషయమై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మొత్తంమీద ఐప్యాక్ సర్వేపై కేసీఆర్ మదింపు చేస్తున్న నేపథ్యంలో సిట్టింగ్‌ల్లో టెన్షన్ నెలకొంది. -
ఇన్స్పైర్ చేశారు...!
జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇన్స్పైర్ మనక్ పేరుతో కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఏటా పోటీలను నిర్వహిస్తోంది. ఇన్స్పైర్ మనక్‌పై ఈసారి హెచ్ఎంలు, ఉపాధ్యాయులు మనసు పెట్టారు. జిల్లా చరిత్రలో అత్యధికంగా ప్రాజెక్టులు నామినేషన్లకు ఎంపిక చేయబడ్డాయి. దరఖాస్తు ప్రక్రియలో విద్యార్థులకు ఉపాధ్యాయులు తగిన తోడ్పాటు ద్వారా ఈ ప్రగతి సాధ్యమైంది. విద్యార్థుల ఎంపిక.. కరోనా మహమ్మారి విస్తృతంగా ఉన్న సమయంలో డీఈవో, జిల్లా సైన్స్ అధికారి పాఠశాల హెచ్ఎంలతో సమావేశం ఏర్పాటు చేసి ఇన్‌సై్పర్ మనక్ కో సం ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఆయా హెచ్ఎంలు పాఠశాలల్లో సైన్స్ ఉపాధ్యాయుల సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించారు. 2020– 2021కు గాను సంబంధించి జిల్లాలో 287పాఠశాలల నుంచి 680 నామినేషన్లు (ఐడియాస్)పంపగా 133 మంది విద్యార్థుల ఐడియాస్‌ను ఎంపిక చేశారు. అత్యధికంగా నిజామాబాద్ నార్త్, సౌత్, రూరల్ మండలాల నుంచి 22 నామినేషన్లు ఎంపిక చేశారు. బోధన్ మండలంలో 13, డిచ్పల్లి 16, ఆర్మూర్ 16, వేల్పూర్ 8, భీంగల్ 7, బాల్కొండ నుంచి 6 నామినేషన్లు ఎంపికయ్యాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి ఎంపిక చేసిన విద్యార్థుల ఖాతాల్లో గత వారం రోజుల నుంచి రూ.10 వేల నగదును జమ చేస్తున్నది. త్వరలో పోటీల నిర్వహణ జిల్లాలో నూతన సంవత్సరంలో జనవరి నెలలో ఇన్స్పైర్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. కానీ కరోనా కారణంగా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. విద్యార్థులకు అందించిన రూ.10వేలలో రూ.5వేలు ప్రాజెక్ట్ తయారి కోసం, మరో రూ.5వేలు ప్రయాణ ఖర్చులకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లో పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు తయారీకి రూ.10వేల వరకు వెచ్చించే సౌకర్యం లభించనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు.. ఇన్స్పైర్ మనక్ క్రింద మూడు దశలలో ఎంపిక ఉంటుంది. ఎంపికైన నామినేషన్లు జిల్లా స్థాయిలో మొదటగా ప్రదర్శించాలి. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటితే రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు రూ.40వేలు చెల్లిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే జాతీయస్థాయికి ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో ఎంపికైతే రాష్ట్రపతి ద్వారా అవార్డుతో పాటు రూ.60వేలు చెల్లిస్తారు. ఎంపికవ్వడం సంతోషంగా ఉంది.. ఇన్స్పైర్ మనక్ కోసం నేను తయారు చేసిన సోలార్ ప్యానల్ ద్వారా హైడ్రోజన్ ఇందన తయారీ ప్రాజెక్టు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీధర్ సార్ సహకారంతో ప్రాజెక్టును తయారు చేశాను. రాష్ట్ర స్థాయిలో నా ప్రాజెక్టు ఎంపిక కావడమే నా ఏకైక లక్ష్యం. – శ్రీజ, విద్యారి్థని, జెడ్పీహెచ్ఎస్, అంక్సాపూర్ శాస్త్ర సాంకేతికత పెరుగుతోంది.. ఇన్‌సై్పర్ మనక్ వల్ల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికతను పెంపొందిస్తుంది. విద్యార్థుల చేత సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క జీవితాలను సులభతరం చేసే యంత్రాలను, వస్తువును మెరుగుపరిచే విధంగా కొత్తదాన్ని ఆవిష్కరించే లేదా సృష్టించే విధంగా సొంత ఆలోచనలను పొందపరిచి స్వీకరించే పోటీయే ఇన్స్పైర్ అవార్డు మనక్. వేల్పూర్ మండలంలో 8 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని తెలిపారు. – వనాజారెడ్డి, ఎంఈవో, వేల్పూర్ నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు.. సమాజంలో ముందుగా మూఢ విశ్వాసాలను విడనా డాలి. విద్యార్థులు శాస్త్రబద్దంగా ఆలోచించి సమస్యలకు పరిష్కారమార్గాలను కనుగొనాలి. ట్రెడిషనల్ ప్రాక్టీసెస్‌కు తోడు ఆధునిక శాస్త్రీతయను జోడించి ఎ ప్పటికప్పుడు ఫలితాలను రాబట్టే దిశగా మనం ఆలోచించాలి. నేటి బాలలు రేపటి శాస్త్రవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉంది. వివిధ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలకు ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా ఆలోచించి పరిష్కరించుకోవచ్చు. – గంగా కిషన్, జిల్లా సైన్స్ అధికారి -
టీడీపీకి అన్నపూర్ణమ్మ రాజీనామా
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఏలేటి అన్నపూర్ణమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శనివారం రాజీనామా లేఖను పంపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె లేఖలో ప్రకటించారు. అలాగే ఆమె బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆమె కుమారుడు మల్లికార్జున్ రెడ్డితో కలిసి శనివారం సాయంత్రం బీజేపీలో చేరనున్నారు. నిజామాబాద్‌లో జిల్లాలో టీడీపీ సీనియర్ నేతగా పేరొందిన అన్నపూర్ణమ్మ 1994, 2009 శాసనసభ ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో 2018 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆమె కుమారుడు మల్లికార్జున్ ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వారు పేర్కొన్నారు. -
తాళం వేసిన ఐదిళ్లల్లో చోరీ
సాక్షి, నిజామాబాద్(ఆర్మూర్) : మండలంలోని రాంపూర్‌లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీకి ఎగబడ్డారు. దుండగులు గ్రామంలోని ఐదు ఇళ్లలో శనివారం అర్ధరాత్రి చోరీ చేసి నగదు, నగలను ఎత్తుకెళ్లారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లిన హైమద్ ముక్తార్, ఈరోళ్ల సాయన్న, ఈరోళ్ల రమేశ్, కే. హరీష్ ఇళ్లతో పాటు బీడీ ఖార్ఖానాలో దొంగలు చోరీ చేశారు. నలుగురి ఇళ్ల తాళాలను ధ్వంసం చేసి లోనికి చొరబడి బీరువాను తెరిచి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. హైమద్ ముక్తార్ ఇంట్లో నుంచి రూ.లక్షన్నరతో పాటు ఐదు తులాల బంగారం, కే. హరీష్ ఇంట్లో నుంచి ఆరు బంగారు ఉంగరాలు, మూడు జతల బంగారు కమ్మలు, ఈరోళ్ల సాయన్న ఇంట్లో నుంచి రూ.4 వేలు, ఈరోళ్ల రమేశ్ ఇంట్లో నుంచి రూ.8 వేల నగదు చోరీకి గురైనట్లు తెలిసింది. దుండగులు ముందే పక్కాగా రెక్కీ నిర్వహించి చోరీ చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన క్లూసీం టీం చోరీ జరిగిన ఇళ్లలో ఆధారాలు సేకరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చోరీ తీరును పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటు ఎస్‌హెచ్‌వో రాఘవేందర్ తెలిపారు. -
వారణాసి కలెక్టరేట్ చేరుకున్న పసుపు రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : నిజామాబాద్ పసుపు రైతులు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్న రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్, తమిళనాడుకు చెందని దాదాపు 54 మంది రైతులు నిజామాబాద్ నుంచి వారణాసికి బయలుదేరి వెళ్లారు. రైతులకు మద్దతుగా.. పసుపు రైతుల సంఘం జాతీయ అద్యక్షులు దైవ శిగామణీ, రాష్ట్ర అద్యక్షులు కోటపాటి నర్సింహ నాయుడు వారణాసికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. మరికాసెపట్లో రైతులు నామినేషన్లు వేయనున్నారు. -
ఎర్రజొన్న రైతులపై కాల్పులకు పదేళ్లు
ఆర్మూర్ : ఆర్మూర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎర్రజొన్న రైతులపై పోలీసుల కాల్పుల ఘటన జరిగి నేటితో పదేళ్లు పూర్తయినా నాటి ఘటనను ఈ ప్రాంత ప్రజలు నేటికీ నెమరు వేసుకుంటున్నారు. అయితే నాటి ఎర్రజొన్న రైతులపై పోలీసు కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సరిదిద్దుతూ రైతులకు లాభం చేకూర్చే పనులు చేస్తూ వస్తోంది. ఎర్రజొన్న రైతులకు చెల్లించాల్సిన రూ. పది కోట్ల 83 లక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించింది. మరో వైపు ఎర్రజొన్న రైతులను ఆదుకోవడంలో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విత్తన వ్యాపారంలోకి అడుగు పెట్టి ఎర్రజొన్న రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది. ఇక నాటి ఉద్యమంలో మిగిలిన డిమాండ్ విత్తన విధానంపై మేధావులతో, రైతు నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఒక్క సమస్యను పరిష్కరిస్తే ఇక ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్న రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడినట్లే. నాటి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆరు రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోలీసు కాల్పులలో గాయపడిన రైతులను పరామర్శించడానికి వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు సమస్యపై పూర్తి అవగాహన ఉండడంతో పరిష్కార మార్గాలు చూపడంలో సఫలమవుతున్నారు. గతేడాది ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమం బాట పట్టడంలో ఎంపీ కవిత, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు సీఎం కేసీఆర్‌తో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నల కొనుగోలును ప్రారంభించారు. జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదు లక్షల 4 క్వింటాళ్ల ఎర్ర, తెల్ల జొన్నలను కొనుగోలు చేశారు. గిట్టుబాటు క్వింటాలుకు ధరను రూ. 2,300 ప్రకటించడంతో రైతులు పంటను ప్రభుత్వానికి విక్రయించారు. ఏం జరిగిందంటే.. ఆర్మూర్ ప్రాంతంలోని సుమారు 25 వేల రైతు కుటుంబాలు ఎర్రజొన్నలను పండించారు. సీడ్ వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రతి ఏడాది రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేస్తుండడంతో ఈసారి క్వింటాలుకు రూ. 1,540 చెల్లించాలని రైతులు ఉద్యమించారు. ఆ ధర చెల్లించడానికి ఆర్మూర్ మండలం అంకాపూర్‌కు చెందిన గోదావరి హైబ్రీడ్ సీడ్స్ కంపెనీ యజమాని మహిపాల్‌రెడ్డి ముందుకు వచ్చాడు. దీంతో సీడ్ వ్యాపారి డిమాండ్ మేరకు ఈ ప్రాంతంలో పండించే ఎర్రజొన్న విత్తనాలన్నీ మహిపాల్‌రెడ్డికే అమ్మాలని కలెక్టర్ సమక్షంలో రాత పూర్వక ఒప్పందం కుదిర్చారు. రైతులు పండించిన సుమారు 5 లక్షల 11 వేల క్వింటాళ్ల ఎర్రజొన్నలను సీడ్ వ్యాపారి స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల 3 వేల క్వింటాళ్లకు మాత్రమే రూ. 1,540 క్వింటాలు చొప్పున రైతులకు రూ. 32 కోట్లు చెల్లించాడు. అనంతరం ఎర్రజొన్నలు ఢిల్లీ మార్కెట్లో అమ్ముడుపోకపోవడం, వ్యాపారికి బ్యాంకు రుణం రాకపోవడంతో రైతులకు చెల్లించాల్సిన రూ. 46 కోట్లు చెల్లించలేనని చేతులు ఎత్తేశాడు. దీంతో ఆగ్రహించిన రైతులు పలుమార్లు ఉద్యమాలు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేపట్టారు. 2008 జూన్ 16న 44వ, 63వ జాతీయ రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. రైతులు వేల సంఖ్యలో ఆర్మూర్‌కు తరలి రావడంతో ఉద్యమం అదుపు తప్పి హింసాయుతంగా మారింది. ఆందోళనకారుల ఆగ్రహం తారాస్థాయికి చేరడంతో సీడ్ వ్యాపారులు మహిపాల్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు తగలబెట్టారు. మూడు ప్రభుత్వ వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రైతులను నియంత్రించడానికి గాలిలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో నలుగురు రైతులు గాయపడ్డారు. వేల్పూర్ మండలం పడగల్‌కు చెందిన ఏనుగు శేఖర్‌కు బుల్లెట్ గాయమైంది. ఈ ఘటనతో దిగివచ్చిన ప్రభుత్వం ఏపీ సీడ్స్ కార్పోరేషన్ ద్వారా ఎర్రజొన్నలు కొనుగోలు చేయించడానికి నిర్ణయించి ఉద్యమాన్ని విరమింపజేసింది. సీడ్ వ్యాపారి నుంచి సుమారు మూడు లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్నలను స్వాధీనం చేసుకొని క్వింటాలుకు రూ. 1,200 చొప్పున రైతులకు రూ. 35 కోట్లు చెల్లించింది. ఏపీ సీడ్స్ ఎర్రజొన్నలు అమ్మగా వచ్చిన లాభాన్ని రైతులకు తిరిగి చెల్లించాల్సి ఉంది. లేని పక్షంలో సీడ్ వ్యాపారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకొని బకాయిలు రాబట్టి రైతులకు 2008 ఆగస్టు నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏపీ సీడ్స్ వారు ఎర్రజొన్నలు విక్రయించగా లాభాలు రాకపోవడంతో సుమారు రూ. 10 కోట్ల 83 లక్షలు బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ బకాయిలను ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు చెల్లించింది. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
పెర్కిట్(ఆర్మూర్): భీంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏర్గట్ల మండల కేంద్రంలో గత ఫిబ్రవరి 27వ తేదీన ఎస్బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన భీంగల్ సీఐ సైదయ్య, సీసీఎస్ సీఐ నరేశ్‌కుమార్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. బిహార్ రాష్ట్రం ముజాఫర్పూర్ జిల్లాకు చెందిన శివశంకర్ షా, సురేందర్ సహాని ఫిబ్రవరి 25వ తేదీన కూలిపని నిమిత్తం ఏర్గట్ల గ్రామానికి వచ్చారు. అనంతరం గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకు దోపిడీకి పన్నాగం పన్నారు. రెండు రోజులు రెక్కి నిర్వహించిన అనంతరం 27వ తేదీన ముసుగులు ధరించి బ్యాంకులో చొరబడ్డారు. సీసీ కెమెరాను ధ్వంసం చేసి లాకర్‌ను తెరిచే ప్రయత్నం చేశారు. లాకర్ తెరుచుకోకపోవడంతో అక్కడే ఉన్న ఐదు కంప్యూటర్ మానిటర్లను దొంగలించి ఉడాయించారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ఫణిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ కార్తికేయ ప్రత్యేక బృందాలతో కేసును దర్యాప్తు చేయించారు. భీంగల్ సీఐ సైదయ్య, సీసీఎస్ సీఐ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులను రెండు రోజుల క్రితం బిహార్‌లో అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అక్కడి కోర్టులో హాజరు పరిచి ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏర్గట్ల ఎస్సై హరిప్రసాద్, ఐడీ కానిస్టేబుళ్లు రాజేందర్, రమేశ్, రాములు, నరేందర్, సురేందర్, గంగాప్రసాద్, కేర్ బాజీ, గంగాధర్‌కు రివార్డులను అందజేయనున్నట్లు ఏసీపీ వెల్లడించారు. -
గల్ఫ్ బాధితుల పోరుబాట
ప్రత్యేక తెలంగాణలో పెరిగిన గల్ఫ్ మృతుల సంఖ్య బాధిత కుటుంబాలకు అందని ఎక్స్‌గ్రేషియా ఆర్మూర్‌లో శనివారం పోరుబాటకు సన్నాహాలు ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఏర్పాట్లు సొంతగడ్డపై ఉపాధి కరువై.. కోటి ఆశలతో గల్ఫ్‌బాట పట్టిన జిల్లావాసులెందరో విగతజీవులుగా ఇళ్లకు చేరుతున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి, సరైన పని దొరకక, అక్కడి ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలున్నాయి. మరికొందరు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా గల్ఫ్‌లో మృతిచెందిన వారి కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అప్పుల భారంతో మృతుని కుటుంబసభ్యులు సైతం ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాలకులు వీరి సమస్యల పరిష్కారంలో చిన్నచూపు చూస్తుండటంతో సుమారు పదేళ్లుగా ఈ ప్రాంతంలో గల్ఫ్ బాధితుల ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలో నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల గల్ఫ్ బాధితులు పోరుబాటను నిర్వహించనున్నారు. ఆర్మూర్: ఉపాధి వేటలో ఎందరో మంది తెలంగాణ ప్రాంత యువత గల్ఫ్ బాట పడుతున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఏజెంట్ చెప్పిన పని లేకపోవడం, పనిచేసే చోట ఒత్తిడి తట్టుకోలేక ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విగతజీవులుగా ఇళ్లకు చేరుతున్నారు. ఇలా గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవకపోవడంతో గల్ఫ్ వెళ్లడానికి చేసిన అప్పుల భారంతో మృతుడి కుటుంబసభ్యులు కూడా తప్పని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. లక్షల్లో యువత గల్ఫ్‌బాట.. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, మెదక్ చుట్టపక్కల జిల్లాల నుంచి లక్షల మంది యువత గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీ అరేబియా, యూ ఏఈ, ఇరాక్‌తో పాటు ఇరాన్ దేశాల్లో కూలీలుగా పని చేయడానికి వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇలా గల్ఫ్‌బాట పట్టిన వారి సంఖ్య సుమారు పదిలక్ష ల వరకు ఉండగా, అందులో నిజామాబాద్, కామా రెడ్డి జిల్లాల నుంచే సుమారు రెండులక్షల మంది ఉం టారు. గల్ఫ్‌కు వెళ్లి వచ్చినవారు, ఏజెంట్ల మోసాలకు బలైనవారు మరో పదిలక్షల మంది వరకు ఉంటారు. గల్ఫ్ బాధితుల డిమాండ్లు.. గల్ఫ్ మైగ్రేట్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 2వేల కోట్లు కేటాయించాలి. దాని ద్వారా ఇతర దేశాలకు వెళ్లి నష్టపోయిన వారికి పావలా వడ్డీకి రుణాలు ఇచ్చి స్వయం ఉపాధిలో ప్రోత్సహిచాలి. విదేశాల్లో ఉన్న వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఏటా రూ. 500 కోట్లు కేటాయించాలి. గల్ఫ్‌తో పాటు విదేశాల్లో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీలో తెలుగు అధికారిని నియమించాలి. గల్ఫ్‌లో ఉన్న వారికి, వారి కుటంబసభ్యులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలి. నకిలీ ఏజెంట్ల వ్యవస్థను రూపుమాపి మోసపోయిన వారికి డబ్బులు తిరిగి ఇప్పించాలి. సెక్రెటేరియట్‌లో ఉన్న ఎన్ఆర్ఐ సెల్ కార్యాలయాన్ని అందరికీ అందుబాటులో బయటకు తరలించాలి. ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక పోలీస్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక రాష్ట్రంలో మృతుల సంఖ్య 431 2014 జూన్ 2 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి నేటివరకు అధికారిక లెక్కల ప్రకారం గల్ఫ్‌లో 431 మంది అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, పని చేసే చోట ప్రమాదాలు, ఆత్మహత్యలు.. తదితర కారణాలతో మృత్యువాత పడ్డారు. వీరి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోవడం సమస్యగానే మారింది. అయితే సమైక్య రాష్ట్రంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లించేవారు. గత ఎన్నికల సమయంలో ఈ ఎక్స్‌గ్రేషియాను రూ. ఐదులక్షల కు పెంచాలని ఉద్యమాల్లో డిమాండ్ చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూపాయి కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోవడంతో గల్ఫ్ బాధితులు ఆందోళన బాట పడుతున్నారు. -
హమ్మయ్య.. బతికిపోయాం..
ఆర్మూర్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వాయిదా పడటంతో అసెంబ్లీకి పోటీకి నిలిచే అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఆనందపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకటించాలని భావించిన పలు పార్టీల నాయకులకు కోర్టు నిర్ణయం నూతనోత్తేజానికి కలిగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వాయిదా తరహాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వాయిదా వేస్తే బాగుండునని అసెంబ్లీ అభ్యర్థులు భావించారు. అయితే ఈనెల 2న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించాల్సి ఉండగా హైకోర్టు ఈనెల 9న ఫలితాలను ప్రకటించాలంటూ వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యున్నత న్యాయస్థానం సార్వత్రిక ఎన్నికలు ముగిశాక మే 10న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని సోమవారం నిర్ణయించింది. దీంతో కౌన్సెలర్ అభ్యర్థుల ఫలితాల అనంతరం చైర్ పర్సన్ ఎంపికకు మరో వారం రోజుల సమయం ఉండే పరిస్థితులుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో పట్ల పలు పార్టీల నాయకులు సంతోషం వెలిబుచ్చుతున్రాను. జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల జాతరలో భాగంగా నిర్వహిస్తున్న మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలన్నీ మార్చి, ఏప్రిల్ నెలలోనే ఉండటంతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించే అసెంబ్లీ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సింబల్‌పై జరిగినప్పటికీ స్థానికంగా అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌తోనే ఓటర్లు స్పందిస్తారు. ఈ రెండు ఎన్నికల్లో ఓటర్లు పార్టీలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వకుండా తమకు అందుబాటులో ఉండే అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించని పక్షంలో ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందని అసెంబ్లీ అభ్యర్థులు ఆందోళన వ్యక్త చేశారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్‌లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు బాల్కొండ, బాన్సువాడు, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, జుక్కల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అసెంబ్లీ అభ్యర్థులకు మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల వాయిదా కలిసి వచ్చే అంశంగా మారింది. పని చేసే వారికి కొదవ ఉండదు.. సార్వత్రిక ఎన్నికలకు ముందే మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే ఓటమి పాలైన అభ్యర్థులు ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రకటించే పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో పార్టీ టికెట్‌పై పోటీకి నిలిచిన మున్సిపల్ కౌన్సెలర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో సైతం పని చేసే అవకాశం ఉంటుందని అసెంబ్లీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. -
ఈ పంటకు పరిహారం ఇవ్వరట!
ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్: ఏడెనిమిది నెలల పాటు పంటను కంటికి రెప్పలా కాపాడారు. చేతికి వచ్చిన పంటను రిక్కి, ఉడికించి కల్లాల వద్ద ఆరబెట్టుకున్నారు. మార్కెట్‌కు తరలించే లోపే అకాల వర్షం కాటేసింది. పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగు మారిన పంటను అమ్ముదామంటే రేటు కూడా రాదు. పంటను పొలం నుంచి తవ్వితీసినందున నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం రాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పసుపు పంటను పండించిన రైతులు దిక్కుతోచని స్థి తిలోకి పడిపోయారు. కళ్ల ముందే పాడైపోయిన పసుపును చూసి కన్నీంటి పర్యంతమవుతున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్లోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్, నందిపేట్ మండలాల్లో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కలాల వద్ద ఆరబెట్టిన పసుపునకు న ష్టం వాటిల్లింది. రైతులు వేల రూపాయలు ఖర్చుచేసి పంటను పండించారు. ఆరబెట్టిన పసుపు వర్షానికి త డిసి నష్టం వాటిల్లితే ఎందుకు పరిహారం చెల్లంచరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపునకు పరిహారం అంచనా వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో న్యాయం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో అకాలవర్షాలతో కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు పంట కు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించారు. ప్రభుత్వ ని బంధనలు సడలించి నష్టపరిహారం అందేలా అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తడిసిపోయిన ఎకరం పసుపు పంటకు రూ. రెండు వేల చొప్పున రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకుని తడిసిన పసుపు నకు నష్టం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. -
అంగన్వాడీల వినూత్న నిరసన
ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కో రుతూ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆదివారం నోటికి నల్ల గుడ్డలు ధరించి మౌన ప్రదర్శన ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ చేపట్టిన అంగన్వాడీలు కొత్త బస్టాండ్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ వరకు సాగారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిం చాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ పిలుపు మేరకు చేపట్టిన అంగన్వాడీ, సహాయకుల అ సోసియేషన్ నాయకులు గోదావరి, చంద్రకళ, లక్ష్మీ, జగదాంబ, సునంద, కవిత, అరుణ, వసంత, వని త, భూలక్ష్మి, సీఐటీయూ నాయకులు కుతాడి ఎల్లయ్య, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. నందిపేట: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నందిపేట మండల కేంద్రంలో ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మౌన ప్రదర్శన చేశారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయం నుంచి మౌన ప్రదర్శన చేస్తు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సెక్టార్ లీడరులు గీత, విమల, వనిత, అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలు పాల్గొన్నారు. -
తెలంగాణే లక్ష్యం
ఆర్మూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్రం విడిపోయాక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఒక్క సింగరేణిలోనే 50 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి పాలకులు తెలంగాణ ప్రాంత రైతుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అర్ధశతాబ్దం దాటినా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు నిదర్శ నం. సీమాంధ్రలో మాత్రం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశారు. తెలంగాణ ప్రాంత రైతాంగం కొట్లాడితే గాని పాలకులు స్పందించడం లేదు. ఆర్మూర్ ప్రాంత రైతులు దశాబ్దం పాటు పోరాడితే గుత్ప ఎత్తిపోతల పథకం నిర్మించారు. సమైకాంధ్రలో తెలంగాణ ప్రాంతంలోనే పసుపు పంట ఎక్కువగా పండిస్తారు. అందుకే పసుపు రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. సీమాంధ్రలో పండించే ప్రమాదకరమైన పొగాకు పంట కోసం మాత్రం ప్రభుత్వం 1975లో గుంటూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వారి గోడును సీమాంధ్ర పాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ కార్మికులు ఇతర రాష్ట్రాల యాజమాన్యాలతో కొట్లాడి తమ హక్కులను సాధించుకుంటున్నారు. లక్కంపల్లి సెజ్ భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలి. ఆర్మూర్ ప్రాంత రైతులకు ఎర్రజొన్నల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రైతులకు రావాల్సిన రూ.10 కోట్ల 83 లక్షలు ఇప్పిం చేందుకోసం కార్యాచరణ రూపొందిస్తాం. -
వేర్వేరుగా ముగ్గురి ఆత్మహత్య
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్: ప్రేమవివాహం అనంతర ం తల్లిదండ్రులు చేరదీయడం లేదని మాదగోని హరీష్‌గౌడ్(25) అనే యువకుడు గురువారం రాత్రి గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివరాజ్ వివరాల ప్రకారం.. నవీపేట్ మండలం నందిగామకు చెందిన హరీష్ గౌడ్ పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం ఆర్మూర్ పట్టణానికి వలస వచ్చాడు. పట్టణంలో రాంనగర్లో నివాసముంటూ ఓ కల్లు డిపోలో పనిచేస్తున్నాడు. మూడేళ్ల కిత్రం పట్టణానికి చెందిన స్వాతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని హరీష్ తల్లితండ్రులు నిరాకరించారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా మూడు రోజుల క్రితం కుమారుడి పుట్టు వెంట్రుక ల కార్యక్రమానికి తల్లిదండ్రులను ఆహ్వానించాడు. వారు ఆహ్వానాన్ని తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన హరీష్ గురువారం సాయంత్రం ఇంట్లో గుళికల మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హరీష్‌ను స్థానికులు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శివరాజ్ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్, సావిత్రిలకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నవీపేట : పుట్టు వెంట్రుకల శుభకార్యం జరగాల్సిన ఇంట్లో చావుమేళాలు మోగాయి. నవీపేట మండలంలోని నందిగామకు చెందిన హరీష్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆయన సొంతూరు నందిగామలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. హరీష్గౌడ్కు 11 నెలల కిందట బాబు పుట్టగా పుట్టు వెంట్రుకల శుభకార్యాన్ని శుక్రవారం వైభవంగా జరపాలని నిశ్చయించుకున్నారు. బంధువులకు ఆహ్వానాన్ని పంపారు. అంతలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. బావిలో దూకి వివాహిత మద్నూర్ : మద్నూర్ మండలంలోని మేనూర్‌కు చెందిన పులికల్ల సారిక(27) అనారోగ్యంతో బాధపడుతూ గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌హెచ్‌వో శోభన్‌బాబు తెలిపారు. ఎస్‌హెచ్‌వో వివరాల ప్రకారం... సారిక కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గురువారం మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వె ళ్లిపోయి గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం వరకు సారిక ఇంటికి రాకపోవడంతో కుటంబసభ్యులు ఆందోళన చెందారు. బావిలో మృతదేహం ఉన్నట్లు శుక్రవారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బావిలోంచి బయటకి తీసి సారికగా గుర్తించారు. బిచ్కుంద సీఐ వేంకటేశ్వర్లు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. సారికకు ఇద్దరు కుమారులు,భర్త సాయిలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో.. ఆర్మూర్ అర్బన్ : భార్యభర్తల మధ్య గొడ వ భర్త ఆత్మహత్యకు దారితీసింది. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో రోళ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఉరుసు భీమయ్య(25) శుక్రవారం లయన్స్ బిల్డింగ్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏఎస్సై ఖాజమొహీయోద్దీన్ వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఉరుసు భీమయ్య పదేళ్ల క్రితం ఆర్మూర్ పట్టణానికి జీవనోపాధి కోసం వలస వచ్చాడు. మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన శాంతతో ఆయనకు వివాహం జరిగింది. కాగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం భార్యతో గొడవపడి భీమయ్య ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయలు దేరాడు. అనంతరం లయన్స్ బిల్డింగ్ సమీపంలో చెట్టు ఉరివేసుకుని కొట్టుమిట్టాడుతుండగా.. ఆయనను వెతుక్కుంటూ వెళ్లిన ఉర్సు గణేష్, పల్లెపు సాయిలు, ఉర్సు లక్ష్మణ్ అనే బంధువులు గమనించి ఉరి తాడును తొలగించి భీమయ్యను రక్షించే ప్రయత్నం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే భీమయ్య ప్రాణాలను విడిచాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
గిట్టుబాటుకలేనా!
ఆర్మూర్, న్యూస్‌లైన్: పసుపు మద్దతు ధర కోసం రైతులు గతంలోనూ ఆందోళనలు నిర్వహించారు. జాతీయ రహదారులను దిగ్బంధించి ఆటలు ఆడారు. అక్కడే వంటలు చేసుకు ని సహపంక్తి భోజనాలు చేశారు. పాదయాత్రలతో కలెక్టరేట్‌ను ముట్టడించారు. దేశ, రాష్ట్ర రాజధానుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర కో కన్వీనర్ కోటపాటి నర్సింహనాయు డు రాష్ట్ర ముఖ్యమంత్రి, స్పీకర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుసుకుని పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు. అయినా స్పందన లేకుండా పోయింది. దీంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సీజన్లో పండించిన పసుపును ఉడకబెట్టి, శుద్ధి చేసి మార్కెట్‌కు తరలించడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణమిది. ఆశించిన ధర లభిస్తుందో.. లేదోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. దీర్ఘకాలిక పంట అయిన పసుపును పం డించడానికి ఎకరానికి ఒక లక్ష నుంచి లక్షన్నర రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. సాగు పద్ధతులను అనుసరించి ఎనిమిది నుంచి ఇరవై క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ సీజన్ ప్రారంభంలో నాణ్యమై న పసుపునకు క్వింటాలుకు రూ.4,500 నుంచి రూ. 4,600 వరకు మాత్రమే ధర లభిస్తోంది. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. దిగుబడి ఎంత వస్తోంది ఈ సీజన్లో జిల్లాలో సుమారు 13 వేల హెక్టార్లలో పసుపు పంటను సాగు చేశారు. కొందరు ఆదర్శ రైతులకు ఎకరానికి 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, భీమ్‌గల్, కమ్మర్పల్లి ప్రాంతాల రైతులతోపాటు అధిక మొత్తంలో రైతులకు 8 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతుకు ప్రస్తుత ధర ప్రకారం లెక్కకడితే సుమారు రూ. 55 వేలకు మించి రాదు. పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వచ్చి ఆర్థికంగా నష్టపోతున్నారు. నూటికి పదోవంతు ఆదర్శ రైతులకు మాత్రమే దిగుబడి అధికంగా వచ్చి లాభపడుతున్నారు. నాటి పసుపు రైతుల ఉద్యమాలు మద్ధతు ధర సాధించుకోవడం కోసం స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో పసుపు రైతులు 2008 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఏడు రోజులపాటు ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, భీమ్‌గల్, నందిపేట్ మండలాలలోని గ్రామాల మీదుగా 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహిం చారు. ధర్నాలు, ర్యాలీలు, పాదయాత్రలకు టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ మద్దతు తెలిపాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్‌రావు, రవీందర్‌రెడ్డి స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 2008 ఫిబ్రవరి 5న కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధాన రహదారులను దిగ్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో, సంబంధిత అధికారులతో చర్చిస్తానని జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేశారు.