సాక్షి, న్యూఢిల్లీ : నిజామాబాద్ పసుపు రైతులు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్న రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్, తమిళనాడుకు చెందని దాదాపు 54 మంది రైతులు నిజామాబాద్ నుంచి వారణాసికి బయలుదేరి వెళ్లారు. రైతులకు మద్దతుగా.. పసుపు రైతుల సంఘం జాతీయ అద్యక్షులు దైవ శిగామణీ, రాష్ట్ర అద్యక్షులు కోటపాటి నర్సింహ నాయుడు వారణాసికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. మరికాసెపట్లో రైతులు నామినేషన్లు వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment