సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాధుని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి అంకెల కంటే కెమిస్ర్టీ (భావోద్వేగాలు)యే పనిచేసిందని ప్రధాని పేర్కొన్నారు.
బీజేపీని హిందీ రాష్ట్రాల్లో ప్రాబల్యం కలిగిన పార్టీగా రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో తాము అత్యధిక స్ధానాలను గెలుచుకున్నామని, గోవా సహా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నామని అయినా తమ పార్టీ హిందీ బెల్ట్‌కే పరిమితమా అని ఆయన ప్రశ్నించారు. అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో బీజేపీ ప్రభుత్వాలు లేదా తమ సారథ్యంలోని కూటమి ప్రభుత్వాలు నడుస్తున్న క్రమంలో బీజేపీని కేవలం హిందీ రాష్ట్రాల పార్టీగా పరిగణించడం పట్ల మోదీ ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment