Turmeric farmers
-
పసుపు రైతులకు ఇచ్చేది రూ.7 వేలే!
తెనాలి: గుంటూరు జిల్లా దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పసుపు నిల్వలను నష్టపోయిన రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున మాత్రమే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రస్తుత మార్కెట్లో ధరను దృష్టిలో పెట్టుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని పసుపు రైతుల సంఘం కోరింది.బీమా పరిహారం కలిపి క్వింటాల్‌కు రూ.7 వేలకు మించి ఇవ్వలేమని సర్కారు చేతులెత్తేసింది. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివసాంబిరెడ్డి తెలిపారు. గురువారం తెనాలిలో సబ్ కలెక్టర్ ప్రఖర్‌జైన్‌ను పసుపు శివసాంబిరెడ్డి, పలువురు రైతులు కలిశారు. శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం విజయవాడ మార్క్‌ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు, అధికారులు కోల్డ్ స్టోరేజీ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందం సంతకాలు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని క్వింటాల్‌కు కనీసం రూ.10 వేలైనా ఇప్పించాలని కోరినట్టు చెప్పారు.బీమా పరిహారంతో కలిపి రూ.7 వేలకు మించి ఇవ్వలేమని మంత్రి వెల్లడించగా.. రైతులు అయిష్టంగానే అంగీకరించారని తెలిపారు. దీనివల్ల పసుపు రైతులు రూ.20 కోట్లు నష్టపోయినట్టు శివసాంబిరెడ్డి, చందు సత్యనారాయణ తెలియజేశారు. చర్చల్లో బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, దేవభక్తుని నాగ వీరబసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు, గద్దె శ్రీహరి, భీమవరపు సీతారామిరెడ్డి, బొల్లిమంత రామారావు, తుంగల వీరరాఘవులు పాల్గొన్నట్టు వివరించారు. -
పసుపు రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు
-
ఆ 68 మంది రైతులపై అనర్హత వేటు
మోర్తాడ్ (బాల్కొండ): పసుపు బోర్డు ఏర్పాటు సాధనే లక్ష్యంగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక నామినేషన్లు దాఖలు చేసి దేశ ప్రజలను ఆకర్షించిన రైతు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. 2019 సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులకు సంబంధించిన లెక్కలను ఎన్నికల అధికారికి పోలింగ్ ముగిసిన నెల రోజులలోపు అందచేయాల్సి ఉంది. అయితే ఆ 68 మంది అభ్యర్థులు ఎన్నికల అధికారికి తమ ప్రచార లెక్కలకు సంబంధించిన నివేదికలను సమర్పించలేదని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయించింది. అనర్హులుగా గుర్తించబడిన అభ్యర్థులు మూడేళ్ల వరకు పార్లమెంట్, అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదు. ఈ మేరకు రెండు రోజుల కింద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయెల్ ఉత్తర్వులను జారీ చేశారు. -
పసుపు మద్దతు ధరేదీ?
-
పసుపు పంటకు లాభాల పారాణి
సాక్షి, అమరావతి: ఐదేళ్ల తరువాత పసుపు రైతులు లాభాలు పొందుతున్నారు. వారి కష్టానికి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు తోడు కావడంతో ఎకరానికి కౌలు, సాగు ఖర్చులు పోను ప్రతి రైతు కనీసం రూ.50 వేలకు పైగా లాభం పొందుతున్నాడు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల క్రితమే పసుపు పంట క్వింటాకు రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. పంట చేతికి వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచింది. పంటను కొనుగోలు చేసిన వారంలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. దీంతో మరో మార్గం లేక ప్రైవేట్ వ్యాపారులు సైతం రైతుల నుంచి పోటీపడి పంటను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటు పంటను పరిగణనలోకి తీసుకుని ఎకరా పొలం కలిగిన రైతు నుంచి 24 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని, రెండు ఎకరాల్లోపు భూమి కలిగిన రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఒక్కొక్క రైతు నుంచి గరిష్టంగా 40 క్వింటాళ్లను కొనుగోలు చేస్తోంది. సాగుకు ముందే ధర ప్రకటించి.. ► సీఎం వైఎస్ జగన్ పసుపు, మిర్చి, చిరు ధాన్యాలకు సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించారు. ► దీంతో తాము పండించిన పంటను అమ్ముకోగలమనే ధీమా రైతులకు ఏర్పడింది. ► గతంలో వ్యాపారులు రైతుల నుంచి క్వింటా పసుపును రూ.5 వేల నుంచి రూ.5,500 లోపే కొనుగోలు చేశారు. 2017–18లో రూ.5,450, 2018–19లో రూ.5,500లకు కొనుగోలు చేశారు. ► రాష్ట్రంలో 29,654 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో అధికంగా ఈ పంట సాగయ్యింది. ► మొత్తంగా 1.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ► కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరాకు సగటున 35 క్వింటాళ్ల దిగుబడి వస్తే శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ► ఎకరా కౌలుకు రూ.50 వేలు, సాగుకు రూ.80 వేలు, మొత్తంగా రూ.1.30 లక్షల ఖర్చు అవుతోంది. ► 30 క్వింటాళ్ల పంటను కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్ముకుంటే రూ.2.05 లక్షల వరకు నగదు వస్తోంది. అన్ని ఖర్చులు పోను రైతుకు ఎకరాకు రూ.65 వేల వరకు ఆదాయం లభిస్తోంది. ► గతంలో రెండు, మూడు జిల్లాలకు ఒక పసుపు కొనుగోలు కేంద్రం ఉండేది. ఈ ఏడాది 8 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ► రైతుల నుంచి 10,200 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుని, ఇప్పటివరకు 3 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసింది. దళారులు లేకుండా చేశాం పసుపు క్వింటాకు రూ.6,850 మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు పంటను అమ్ముకోవచ్చనే ధీమా ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోగా మిగిలిన పంటకు కూడా ప్రైవేట్ మార్కెట్లోనూ రైతులకు మంచి ధర లభిస్తోంది. గరిష్ట సేకరణను 30 నుంచి 40 క్వింటాళ్లకు పెంచడంతో రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతోంది. – ఎస్.ప్రద్యుమ్న, ప్రత్యేక కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
పసుపు రైతులపై కరోనా ఎఫెక్ట్
-
టీఆర్ఎస్ హిందువులకు వ్యతిరేకం: అరవింద్
సాక్షి, నిజామాబాద్: సంక్రాంతిలోపు పసుపుకి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు బోర్డు కన్నా మంచి పరిష్కారం దిశగా కేంద్ర నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో రైతులకు మంచి రోజులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనారిటీలకు ఓవైసీ అనే అద్దాలు తొడిగి ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ వలలో పడ్డ ముస్లింలు ఇకనైనా ఓట్లు వేసే సమయంలో ఆలోచించండని కోరారు. కాగా టీఆర్ఎస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా మారిందన్నారు. ఎంఐఎం పార్టీ ముస్లింలకు, హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పౌరసత్వ బిల్లుతో ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. పసుపు రైతుల గురించి అరవింద్ మాట్లాడుతూ.. ‘సుగంధ ద్రవ్యాల లిస్టులో ఉన్న పసుపుకు ప్రచారం లభించలేదు. అందుకే పసుపు రైతులకు మద్దతు ధర లభించలేదు. బోర్డుల వల్ల పంటలకు న్యాయం జరగడం లేదు. త్వరలో కొన్ని బోర్డులు రద్దయ్యే అవకాశం ఉంది. కేంద్రం పసుపు పంటకు బోర్డుతో ఉండే అధికారాలతో పాటు సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది. పసుపు రైతుల కోసం ప్రతియేడు రూ.100 నుంచి రూ.200 కోట్లు ఇవ్వనున్నాం. ఇకపై పసుపు విత్తనాలు, ఎరువు, అమ్మకాలు, కొనుగోలు, నాణ్యత, పంట బీమా, మద్దతు ధర అన్నీ ఇక్కడే నిర్ణయిస్తాం. ఇక్కడ పండించే పసుపును విదేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని నూతన విధానం ద్వారా కల్పిస్తాం. రైతులకు పసుపు విషయంలో అపోహలు వద్దు. పసుపు బోర్డు కన్నా మంచి విధానాన్ని అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకి మద్దతు ధర ప్రతిపాదనలు పంపితే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా వుంది. కానీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు ఎందుకు పంపటం లేద’ని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం
సాక్షి, బాల్కొండ: గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ నేతల రాతలు మార్చిన పసుపు రైతులు మరో పోరాటానికి సిద్ధం అవుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పసుపు బోర్డుతో ముందుంటానని మాట ఇచ్చిన నాయకులు ఇప్పుడు మీనమేషాలు లేక్కపెడుతుండంతో రైతులు ఇక వేచి చూడడం తమ వల్ల కాదంటూ పోరుబాటకు సిద్ధపడుతున్నారు. ఈ నెల 15 డెడ్‌లైన్‌తో ఆధికార పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. కనీసం మద్దతు ధర కల్పించర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక పెట్టుబడితో, దీర్ఘకాల పంటగా సాగు చేసే పసుపుకు ఇప్పటికైన మద్దతు ధర దక్కదా? పసుపు బోర్డు ఏర్పాటు కాదా ?అనే అనుమానాలు సామాన్య రైతులను ఇప్పటికి వెంటాడుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు పసుపు రైతులు భారీ ఉద్యమం చేపట్టి నేతల తల రాతాలను మార్చారు. కాని పసుపు రైతుల రాత మాత్రం మారలేదు. ధరపై ఇంకా భరోసా లభించలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హమీలిచ్చిన నేతలను నిలదీస్తుమంటున్నారు. జిల్లాలో తల్లిపంటగా భావించి 33 వేల ఎకరాల్లో పసుపును సాగు చేస్తారు. పసుపుకు అధిక పెట్టుబడితో, దీర్ఘకాలిక పంట కావడంతో అన్నదాతల శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయాల పెట్టుబడి అవుతుంది. మంచి దిగుబడి, మార్కెట్లో ఆశించిన ధర పలికితే ఎకరానికి 2.5 లక్షల ఆదాయం వస్తుంది అని రైతులు అంటున్నారు. కాని ప్రస్తుతం ఉన్న ధరలతో పెట్టిన పెట్టుబడి కూడ గిట్టని పరిస్థితి ఉంది. పదిహేనేళ్లుగా పోరాటం పసుపు ప్రత్యేక బోర్డు కోసం, మద్దతు ధర కోసం రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రైతన్నలు పదిహేనేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. కాని ఇప్పటి వరకు ఉలుకు, పలుకు లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయిన రైతులు పసుపుకు మద్దతు ధర దక్కేల చూడాలని పోరాటాలను చేస్తునే ఉన్నారు. ఇప్పుడైన కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 15 వరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించకుంటే అందోళనలు తీవ్రతరం చేస్తామని రైతు ఐక్య కార్యచరణ కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ హయంలో స్వర్ణయుగం పసుపు రైతులకు దివంగత ముఖ్యమంత్రి రాజాశేఖర్‌రెడ్డి హయంలో స్వర్ణయగంగా చెప్పుకోవచ్చు. పసుపును మార్క్‌ఫేడ్ ద్వారా కొనుగోలు చేపించడంతో క్వింటాకు రూ.17వేలు పలికింది. దీంతో పసుపు కోసం పోరాటాలు చేసిన ప్రతి సందర్భంలో రైతులు దివంగత నేతను యాది చేస్తునే ఉంటారు. వైఎస్ హయంలోనే పసుపు రైతులు లాభాలను చూశారు. కాని తరువాత వచ్చిన పాలకులు పసుపు పంటకు క్వింటాళుకు 4 వేల రూపాయాలు సరిపోతుందని నివేదికలు ఇచ్చి పసుపు రైతల నోట్లో మట్టి కొట్టారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని గత లోక్‌సభ ఎన్నికల్లో నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలి. పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. లేదంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ధర లేక పోతే పంటను సాగు చేసి ఏం లాభం. - బుల్లెట్ రాం రెడ్డి మద్దతు ధర ప్రకటించాలి పసుపు పంటకు క్వింటాకు రూ.15వేల మద్దతు ధరను వెంటనే ప్రకటించాలి. ఎన్నికలకు ముందు అది చేస్తాం.. ఇది చేస్తామని నాయకులు ఇప్పుడు మోసం చేసీ మొఖం చాటేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించకుంటే ఉద్యమం పెద్దగ చేస్తాం. పసుపు రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. - ముస్కు రాజేశ్వర్ -
వారణాసిలో నామినేషన్ల తిరస్కరణపై రైతుల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పసుపు రైతుల మూకుమ్మడి నామినేషన్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద సైతం పసుపు రైతులు భారీగా నామినేషన్లు దాఖలు చేయాలని భావించారు. అయితే వారి ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. అనూహ్యంగా వారి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీనిపై పసుపురైతులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. -
వారణాసిలో పసుపు రైతుల నామినేషన్లు
ఆర్మూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడానికి జిల్లా నుంచి వెళ్లిన పసుపు రైతులు అక్కడ అడుగడుగునా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో నామినేషన్లు వేయడానికి 54 మంది రైతులు వెళ్లినప్పటికీ 35 మంది రైతులు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. వీరిలో కేవలం 25 మంది మాత్రమే తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు సమర్పించడంలో విఫలమైన రైతులు ఎన్నికల కార్యాలయం ఎదుట గంట పాటు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసేవిధంగా ఎన్నికల అధికారులు, పోలీసులు వ్యవహరించారని వారు ఆరోపించారు. అడుగడుగునా ఆటంకాలు వారణాసికి చేరుకున్న పసుపు రైతులు అక్కడి ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ పత్రాలను తీసుకున్నారు. రైతులు బస చేసిన హోటల్ రూమ్‌లలో పోలీసులు ప్రతి రోజు సోదాలు చేయడంతో పాటు తమ నామినేషన్లకు మద్దతు తెలపడానికి వచ్చిన స్థానిక ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 35 మంది రైతులు నామినేషన్ పత్రాలను పూర్తి చేసుకొని చలాన్ కోసం నిలబడగా సుమారు రెండు గంటల సేపు చలాన్ ఫామ్‌లను ఇవ్వని కారణంగా పది మందికి పైగా రైతులు నామినేషన్ వేయలేకపోయారు. అయితే నామినేషన్ల స్వీకరణకు ఉదయం 10 గంటలకే కార్యాలయం తెరవాల్సిన అధికారులు ఆలస్యంగా 11 గంటలకు కార్యాలయాన్ని తెరిచారని రైతు నాయకులు ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన రైతుల మద్దతుదారులను పోలీసులు లోపలికి అనుమతించకపోవడం, లోపలికి వెళ్లిన రైతులను మద్దతుదారులు ఎక్కడ అని ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎట్టకేలకు 25 మంది రైతు నాయకులు మాత్రమే నామినేషన్లు సమర్పించగలిగారన్నారు. నామినేషన్లు సమర్పించిన వారిలో పెంట చిన్న ముత్తన్న (కమ్మర్పల్లి), కుంట గంగామోహన్ రెడ్డి (ఆర్మూర్), గురడి రాజరెడ్డి (డిచ్పల్లి), కల్లెం లక్ష్మణ్ (కమ్మర్పల్లి), కొట్టాల చిన్నరెడ్డి (పడిగెల) తదితరులున్నారు. -
వారణాసిలో పసుపు రైతులకు అడ్డంకులు
సాక్షి, వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో 25 మంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన పసుపు రైతులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. పసుపు రైతుల రాష్ట్ర జిల్లా అధ్యక్షులు నర్సింహ నాయుడు, తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. 54 మందిలో 25 మంది మాత్రమే నామినేషన్లు వేయగలిగారు. మిగతా రైతులను లోపలికి వెళ్లకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులు కలెక్టరేట్ ఎదుట రోడ్డులో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్ ప్రాంత పసుపు రైతులు తరలివచ్చారు. తమకు మద్దతు ఇచ్చిన స్థానికులను బీజేపీ నాయకులు బెదిరించారని రైతులు వాపోయారు. వారణాసి వెళ్లిన రైతుల్లో 10 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోద్బలంతోనే వీరంతా వారణానికి వెళ్లారని అన్నారు. రైతుల సమస్యలను ఆమె ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. తాము ఎవరినీ వ్యతిరేకించడానికి వారణాసి రాలేదని, తమ సమస్యలను దేశం దృష్టికి తీసుకురావడానికే మోదీపై నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్టు రైతులు వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ. 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
వారణాసి కలెక్టరేట్ చేరుకున్న పసుపు రైతులు
సాక్షి, న్యూఢిల్లీ : నిజామాబాద్ పసుపు రైతులు ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం వినూత్న మార్గాన్ని ఎంచుకున్న రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్, తమిళనాడుకు చెందని దాదాపు 54 మంది రైతులు నిజామాబాద్ నుంచి వారణాసికి బయలుదేరి వెళ్లారు. రైతులకు మద్దతుగా.. పసుపు రైతుల సంఘం జాతీయ అద్యక్షులు దైవ శిగామణీ, రాష్ట్ర అద్యక్షులు కోటపాటి నర్సింహ నాయుడు వారణాసికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. మరికాసెపట్లో రైతులు నామినేషన్లు వేయనున్నారు. -
40 మంది డిపాజిట్లు కొల్లగొట్టిన మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.ఇతర రాజకీయ పార్టీల అభ్యర్ధులే కాకుండా మాజీ సైనికుడు, మాజీ న్యాయమూర్తి వంటి వారు ఓ పది మంది వరకు మోదీపై పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన 45 మంది పసుపు రైతులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఈ నియోజకవర్గంలో బరిలో దిగుతున్నారు.వీరందరినీ కలిపితే మోదీ ఈ సారి 50–60 మందితో తలపడాల్సి ఉంటుంది.బహుశా ఈ ఎన్నికల్లో అనేక మంది పోటీ చేస్తున్న నియోజకవర్గంగా వారణాసి చరిత్ర సృష్టించినా ఆశ్చర్యం లేదు. అయితే, గత ఎన్నికల్లో దేశం మొత్తం మీద రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే 42 మంది పోటీ చేశారు. వాటిలో ఒకటి మోదీ పోటీ చేసిన వారణాసి కాగా రెండోది తమిళనాడులోని దక్షిణ చెన్నై నియోజకవర్గం. ఆ ఎన్నికల్లో మోదీతో తలపడిన 41 మందిలో 40 మంది డిపాజిట్లు కోల్పోయారు. ఆప్ అభ్యర్థి కేజ్రీవాల్‌కు 2 లక్షల ఓట్లు వచ్చాయి. మోదీకి వచ్చిన 5.81 లక్షల ఓట్లలో ఇవి సగం కూడా లేవు. ఇక చెన్నై సౌత్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేసిన జె.జయవర్ధన్ కూడా తనతో తలపడిన 41 మందిని ఓడించి 1.35 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.ఈ సారి కూడా ఆయన చెన్నై సౌత్‌నుంచే పోటీ చేస్తున్నారు. -
వారణాసి చేరుకున్న పసుపు రైతులు
సాక్షి, నిజామాబాద్ : ఆర్మూరు పసుపు రైతుల బృందం వారణాసి చేరుకుంది. పసుపు రైతుల రాష్ట్ర జిల్లా అద్యక్షులు నర్సింహ నాయుడు, తిరుపతి రెడ్డిల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. వీరికి మద్దతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్ ప్రాంత పసుపు రైతులు తరలివచ్చారు. ఆర్మూర్, ఈరోడ్ ప్రాంతాల పసుపు రైతులు 29న సోమవారం నాడు వారణాసి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దాదాపు 50 మంది రైతులు పసుపు బోర్డు, మద్దతు ధరల కోసం ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
పచ్చ బంగారమాయేనా..!
వాణిజ్య పంటగా పేరొందిన పసుపు పంటపైనే జిల్లా రైతులు ఆశలు పెంచుకున్నారు. రెండు, మూడేళ్లుగా అంతంతమాత్రంగానే ఉన్న పసుపు ఉత్పత్తుల ధరలు.. ఈ ఏడాది ఎలా ఉంటాయోనని ఎదురుచూస్తున్నారు. ఈసారి వాతావరణ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు సోకినా పంటను కాపాడుకున్నారు. ప్రస్తుతం పసుపు పంట ఆకులు కోసి.. కొమ్ములను తవ్వే పనిలో అన్నదాత బిజీగా ఉన్నాడు. ఇక మార్కెట్‌కు తరలించడమే తరువాయి.. తీరా దిగుబడి మార్కెట్‌కు తరలించే సమయానికి ధర ఎంత ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి పెరిగిన నేపథ్యంలో క్వింటాల్‌కు రూ.10వేలు ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాల అగ్రికల్చర్ : జిల్లాలో ప్రధానంగా జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మల్లాపూర్, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి మండలాల్లో అత్యధికంగా, గొల్లపల్లి, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, ధర్మపురి, బుగ్గారం మండలాల్లో ఓ మోస్తారుగా పసుపు సాగుచేస్తుంటారు. దాదాపు 42 వేల ఎకరాల్లో సాగుచేస్తున్నట్లు అంచనా. పసుపుకు అనుకూలమైన ఎర్రనేలలు ఉండడం, యాజమాన్య పద్ధతులు అవలంబిస్తుండడంతో లాభసాటిగా మారింది. నాలుగేళ్ల క్రితం పసుపు ధరలు బంగారంతో పోటీపడటంతో అన్నదాత ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పసుపు పంటకు ధర ఉన్నా.. లేకున్నా ఇంటి పంటగా భావించి ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగుచేస్తున్నారు. ఇక్కడి రైతులు గుంటూర్, అర్మూర్ రకాలతోపాటు సుగుణ, సుదర్శన్ వంటి రకాలను వేస్తున్నారు. వీటిలో కుర్కుమిన్ శాతం తక్కువగా ఉండటంతో కొందరు కేరళ, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన రకాలనూ సాగుచేస్తున్నారు. ఇటీవల బెడ్ పద్ధతిని అవలంబిస్తూ కొంతమంది ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ఈసారి అంతంతే.. ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపుకు తెగుళ్లు సోకాయి. ఆకురోగం, దుంపకుళ్లు రోగంతో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి ప్రాంతాల్లో కొంతనష్టం జరిగింది. జగిత్యాల, గొల్లపల్లి, రాయికల్ మండలాల్లో పెద్దగా తెగుళ్లు రాకున్నా ఆశించినస్థాయిలో దిగుబడులు రావడంలేదని రైతులు చెపుతున్నారు. కనీసం ఎకరాకు 5క్వింటాళ్ల మేర తగ్గే అవకాశముంది. మార్కెట్లో గతేడాది క్వింటాల్‌కు రూ.5–7 వేల మధ్యలో ధర పలకగా.. దిగుబడులు వచ్చినా రేటు రాక నష్టపోయారు. ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.6–8 వేలు ఉన్నట్లు మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే పంట మార్కెట్‌కు వచ్చే వరకు ధర ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగుకు పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో కనీసం క్వింటాల్‌కు రూ.10వేలు ఉంటేనే గిట్టుబాటవుతుందని చెబుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నా.. పసుపును ఆహార పదార్థాల్లోనే కాకుండా మందులు, చర్మ సౌందర్యానికి వాడే పరిమళ ద్రవ్యాల తయారీ, రంగుల పరిశ్రమలో వాడుతుండడంతో అంతర్జాతీయంగా డిమాండ్ఉంది. ఏటా రేట్లు హెచ్చు తగ్గులకు లోనవుతుండటంతో మార్కెట్లో ఏ రేటు వస్తుందో తెలియని పరిస్థితి. రైతులు పోటీ పడి దిగుబడులు తీస్తున్నా మార్కెటింగ్ సమయంలో పెట్టుబడికి తగ్గ ధర రాక డీలా పడుతున్నారు. కొన్నేళ్లుగా పసుపు బోర్డు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా ఫలితం మాత్రం కానరావడం లేదు. చివరకు లోకల్ మార్కెట్లో ఏదో ఓ రేటుకు అమ్ముకుని నష్టాలను చవిచూస్తున్నారు. పసుపు రైతులకు పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో 9 నెలలు కష్టపడితే ఎకరాకు కనీసం రూ.25 వేలు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర ఇవ్వాలి.. పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి. అప్పుడే రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశముంది. కష్టపడి దిగుబడులు తీస్తున్నాంగానీ మార్కెట్‌కు పోయి వ్యాపారుల కాళ్లావేళ్లా పడాల్సి వస్తంది. క్వింటాల్‌కు కనీసం రూ.10వేలు ఉంటేనే రైతులకు గిట్టుబాటవుతుంది. –దొడ్లె జీవన్‌రెడ్డి, జగిత్యాల రైతు ధర చెప్పలేం.. పసుపు పంటమార్కెట్‌కు తీసుకెళ్లే వరకు ఏ రేటు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. తాత, తండ్రుల నుంచి వస్తున్న పంట కావడంతో లాభం వచ్చినా, నష్టం వచ్చినా సాగు చేస్తున్నాం. –తీపిరెడ్డి రాజవ్వ, పసుపు రైతు -
పసుపు రైతులను ఆదుకోండి: ఎంపీ కవిత
న్యూఢిల్లీ: నిజామాబాద్ ఎంపీ కవిత బుధవారం ఉదయం కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల సమస్యలపై ఆమె ఈ సందర్భంగా కేంద్రమంత్రితో చర్చించారు. పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతోపాటు కనీస గిట్టుబాటు ధర పెంపు విషయాన్ని కవిత...రాధామోహన్ సింగ్ దృష్టికి తీసుకు వెళ్లారు. అలాగే పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. దేశంలోనే పసుపు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నా.. పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర ప్రకటించే పంటల జాబితా కింద పసుపు పంటను కూడా చేర్చాలని, అలాగే ఇతర వాణిజ్య పంటల జాబితాలో పసుపును కూడా చేర్చాలని కోరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యాభై మంది పసుపు రైతులు కూడా వ్యవసాయ మంత్రిని కలిసి, తమ సమస్యలను వివరించారు. జిల్లాలో పండే పసుపుకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని జియోగ్రాఫికల్ గుర్తింపును ఇవ్వాలని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎంపీ కవిత ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓ వినతి పత్రాన్ని వ్యవసాయ మంత్రికి సమర్పించారు. -
పసుపు పంటకు ధీమా లేనట్లే!
బాల్కొండ : పంటల బీమాలో పలు మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. పసుపు రైతులను మాత్రం పట్టించుకోలేదు. నూతన వ్యవసాయ పంటల బీమా పథకంలో పసుపు ప్రస్తావన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.గతంలో ప్రకృతి బీభత్సం వల్ల పంటలకు నష్టం జరిగినప్పుడు జిల్లా యూనిట్‌గా తీసుకుని బీమా క్లయిమ్ చెల్లించేవారు. కానీ కొత్త రాష్ట్రంలో మార్పులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. వరికి గ్రామం యూనిట్‌గా తీసుకున్న సర్కార్.. పొద్దుతిరుగుడు, పెసర, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, కంది, తదితర తొమ్మిది పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ఆదేశించింది. ఈ తొమ్మిది పంటల్లో పసుపు లేదు. దీంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందుతుందన్న ధీమా లేకుండా పోయింది. గతంలో పంట రుణాలు మంజూరు చేసే సమయంలో బ్యాంకర్లు బీమా ప్రీమియం మినహాయించుకుని రుణం ఇచ్చేవారు. ఎకరానికి రూ. 6 వేల బీమా ప్రీమియం వసూలు చేసేవారు. కానీ పంట నష్టపోయినా ఏనాడూ బీమా క్లయిమ్ అందలేదు. అప్పట్లో జిల్లాను యూనిట్‌గా తీసుకుని బీమా చేయడం వల్లే పరిహారం అందలేదు. జిల్లాలో 50 శాతం కంటే ఎక్కువగా పంట దెబ్బతింటేనే అప్పట్లో బీమా క్లయిమ్ చెల్లించేవారు. దీంతో ఎప్పుడూ రైతులకు పంట ప్రమాద బీమా డబ్బులు అందలేదు. ప్రస్తుతం పంట బీమాలో మార్పులు చేయడం వల్ల కొంత మేలు జరగవచ్చని రైతులు పేర్కొంటున్నారు. కానీ పసుపు రైతులకు ఆ సౌకర్యం కల్పించ లేదు. నిజమాబాద్ జిల్లాలో ఆర్మూర్ సబ్ డివిజన్లో అత్యధికంగా పసుపు పంటను సాగు చేస్తారు. సుమారు 20 వేల హెక్టార్లకుపైగా ఈ పంట సాగవుతుంది. ఎకరం విస్తీర్ణంలో పంట సాగుకు లక్ష రూపాయలనుంచి లక్షా 20 వేల రూపాయల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇంత పెట్టుబడి పెట్టి సాగు చేసే పంటకు బీమా రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
రైతుల పక్షాన న్యాయపోరాటం:వైఎస్ జగన్
కడప: పసుపు రైతులకు అండగా ఉంటామని, వారి పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వెళ్లిన జగన్‌ను అక్కడి పసుపు రైతులు కలిశారు. తమ బాధలు ఆయనకు చెప్పుకున్నారు. ఎకరాకు లక్ష రూపాయల చొప్పున పంట నష్టపోయినట్లు వారు తెలిపారు. కలుపుకు ముందు మందు పిచికారీ చేయడం వల్ల పసుపు పంట దెబ్బతిన్నట్లు తెలిపారు. సంబంధిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వారు జగన్‌ను కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ కాలేదు సరికదా, రెన్యువల్ కూడా కాలేదన్నారు. అన్నదాతలకు కొత్త రుణాలు ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్ల రైతులు పంట బీమా కోల్పోయినట్లు జగన్ తెలిపారు. ఇదిలా ఉండగా, మైదుకూరులో వైఎస్ఆర్ సీపీ నేత దస్తగిరి కూతుర్నీ, అల్లుడినీ వైఎస్ జగన్ ఆశీర్వదించారు. ** -
ఈ పంటకు పరిహారం ఇవ్వరట!
ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్: ఏడెనిమిది నెలల పాటు పంటను కంటికి రెప్పలా కాపాడారు. చేతికి వచ్చిన పంటను రిక్కి, ఉడికించి కల్లాల వద్ద ఆరబెట్టుకున్నారు. మార్కెట్‌కు తరలించే లోపే అకాల వర్షం కాటేసింది. పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగు మారిన పంటను అమ్ముదామంటే రేటు కూడా రాదు. పంటను పొలం నుంచి తవ్వితీసినందున నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం రాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పసుపు పంటను పండించిన రైతులు దిక్కుతోచని స్థి తిలోకి పడిపోయారు. కళ్ల ముందే పాడైపోయిన పసుపును చూసి కన్నీంటి పర్యంతమవుతున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్లోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, సిరికొండ, భీమ్‌గల్, నందిపేట్ మండలాల్లో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కలాల వద్ద ఆరబెట్టిన పసుపునకు న ష్టం వాటిల్లింది. రైతులు వేల రూపాయలు ఖర్చుచేసి పంటను పండించారు. ఆరబెట్టిన పసుపు వర్షానికి త డిసి నష్టం వాటిల్లితే ఎందుకు పరిహారం చెల్లంచరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపునకు పరిహారం అంచనా వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో న్యాయం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో అకాలవర్షాలతో కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు పంట కు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించారు. ప్రభుత్వ ని బంధనలు సడలించి నష్టపరిహారం అందేలా అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తడిసిపోయిన ఎకరం పసుపు పంటకు రూ. రెండు వేల చొప్పున రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ను ఆదర్శంగా తీసుకుని తడిసిన పసుపు నకు నష్టం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.