ఆర్మూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తామన్నారు. రాష్ట్రం విడిపోయాక ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఒక్క సింగరేణిలోనే 50 వేల ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పేర్కొన్నారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి పాలకులు తెలంగాణ ప్రాంత రైతుల గురించి ఏనాడూ ఆలోచించలేదు.
అర్ధశతాబ్దం దాటినా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవడమే ఇందుకు నిదర్శ నం. సీమాంధ్రలో మాత్రం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేశారు.
తెలంగాణ ప్రాంత రైతాంగం కొట్లాడితే గాని పాలకులు స్పందించడం లేదు. ఆర్మూర్ ప్రాంత రైతులు దశాబ్దం పాటు పోరాడితే గుత్ప ఎత్తిపోతల పథకం నిర్మించారు.
సమైకాంధ్రలో తెలంగాణ ప్రాంతంలోనే పసుపు పంట ఎక్కువగా పండిస్తారు. అందుకే పసుపు రైతుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
సీమాంధ్రలో పండించే ప్రమాదకరమైన పొగాకు పంట కోసం మాత్రం ప్రభుత్వం 1975లో గుంటూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేసింది.
తెలంగాణలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులున్నారు. వారి గోడును సీమాంధ్ర పాలకులు ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ కార్మికులు ఇతర రాష్ట్రాల యాజమాన్యాలతో కొట్లాడి తమ హక్కులను సాధించుకుంటున్నారు.
లక్కంపల్లి సెజ్ భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలి.
ఆర్మూర్ ప్రాంత రైతులకు ఎర్రజొన్నల బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రైతులకు రావాల్సిన రూ.10 కోట్ల 83 లక్షలు ఇప్పిం చేందుకోసం కార్యాచరణ రూపొందిస్తాం.
తెలంగాణే లక్ష్యం
Published Wed, Feb 5 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement