నగరంలోని తుకారంగేటు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలో సోమవారం ఉదయం చిన్న గొడవ జరగడంతో ఆగ్రహించిన మల్లేష్ అనే వ్యక్తి చంద్రకళ అనే మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రయత్నించి మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం చాలావరకూ కాలిపోయింది. వెంటనే ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రకళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటిన వ్యక్తి అరెస్ట్
Published Mon, Jul 4 2016 10:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement