నిలదీతలు... నీళ్లు నమలడాలు! | ITDA Meeting in sitampet | Sakshi
Sakshi News home page

నిలదీతలు... నీళ్లు నమలడాలు!

Published Fri, Jun 24 2016 9:30 AM | Last Updated on Tue, May 29 2018 2:33 PM

ITDA Meeting in sitampet

  • ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో అధికారులను నిలదీసిన ఎమ్మెల్యేలు
  • ఉపకార వేతనాల దుర్వినియోగంపై ప్రశ్నించిన కళావతి
  • ఇంజినీర్లే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని ఆరోపణ
  • ఐసీడీఎస్ పనితీరుపై ఆగ్రహం
  •  
     
     సీతంపేట: సీతంపేట పీఎంఆర్‌సీలో గురువారం జరిగిన సీతంపేట ఐటీడీఏ 71వ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సా గింది. కార్యక్రమం ఆద్యంతం ఎమ్మెల్యేలు అధికారులను పలు సమస్యలపై నిలదీస్తూనే ఉన్నారు. పలు ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చినా మరికొన్నింటిని దాట వేసే ప్రయత్నం చేశారు.


    గిరిజన పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో లేని విద్యార్థులను ఉన్నట్టు చూపి బీసీ సంక్షేమ నిధులను కాజేసిన ఏటీడబ్ల్యూవో, వార్డెన్లపై చర్యలెందుకు తీసుకోలేదని స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ లక్ష్మీనృసింహం బదులిస్తూ రూ.కోటి 44 లక్షలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఏసీబీ, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల విచారణ పూర్తయిందని తెలిపా రు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు.

    ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ అయిన వెంటనే అరెస్టు చేస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ ద్వారా జరిగిన 42 రహదారి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని నివేదిక ఇచ్చానని వాటి విచారణ ఏం చేశారని ఎమ్మెల్యే వెంకటరమణ ప్రశ్నించగా 11 రహదారులపై రూ.71 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు తనకు అధికారులు నివేదిక ఇచ్చారని కలెక్టర్ తెలిపారు.

    అడ్డంగి, అబలాసింగి రహదారి అవినీతిపై ఆర్‌ఆర్ యాక్టు పెట్టి రికవరీ చేయిస్తామని, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను సస్పెండ్ చేయిస్తానని ఆయన చెప్పారు. విచారణ ఆదరాబాదరాగా కాకుండా పద్ధతి ప్రకారం చేయాలని మం త్రి అచ్చెన్నాయుడు సూచించారు.
    రహదారుల వెరిఫికేషన్ కమిటీలో తమకు ఎందుకు అవకాశం కల్పించలేదని పాల కొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదర్ ప్రశ్నించగా  సమాధానం రాలేదు.
     
     పీఆర్ జేఈ సరెండర్
     సీతంపేటలో ఒక పీఆర్ జేఈ బి.నాగేశ్వరరావు కాంట్రాక్టర్ అవతారెమెత్తి పనులు చేయిస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే కళావతి, జెడ్పీటీసీ దా మోదర్‌లు పట్టుబట్టారు. దీంతో ఆయన్ను సరెండర్ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఐటీడీఏలో సమావేశం గదిని ఇంతవరకు ఎందుకు నిర్మించలేకపోయారని ఈఈ శ్రీనివాస్‌ను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మరో నాలుగు నెలల్లో పూర్తి చేస్తానని ఈఈ తెలిపారు. భామిని వెలుగు కార్యాలయంలో రూ.18 లక్షలు అక్రమాలు జరిగాయని, దీనిపై ఆడిట్ ఎందుకు చేయించలేదని ఎమ్మెల్యే కళావతి సంబంధిత అధికారులను నిలదీశారు.
     
    మందుల మాటేంటి..?
    వైద్యం కోసం సీతంపేట పీహెచ్‌సీకి వెళితే మందులు బయట కొనుగోలు చేయమంటున్నారని ఎంపీపీ ఎస్.లక్ష్మి తెలిపారు. నాయకులకే ఈ పరిస్థితి ఎదురైందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే కళావతి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వైద్యాధికారి, ఏఎన్‌ఎంకు చార్జ్‌మెమో ఇవ్వాలని డీఎంఅండ్‌హెచ్‌వో శ్యామలకు ఆదేశించారు.

    సెలైన్ బాటిళ్లు, ఇతర మందులు కొనుగోలు చేయడానికి ఐటీడీఏ నుంచి నిధులు సమకూర్చానని ఐటీడీఏ పీవో జె.వెంకటరావు సమాధాన మిచ్చారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఎల్‌టీపై ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్యే కళావతి ఫిర్యాదు చేశారు. దోనుబాయిలో వైద్యుడ్ని నియమించాలని కోరగా వైద్యున్ని నియమించినట్టు పీఓ తెలి పారు. దోమతెరలు ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించగా నాలుగు లక్షలు దోమతెరలు అన్ని జిల్లాలకు మంజూరయ్యాయని త్వరలో ఏజెన్సీలో పంపిణీ చేస్తామని డీఎంహెచ్‌వో శ్యామల తెలిపారు.  
     
     
    జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలి
    ఏజెన్సీలో 1897 మంది పదో తరగతి ఉత్తీర్ణత చెందితే వారిలో 600ల మందికి ఇంటర్మీడియట్ సీట్లు ఇస్తే మిగ తా 1200ల మంది పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే కళావతి ప్రశ్నించారు. 90 సీట్లు పెంచినట్టు గురుకులం నుంచి ఆదేశాలు వచ్చాయని పీవో వెంకటరావు తెలిపారు.
    పాలకొండలో ఆశ్రమ పాఠశాలకు స్థల పరిశీలన చేయాలని ఆర్డీవో గున్నయ్యకు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులున్నచోట ఉ పాధ్యాయులు లేరని చాలా పాఠశాలల్లో సమస్య ఉందని కళావతి తెలిపారు.  సీతంపేట యూపీ పాఠశాలలో పిల్లలు 47 మంది ఉంటే ఉపాధ్యాయులు 13 మంది ఉన్నారని, ఇంతమంది ఎందుకని ప్రశ్నించారు. ఈ స్కూల్‌లో ఉన్న టీచర్లను వేరే పాఠశాలలకు పదిమందిని పంపించాలని కలెక్టర్  డీఈవో దేవానందంకు తెలిపారు. జూలై ఒకటి నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్స్ పనిచేయించాలని పీవోకు కలెక్టర్ సూచించారు.

    ఆశ్రమ పాఠశాలల్లో కుక్, కమాటీ పోస్టులను నియమించాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. దీనిపై కమిషనర్‌కు ప్రతిపాదించామని త్వరలో భర్తీ చేస్తామని పీవో తెలిపారు. కులాంతర వివాహాలు, గిరిపుత్రిక కల్యాణ పథకానికి నిధులు వెచ్చించాలని స్థానిక ఎమ్మెల్యే కళావతి తెలిపారు.
     
    గాఢ నిద్రలో ఐసీడీఎస్
    ఐసీడీఎస్ శాఖ గాఢనిద్రలో ఉందని కలెక్టర్ లక్ష్మీనృసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు ఎంతమంది ఉన్నారనేదానిపై కూడా పూర్తి సర్వే చేయలేకపోవడమేమిటని ఐసీడీఎస్ పీడీ తనూజా రాణి ని ప్రశ్నిం చారు. పలుచోట్ల పిల్లలు లేకుండా కేంద్రాలు నిర్వహిస్తున్నారని విప్ రవికుమార్ ఆరోపించారు. ట్రైబల్ ఏరి యాకి పీడీ ఎప్పుడు వచ్చారని ఎమ్మెల్యే కళావతి ఆగ్రహించారు. న్యూట్రీషియన్ కౌన్సిలర్ పోస్టుల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించగా వాటిని రద్దుచేస్తున్నట్టు పీవో ప్రకటించారు. గిరిగోరు ముద్దల పథకంలో పాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.  
     
    ఏనుగుల సమస్య పరిష్కరించండి
    ఏనుగుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేలు కళావతి, వెంకటరమణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు తోట ముఖలింగంలు కోరారు. పంట నష్టపరిహారం కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ఇళ్లు కూల్చేసిన, పట్టా లు లేకపోయినా పరిహారం ఇవ్వడం లేదని తెలిపారు. పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చూస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అటవీ హక్కుల పత్రాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు.

    ఏనుగులు నష్టపరిస్తే పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించి వ్యవసాయశాఖ, హార్టీకల్చర్,రెవెన్యూ శాఖలు వెళ్లి పరిహారం అంచనా వేయాలని తెలిపారు. అలాగే దేవనాపురం, పెదరామ వంటి చోట్ల విద్యుత్ తీగల సమస్య ఉందని స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. కడగండి ప్రాంతంలో నాలుగురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదని తెలిపారు.

    అధికారులు ఫోన్‌లకు స్పం దించాలని ఎమ్మెల్యే వెంకటరమణ కోరగా అదే పెద్ద సమస్యని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రా మ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, పీఆర్ ఎస్‌ఈ మోహన్‌మురళి, డుమా పీడీ కూర్మనాథ్, డీడీ ఎంపీవీనాయిక్, డిప్యూటీ డీఈవో వి.మల్లయ్య, సీఎం వో శ్రీనివాసరావు, ఏపీడీ సావిత్రి, అడిషనల్ డీఎంహెచ్‌వో మెండ ప్రవీణ్, డీసీహెచ్‌ఎస్ వీరాస్వామి, రేంజర్లు జగదీష్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement