కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే కళావతి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు
పాలకొండ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హదా కోసం ఉద్యమం చేసిన కేసులో స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు 21 మంది వైఎస్‌ఆర్ సీపీ నాయకలు బుధవారం స్థానిక కోర్టుకు హాజరయ్యారు. గత ఏడాది మార్చి 28న వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో డిపో ఎదుట ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే కళావతి, వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పాలవలస విక్రాంత్, వెలమల మన్మదరావు, కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, కనపాక సూర్యప్రకాష్, కోరాడ సూర్యనారాయణబాబు, దుంపల చిన్ని పాలవలస దవళేశ్వరరావు, బలగ మన్మధరావు, కారెపు చిట్టిబాబు, కండాపు ప్రసాదరావు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బుధవారం వీరంతా న్యాయమూర్తి వివేకానంద్ శ్రీనివాస్ ముందు హజరై సంతకాలు చేశారు. ఈ కేసును ఈ నెల 22కు వాయిదా వేశారు.