గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్న ఎమ్మెల్యే కళావతి
ఉగాది పర్వదినాన ‘సాక్షి’తో ముచ్చటించిన కళావతి
పార్వతీపురం మన్యం: విశ్వసరాయి కళావతి.. సామాన్య గిరిజన మహిళ... తమ ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం ఇవ్వడంతో 2014, 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేగా తనదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేయ డంలో సఫలమయ్యారు. ముచ్చటగా మూడోసారి విజయాన్ని అందుకునేందుకు ప్రచారం ఆరంభించారు. ఉగాది సందర్భంగా ‘సాక్షి’తో మంగళవారం కాసేపు ముచ్చటించారు. ఆమె మాటల్లోనే..
జగనన్న స్ఫూర్తితో..
2014–19 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో టీడీపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించింది. నా నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంది. కానీ నేను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డినే స్ఫూర్తిగా తీసుకున్నాను. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒకే మాట మీద నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం. నిత్యం ప్రజలతోనే ఉండాలన్నది జగన్ మాకు చూపిన బాట. ప్రజా జీవితంలో ఉన్నంతకాలం ఆయన చూపిన బాటలోనే సాగుతాం. ఆ స్ఫూర్తే గత రెండు ఎన్నికల్లో విజయా న్ని చేకూర్చింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం.
గిరిజనాభివృద్దికి పెద్దపీట...
ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలను జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా అందజేస్తోంది. జిల్లాలో 54 వేల ఎకరాలకు సంబంధించిన పట్టాలను గిరిజనులకు ఇచ్చారు. వారందరికీ వైఎస్సార్ రైతు భరోరోసా పథకం కింద ఏటా పెట్టుబడి సాయం అందుతోంది. ఏజెన్సీలోని గ్రామ సచివాలయాలన్నింటిలోను ఉద్యోగాలను గిరిజన అభ్యర్థులకే ఇవ్వడం జగన్‌మోహన్‌రెడ్డి అందించిన గొప్ప వరం. 50 ఏళ్లు నిండిన ప్రతీ గిరిజనుడికి వైఎస్సార్ పింఛన్‌కానుక అందిస్తున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం
జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం. సాంకేతిక కారణాల వల్ల ప్రజల్లో ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోయినా, మరే ఇతర సమస్యలు ఉన్నా వలంటీర్లు వ్యవస్థ ద్వారా గుర్తించాం. క్షేత్ర స్థాయిలో వాటిని వెంటనే పరిష్కరించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడింది. ప్రతీ సచివాలయం పరిధిలో రూ. 20 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం అవసరాల దృష్ట్యా రూ.40 లక్షలు చొప్పున కేటాయించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్డి కృషిచేశారు.
ప్రగతి పథం..
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి, అక్రమాలకు తావులేకుండా వందలాది కోట్ల రూపాయాలతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారు. టీడీపీ వదిలేసిన తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులకు రూ.193 కోట్లతో జీవంపోశారు. రూ.38 కోట్ల ఉపాధిహామీ నిధులతో గ్రామీ ణ రోడ్లు బాగుచేశారు. రూ.34.64 కోట్ల వ్యయంతో 93 గ్రామ సచివాలయాలు, రూ.21.25 కోట్ల ఖర్చుతో ఆర్‌బీకేలు నిర్మించారు. నాడు–నేడు నిధు లు రూ.19.57 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలను అభివృద్ధి చేశాం. వివిధ సంక్షేమ, అభివృద్ది పనులను చేపట్టి ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు తీసుకువచ్చాం. అందుకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడుగుతున్నాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment