tribal woman
-
‘దారి’లేక.. ఆస్పత్రికి చేరలేక
ఆసిఫాబాద్ రూరల్/నెన్నెల, వేములవాడ రూరల్: ‘దారీ’తెన్నూ లేని పల్లెలు.. వాగులు దాటి వైద్యం అందుకోలేక గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. శుక్రవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల రోడ్డు సరిగా లేక, అంబులెన్స్‌ల రాకకు వాగులు అడ్డొచి్చన క్రమంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ దినోత్సవం నాడే ఓ ఆదివాసీ మహిళకు పుట్టెడు గర్భశోకం మిగిలింది. కడుపులో ఇద్దరు బిడ్డలను మోస్తూ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్తూ.. వాగు ఒడ్డునే బిడ్డను ప్రసవించింది. పుట్టిన గంటకే బిడ్డ కన్నుమూసింది. కడుపులోని మరో బిడ్డతో ఆ మహిళ చికిత్స పొందుతోంది. ఈ దారుణం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకోగా, మరో రెండు ఘటనల్లో ఓ యువకుడు, వృద్ధురాలు సైతం సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు ప్రాణాలు మోస్తూ.. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం కొండు, ఆత్రం ధర్మూబాయి దంపతులు రైతులు. వీరికి రెండేళ్ల పాప ఉండగా.. ప్రస్తుతం ధర్మూబాయి ఏడు నెలల గర్భిణి. శుక్రవారం మధ్యాహ్నం నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. గ్రామానికి వెళ్లే దారిలో వాగు అడ్డుగా ఉండడంతో 108 వాహనం వాగు ఒడ్డు వరకే వచి్చంది. స్థానికులు గర్భిణిని గ్రామం నుంచి కిలోమీటరున్నర దూరం నడిపించి వాగు దాటించారు. ఆ సమయంలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో భయాందోళనకు గురైన ధర్మూబాయికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.ఈ క్రమంలోనే వాగు ఒడ్డున ఆడశిశువుకు జన్మనిచి్చంది. కడుపులో మరో శిశువు ఉన్నట్లు గుర్తించిన 108 సిబ్బంది తల్లీబిడ్డను ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే పుట్టిన శిశువు మృతిచెందింది. కడుపులోని మరో శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని అదే వాహనంలో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శస్త్రచికిత్స చేసి ఆ బిడ్డను కాపాడారు. పుట్టిన శిశువు బరువు 800 గ్రాములే ఉండటంతో ఎన్‌ఎన్‌సీలో ఉంచి, చికిత్స అందిస్తున్నట్లు ఎంసీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ భీష్మ తెలిపారు. కాగా గతేడాది వర్షాకాలంలో ఈ వాగు దాటుతున్న సమయంలో వరదలో కొట్టుకుపోయి ఓ యువతి మృత్యువాత పడింది. అంబులెన్స్ వచ్చే దారిలేక.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోణంపేటకు చెందిన జింజిరి జశ్వంత్ (17) పొలం పనులు ముగించుకుని ఇంటికొస్తూ ఒక్కసారిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. 108 అంబులెన్స్ వచి్చనా.. బురద కారణంగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే నిలిచిపోయింది. వాహనం నిలిపిన చోటికి యువకుడిని తీసుకురావాలని అంబులెన్స్ సిబ్బంది సూచించారు. గ్రామస్తుల సహకారంతో జశ్వంత్‌ను ఎడ్లబండిలో తీసుకెళ్లారు. అంబులెన్స్‌లోకి ఎక్కించిన యువకుడిని సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతిచెందాడని చెప్పారు. రోడ్డు సరిగా ఉండుంటే జశ్వంత్ ప్రాణాలు దక్కేవని బంధువులు విలపించారు. సకాలంలో వైద్యం అందక..వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటకు చెందిన ఐత లచ్చవ్వ (65) ఆస్తమాతో బాధపడుతోంది. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె భర్త నారాయణ 108కు సమాచారమిచ్చాడు. నక్కవాగుపై వంతెన పూర్తికాకపోవడంతో వాగుకు అవతలి వైపే అంబులెన్స్ ఆగిపోయింది. లచ్చవ్వను గ్రామస్తులు ఇంటి నుంచి వాగుకు ఇటువైపు గడ్డ వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి స్ట్రెచర్‌పై దాదాపు 400 మీటర్ల దూరాన ఉన్న అంబులెన్స్ వరకు మోసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించి లచ్చవ్వ మృతి చెందింది. -
ప్రజాసంక్షేమమే అభిమతం
పార్వతీపురం మన్యం: విశ్వసరాయి కళావతి.. సామాన్య గిరిజన మహిళ... తమ ప్రాంతాన్ని అభివృద్ధిపరచాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అవకాశం ఇవ్వడంతో 2014, 2019 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఎమ్మెల్యేగా తనదైన శైలిలో నియోజకవర్గ అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేయ డంలో సఫలమయ్యారు. ముచ్చటగా మూడోసారి విజయాన్ని అందుకునేందుకు ప్రచారం ఆరంభించారు. ఉగాది సందర్భంగా ‘సాక్షి’తో మంగళవారం కాసేపు ముచ్చటించారు. ఆమె మాటల్లోనే.. జగనన్న స్ఫూర్తితో.. 2014–19 వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండడంతో టీడీపీ ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేధించింది. నా నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంది. కానీ నేను వై.ఎస్.జగన్మోహన్రెడ్డినే స్ఫూర్తిగా తీసుకున్నాను. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం ఒకే మాట మీద నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నాం. నిత్యం ప్రజలతోనే ఉండాలన్నది జగన్ మాకు చూపిన బాట. ప్రజా జీవితంలో ఉన్నంతకాలం ఆయన చూపిన బాటలోనే సాగుతాం. ఆ స్ఫూర్తే గత రెండు ఎన్నికల్లో విజయా న్ని చేకూర్చింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. గిరిజనాభివృద్దికి పెద్దపీట... ప్రతీ గిరిజనుడికి కొండపోడు పట్టాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా అందజేస్తోంది. జిల్లాలో 54 వేల ఎకరాలకు సంబంధించిన పట్టాలను గిరిజనులకు ఇచ్చారు. వారందరికీ వైఎస్సార్ రైతు భరోరోసా పథకం కింద ఏటా పెట్టుబడి సాయం అందుతోంది. ఏజెన్సీలోని గ్రామ సచివాలయాలన్నింటిలోను ఉద్యోగాలను గిరిజన అభ్యర్థులకే ఇవ్వడం జగన్మోహన్రెడ్డి అందించిన గొప్ప వరం. 50 ఏళ్లు నిండిన ప్రతీ గిరిజనుడికి వైఎస్సార్ పింఛన్‌కానుక అందిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమం. సాంకేతిక కారణాల వల్ల ప్రజల్లో ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోయినా, మరే ఇతర సమస్యలు ఉన్నా వలంటీర్లు వ్యవస్థ ద్వారా గుర్తించాం. క్షేత్ర స్థాయిలో వాటిని వెంటనే పరిష్కరించేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడింది. ప్రతీ సచివాలయం పరిధిలో రూ. 20 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం అవసరాల దృష్ట్యా రూ.40 లక్షలు చొప్పున కేటాయించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి జగన్మోహన్రెడ్డి కృషిచేశారు. ప్రగతి పథం.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అవినీతి, అక్రమాలకు తావులేకుండా వందలాది కోట్ల రూపాయాలతో గిరిజన ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టారు. టీడీపీ వదిలేసిన తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులకు రూ.193 కోట్లతో జీవంపోశారు. రూ.38 కోట్ల ఉపాధిహామీ నిధులతో గ్రామీ ణ రోడ్లు బాగుచేశారు. రూ.34.64 కోట్ల వ్యయంతో 93 గ్రామ సచివాలయాలు, రూ.21.25 కోట్ల ఖర్చుతో ఆర్బీకేలు నిర్మించారు. నాడు–నేడు నిధు లు రూ.19.57 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ భవనాలను అభివృద్ధి చేశాం. వివిధ సంక్షేమ, అభివృద్ది పనులను చేపట్టి ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు తీసుకువచ్చాం. అందుకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడుగుతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెబుతున్నాం. -
గిరిజన గూడెంలో తొలి మహిళా జడ్జి,ఎవరీ శ్రీపతి?
తమిళనాడు తిరుపట్టూరు జిల్లాఎలగిరి హిల్స్‌కు చెందిన 23 ఏళ్ల గిరిజనురాలు వి.శ్రీపతి సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు.నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. శ్రీపతి పరిచయం... ఆరు నెలల క్రితం... తమిళనాడు తిరుపట్టూరు జిల్లాలోని యలగిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది. నాలుగున్నర గంటల ప్రయాణం. లోపల ఉన్నది పచ్చి బాలింత. అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. కాని మరుసటి రోజు చెన్నైలో ‘తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్’(టి.ఎన్.పి.ఎస్.సి) ఎగ్జామ్ ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె ‘సివిల్ జడ్జ్’ అర్హత సాధిస్తుంది. అందుకే ప్రయాణం చేస్తోంది. ఆమె పేరు వి. శ్రీపతి. వయసు 23. ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్, తండ్రి కలియప్పన్. కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న ‘మలయలి’ తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం. లా చేయడం ఇంకా విశేషం. సివిల్ జడ్జి కావడం అంటే చరిత్రే. చురుకైన అమ్మాయి తిరువణ్ణామలైలోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళి రైతుకు తొలి కుమార్తెగా జన్మించిన శ్రీపతి పసి΄ాపగానే చురుగ్గా ఉండేది. తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో చదువు సరిగ్గా లేదు. వీళ్ల గూడెం నుంచి బస్సెక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పన్ అక్కడినుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్ (తిరుపట్టూరు జిల్లా)కు మకాం మార్చాడు. ఇక్కడా కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్లుండే అత్తనాపూర్‌లో ఇంటర్ వరకూ చదివించే మిషనరీ స్కూల్ ఉంది. అక్కడే శ్రీపతి ఇంటర్ వరకూ చదువుకుంది. ‘ఇప్పుడు చదివి ఏం చేయాలంటా’ అని తోటి తెగ వారు తండ్రిని, తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్లు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు. ఇంటర్ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకుంది శ్రీపతి. గిరిజనుల హక్కుల కోసం ‘మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మావాళ్లకు తెలియదు. వారిని చైతన్యవంతం చేయాలి. వారి హక్కులు వారు ΄÷ందేలా చేయాలి. అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను’ అంది శ్రీపతి. ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లాకోర్సులో చేరింది. చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేసే వెంకటేశన్‌తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జడ్జి పోస్ట్ కోసం టి.ఎన్.పి.ఎస్.సి పరీక్ష రాసే సమయానికి నిండు చూలాలు. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి సివిల్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ తమిళనాడు సి.ఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియచేశారు. ‘తమిళ మీడియంలో చదువుకున్నవారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్‌ను ప్రవేశ పెట్టడం వల్లే శ్రీపతి సివిల్‌జడ్జి కాగలిగిందని... ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం దక్కాలని’ స్టాలిన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. -
గిరిజన మహిళా రైతుకు ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్’
సాక్షి, పాడేరు: బెంగళూరులో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ కాఫీ సదస్సు–2023లో నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తిలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళా రైతు కిల్లో అశ్విని అవార్డు పొందారు. అరాబిక్ పార్చ్మెంట్ కాఫీ గింజల విభాగంలోని అన్ని ఫార్మెట్లలో నాణ్యమైన కాఫీ గింజలుగా అశ్విని పండించిన కాఫీ గింజలను జ్యూరీలోని అధికారుల బృందం గుర్తించింది. దేశంలోని 10 రాష్ట్రాల పరి«ధిలో సాగైన కాఫీ గింజలను ప్రదర్శించారు. మన రాష్ట్రానికి సంబంధించి 124 మంది గిరిజన రైతులు పార్చ్మెంట్ కాఫీ గింజల శాంపిళ్లను ప్రదర్శించారు. వీటిలో పెదబయలు మండలం కప్పాడ గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు అశ్విని పండించిన కాఫీ గింజలు నాణ్యతలో భారత్‌లోనే నంబర్ వన్‌గా నిలిచాయని కాఫీ ప్రాజెక్ట్ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ‘ఫ్లేవర్ ఆఫ్ ఇండియా ది ఫైన్ కప్ అవార్డు–2023’ అశ్వినిని వరించింది. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర కాఫీ బోర్డు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె భర్త గాసన్న ఈ అవార్డును అందుకున్నారు. కాఫీ గింజల ఉత్తమ నాణ్యత అవార్డు రావడంపై కలెక్టర్ సుమిత్‌కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్, కేంద్ర కాఫీ బోర్డు డీడీ రమేష్, ఐటీడీఏ కాఫీ ఏడీ అశోక్ హర్షం వ్యక్తం చేశారు. -
గిరిజన మహిళపై థర్డ్‌డిగ్రీ..
నాగోలు: ఒంటరిగా ఉన్న ఓ గిరిజన మహిళను అనుమానించారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అర్ధరాత్రివేళ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి లాఠీలు, బూటు కాళ్లతో తంతూ చిత్రహింసలకు గురి చేశారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరగ్గా, ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లితండాకు చెందిన వడిడ్త్యా లక్ష్మి, భర్త శ్రీను చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో మీర్‌పేటలోని నందిహిల్స్‌కు వచ్చింది. స్థానికంగా ఇళ్లలో పనికి కుదిరి ఇక్కడే నివాసముంటోంది. ఇటీవల లక్ష్మి పెద్ద కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది. ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈనెల 30న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసమని దేవరకొండలోని బంధువుల ఇంటికి ఈ నెల 15వ తేదీన వెళ్లింది. వారి వద్ద రూ.3లక్షల నగదు అప్పుగా తీసుకుంది. అక్కడి నుంచి ఎల్బీనగర్కు బస్సులో వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది. మీర్‌పేటకు వెళ్లేందుకు ఆటోలు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఎల్బీనగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన లక్ష్మి నిలబడింది. అదే సమయంలో పెట్రోలింగ్ వాహనం ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఎక్కడకు వెళుతున్నావు...చేతిలో డబ్బు ఎక్కడిదని పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. ఊరి నుంచి వస్తున్నానని, ఆటో కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదు. కూతురు పెళ్లికార్డు చూపించినా పట్టించుకోలేదు. అర్ధరాత్రి వేళ లక్ష్మిని ఎల్బీనగర్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లక్ష్మికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులకే ఎదురు మాట్లాడతావా అంటూ లక్ష్మిపై హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత, మరో ఇద్దరు సిబ్బంది లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఆటోలో పోలీసులు లక్ష్మిని ఇంటికి పంపించారు. లక్ష్మి నడవలేని పరిస్థితిని గమనించిన ఆమె కుటుంబసభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి వైద్యం చేయించారు. పూజ ఫిర్యాదు.. పోలీసులపై అట్రాసిటీ కేసు లక్ష్మి కూతురు వడ్త్యా పూజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన పోలీసులపై ఎల్బీనగర్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. పూజ ఫిర్యాదు ప్రకారం...ఈనెల 15వ తేదీన తల్లి లక్ష్మి తన పెళ్లికి కోసం రూ. 3లక్షల అప్పుగా తేవడానికి మేనమామ చంద్రుని వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. సాయంత్రం వరకు నేనే నా తమ్ముడు అమ్మకోసం ఎదురుచూశాం. కానీ ఆమె రాలేదు. 16వ తేదీన ఎల్బీనగర్ స్టేషన్ అమ్మ ఉన్నట్టు సమాచారం తెలిసి కొంతమందితో కలిసి వెళ్లాను. అమ్మ గురించి పోలీసులను అడిగితే తనను కులం పేరుతో దూషించారని, తల్లిపై పోలీసులు తొడలు, మోకాలు ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయాలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లి వద్ద ఉన్న రూ. 3లక్షల నగదు, బంగారు చెవి రింగులు కూడా కనిపించడం లేదని ఆ ఫిర్యాదులో వివరించింది. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు 354, 324, 379,సెక్షన్3(1) (ఆర్)(ఎస్), 3(2)(వీఏ), అట్రాసిటీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. లక్ష్మికి సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా.. గాయపడిన లక్ష్మి వైద్య ఖర్చులు మొత్తం తానే భరిస్తానని ఎల్బీనగర్ ఏసీపీ జానకిరెడ్డి తెలిపారు. లక్ష్మిని వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామన్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నారు ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, రాత్రంతా అక్కడే ఉంచి చితకబాదారు. తన చేతిలోని నగదు, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ పోలీసులు బలవంతంగా తీసుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదం జరిగింది. నాపై దాడి చేసిన ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – బాధితురాలు లక్ష్మి అర్ధరాత్రి ముఠాగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి ఎల్బీనగర్ చౌరస్తాలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు పెట్రోలింగ్ సమయంలో పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసి ఈనెల 16న రిమాండ్‌కు తరలించారు. అయితే మర్నాడు ఉదయం లక్ష్మి మినహా మిగిలిన నిందితులు జరిమానా చెల్లించారని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. – ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి ఇద్దరి సస్పెన్షన్.. జరిగిన సంఘటనపై ప్రాథమిక విచారణ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతలను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని, ఇతరుల పాత్ర రుజువైతే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: మాజీ మంత్రి రవీంద్రనాయక్ గిరిజన సంఘాల నేతలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు గురువారం బాధితురాలు లక్ష్మితో కలిసి ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ జరిగిన ఘటనపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, ప్రధానకార్యదర్శి బాలు, ఆల్ ఇండియా బంజారాసేవా సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రాజు, గిరిజన విద్యార్థి నేత వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రమ్య
అనకాపల్లి: డోలీ మోతతో ఆస్పత్రిలో చేరిన గిరిజన మహిళ కథ సుఖాంతమైంది. పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. గొట్టివాడ శివారు అణుకు గిరిజన గ్రామానికి చెందిన తాంబెళ్ల రమ్య అనే గర్భిణికి నెలలు నిండి ఆదివారం పురిటినొప్పులు రావడంతో ఆందోళన చెందిన గిరిజనులు హుటాహుటిన డోలీలో మోసుకెళ్లి కోటవురట్ల ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున రమ్య ప్రసవించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. రమ్యకు రక్తం తక్కువగా ఉండడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. రమ్య, సూరిబాబు దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. -
పెళ్లీడుకొచ్చిన నా కూతురుతో ఎస్ఐ హేమంత్ అసభ్యంగా ప్రవర్తించాడు
కదిరి: ముదిగుబ్బ ఎస్ఐ హేమంత్‌కుమార్‌పై కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి చెందిన గిరిజన మహిళ బుక్యా రాధమ్మ మంగళవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొదట ఫిర్యాదు తీసుకోవడానికి రూరల్ సీఐ సూర్యనారాయణ నిరాకరించడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుమ్మరవాండ్లపల్లి సర్పంచ్ శాంతమ్మ, ఆమె కుమారుడు మణికంఠనాయక్, కుటుంబ సభ్యులు స్టేషన్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. చివరకు చేసేది లేక 100కు ఫోన్ చేసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలిపారు. తర్వాత అక్కడి నుంచి డీఎస్పీ కార్యాలయానికి చేరుకొని డీఎస్పీ శ్రీలతకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. బాధితురాలు రాధమ్మ ఫిర్యాదు మేరకు.. ఎస్ఐ హేమంత్, కానిస్టేబుళ్లు రామాంజి, హరినాథరెడ్డితో పాటు టీడీపీ నాయకుడు కలాం ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తమ ఇంటికి వచ్చారన్నారు. నీ భర్త గోవింద్‌నాయక్ మా దగ్గర ఉన్నాడు.. కావాలంటే ఫోన్లో మాట్లాడు అని ఫోన్ చేసి ఇచ్చారని తెలిపారు. ‘పోలీసులతో ప్రాణహాని ఉంది. పోలీసులు చెప్పినట్టు చేయండి అని తన భర్త చెప్పడంతో మేం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ హేమంత్ బీరువా తాళాలు ఎక్కడున్నాయని బెదిరించాడన్నారు. అక్కడే నిల్చున్న పెళ్లీడుకొచ్చిన తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. భయంతో ఆయనకు బీరువా తాళాలు ఇచ్చేశామని చెప్పారు. అమ్మాయి పెళ్లి కోసం తెచ్చిన 50 గ్రాముల బంగారంతో పాటు రూ. 5 లక్షల నగదు తీసుకున్నారన్నారు. ఈ విషయం ఎవరికై నా చెబితే గోవిందనాయక్‌ను చంపేస్తామని ఎస్ఐ బెదిరించాడని ఆరోపించారు. అంతలోనే తన తమ్ముడు మణికంఠనాయక్‌తో పాటు చుట్టుపక్కల వారు రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. తమ కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కులం పేరుతో దూషించడమే కాకుండా నగదు, నగలు ఎత్తుకెళ్లిన ఎస్ఐ హేమంత్‌తో పాటు కానిస్టేబుళ్లు రామాంజి, హరినాథ్, టీడీపీ నాయకుడు కలాంపై కఠిన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వాకపల్లి అత్యాచార కేసు కొట్టివేత
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/ విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం కేసులో గురువారం తీర్పు వెలువడింది. విచారణ అధికారుల వైఫల్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్.శ్రీధర్ ప్రకటించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విశాఖ జిల్లా న్యా య సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విచారణాధికారి శివానందరెడ్డి సరిగ్గా విచారణ చేయనందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సిఫార్సు చేశారు. వివరాలు.. 2007 ఆగస్టు 20వ తేదీన అప్పటి విశాఖ జిల్లాలోని వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలు తమపై ప్రత్యేక పోలీస్ దళం(గ్రేహౌండ్స్) సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం 21 మంది పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. బి.ఆనందరావును విచారణాధికారిగా నియమించగా కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత శివానందరెడ్డి విచారణాధికారిగా వ్యవహరించారు. మొ త్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ 38 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, 11 మంది మహిళల్లో ఇద్దరు అనారో గ్య సమస్యలతో మరణించారు. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయగా.. బాధితులు నిరాకరించారు. -
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్‌కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్‌లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్‌నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
గిరిజన మహిళపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని డోర్లి గ్రామానికి గిరిజన వివాహితపై నలుగురు సామూహిక లైంగిక దాడి చేశారు. పదిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన గిరిజన మహిళ(30)కు భర్త , పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం కుటుంబ సభ్యులు పనులకు వెళ్లగా, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మహిళ ఇంటికి వచ్చారు, ఒంటరిగా ఉండటం గమనించి ఆమెపై సామూహిక లైంగికదాడి చేశారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లిపోయారు. పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితురాలిని కుటుంబ సభ్యులు నిలదీశారు, ఆదివారం ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు, బబాధితురాలు పేర్కొన్న నలుగురిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు, గ్యాంగ్ రేప్ సమాచారం అందుకున ఆదిలాబాద్ రూరల్ సీఐ రఘుపతి గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. -
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్‌పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
అదృష్టం: పేదమహిళ సుడితిరిగి లక్షాధికారిగా!
భోపాల్: అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఏళ్లు కష్టపడ్డా కంటపడని అదృష్టం.. ఆమెకు అనుకోకుండా కలిసొచ్చింది. రాత్రికి రాత్రే ఆమె నసీబ్‌ను మార్చేసింది. కట్టెల కోసం వెళ్లిన ఓ పేద గిరిజన మహిళకు.. అక్కడ దొరికిన వస్తువు ఒకటి లక్షాధికారిని చేసేసింది. మధ్యప్రదేశ్ వజ్రాల జోన్ అయిన పన్నా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఎప్పటిలాగే బుధవారం రోజున పొయ్యి కట్టెల కోసం అడవికి బయలుదేరింది జెందా బాయి. అక్కడ ఆమె మట్టిలో కూరుకుపోయి మెరుస్తున్న ఓ రాయి దొరికింది. దానిని ఇంటికి తీసుకొచ్చి భర్తకు చూపించింది. అయితే దాని మెరుపు ఆయనకు అనుమానంగా అనిపించి.. అధికారులను సంప్రదించాడు. వాళ్లు పరీక్షించి అదొక 4.39 క్యారట్ వజ్రమని, చెప్పడంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్.. డైమండ్ డిపాజిట్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేశారు. వేలంలో అది ఫలానా ధర దక్కించుకోవడమే తరువాయి. కనీసం దాని విలువ రూ.20 లక్షల దాకా పలకవచ్చని అనుపమ్ సింగ్ అంటున్నారు. వచ్చేదాంట్లో ప్రభుత్వం తరపున రాయల్టీ, ట్యాక్సుల రూపంలో 12.5 శాతం మినహాంచుకుని.. మిగతాది జెందా బాయి కుటుంబానికి ఇచ్చేస్తారు. పన్నా జిల్లాకు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే పురుషోత్తంపూర్ గ్రామం.. జెండా బాయి కుటుంబం ఉంటోంది. భర్త కూలీపనులు.. జెందా బాయి రోజూ కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. ఈ క్రమంలో వజ్రం రూపంలో ఆ పేద కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది. వచ్చిన డబ్బుతో సొంతగా ఒక ఇల్లు కట్టించుకోవడంతో పాటు కూతుళ్ల పెళ్లిలకు కొంత డబ్బును డిపాజిట్ చేస్తామని చెప్తున్నారు ఆ భార్యభర్తలు. Video: A tribal woman, out gathering firewood in a forest in MP’s #Panna , found a diamond worth at least Rs 20 lakh. #MadhyaPradesh pic.twitter.com/x0dLlBYXMJ — TOI Bhopal (@TOIBhopalNews) July 29, 2022 -
Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు
న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవైన రాష్ట్రపతి పీఠంపై గిరిజన మహిళ సగర్వంగా కూర్చోవడం ఖాయమైనట్టే. ప్రాంతీయ పార్టీల నుంచి రోజురోజుకూ పోటెత్తుతున్న మద్దతు నేపథ్యంలో రాష్టపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు లాంఛనమే కానుంది. వైఎస్సార్సీపీ, బీజేడీ, బీఎస్పీ, అన్నాడీఎంకే, జేడీ(ఎస్), అకాలీదళ్, శివసేన, జేఎంఎం, టీడీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలుపగా తాజాగా యూపీలో విపక్ష సమాజ్‌వాదీ పార్టీ సంకీర్ణ భాగస్వామి, ఓంప్రకాశ్ రాజ్‌భర్‌కు చెందిన సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) కూడా ఈ జాబితాలో చేరింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలు ముర్ముకే ఓటేస్తారని రాజభర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎంపీలు, రాష్ట్రాల ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఆమెకు ఏకంగా 62 శాతం దాకా ఓట్లు ఖాయమయ్యాయి. మూడింట రెండొంతుల మెజారిటీకి చేరువయ్యే సూచనలు కూడా కన్పిస్తున్నాయి. నామినేషన్ దాఖలు సమయంలో ఆమె ఓటర్లు 50 శాతం కంటే తక్కువే తేలారు. ఆదివాసీ మహిళ కావడం, రాష్ట్రాలన్నీ చుడుతూ మద్దతు కోరుతుండటంతో ప్రాంతీయ పార్టీల నుంచి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మొత్తం 10,86,431 ఓట్లకు ఆమెకు ఇప్పటికే 6.68 లక్షల ఓట్లు ఖాయమైనట్టే. ఎస్పీతో తమ బంధం కొనసాగుతుందని రాజ్‌భర్ చెప్పినా, ముర్ముకు మద్దతు నిర్ణయంతో దానికి బీటలు పడ్డట్టేనని భావిస్తున్నారు. -
Lavanya: అందరికీ చెబుతుందనే లావణ్య హత్య
సాక్షి, చౌటుప్పల్: ‘లైంగికదాడికి పాల్పడిన సమయంలో గిరిజన మహిళ నన్ను గుర్తించింది. విషయాన్ని భర్తతో పాటు నేను పనిచేస్తున్న తాపీమేస్త్రీలకు చెబుతానని హెచ్చరించడంతో భయపడి హత్య చేశా’ అని ఈ నెల 9వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఈడిగి హరీష్‌గౌడ్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. గిరిజన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బుధవారం తన కార్యాలయంలో స్థానిక ఏసీపీ ఉదయ్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూలు జిల్లా కోడూరు మండలం మైలారం పరిధిలోని కర్రెన్నబండతండాకు చెందిన ముడావత్ క్రిషీనా అతడి భార్య లావణ్య(28) ఇటీవల ఉపాధి నిమిత్తం మల్కాపురానికి వచ్చారు. అక్కడే ఉన్న ఓ కన్స్ట్రక్షన్ గోడౌన్లో లావణ్య వాచ్‌మన్‌గా, సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 9న భర్త విధులకు వెళ్లగా భార్య గోడౌన్ వద్ద ఒంటరిగా ఉంది. ఐదురోజులుగా వ్యూహరచన దండుమల్కాపురం శివారులో మూతబడిన ఓ డెయిరీలో కొంత మంది తాపీ మేస్త్రీలు ఉంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం వెంకటాపురానికి చెందిన ఈడిగి హరీష్‌గౌడ్(25).. అంజనేయులు అనే మేస్త్రీ వద్ద కూలి పని చేస్తున్నాడు. ఈనెల 5న వారుంటున్న ప్రాంతంలో బోరు వేశారు. ఆ సమయంలో పక్కనే ఉన్న మూతబడిన గోడౌన్లో లావణ్య ఒంటరిగా ఉండడాన్ని నిందితుడు గమనించి వివరాలు తెలుసుకొని అప్పటి నుంచి వ్యూహరచన చేస్తున్నాడు. హరీష్‌గౌడ్.. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఉదయ్‌రెడ్డి భర్త డ్యూటీకి వెళ్లగానే.. ముడావత్ క్రిషీనా సోమవారం డ్యూటీకి వెళ్లడాన్ని హరీష్‌గౌడ్ గమనించి సమయం కోసం వేచిచూశాడు. సాయంత్రం 4గంటలకు బాత్రూంకు వెళ్లిన లావణ్య వద్దకు వెళ్లి లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించిన ఆమె తలపై కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతన్ని గుర్తించిన మృతురాలు విషయాన్ని భర్తతో పాటు ఇతరులకు చెబుతానంది. దీంతో నిందితుడు ఆమె తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతిచెందింది. అనంతరం మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకొని వెళ్లిపోయాడు. విధులు ముగించుకొని రాత్రి ఎనిమిదిన్నరకు ఇంటికి వచ్చిన భర్త చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: (మాటేసి.. కాటేసి..) 24గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు లైంగికదాడి, హత్య ఘటనను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు. ఘటనాస్థలిలో లభించిన కాళ్ల చెప్పుల ఆధారంగానే నిందితుడిని అతడు నివసించే మూతబడిన డెయిరీలోని గదిలో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరం అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. అతడి వద్ద 2బంగారు పుస్తెలు, 2 వెండి పట్టీలు, 4 వెండి మెట్టెలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిపై అత్యాచారం, హత్య, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వివరించారు. కేసును ఛేదించిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్‌భగవత్ అభినందించారన్నారు. ఛేదించిన పోలీసులకు రివార్డు ప్రకటించారని తెలిపారు. సమావేశంలో సీఐలు ఎన్.శ్రీనివాస్, ఏరుకొండ వెంకటయ్య, ఎస్సైలు బి.సైదులు, డి.అనిల్, డి.యాకన్న పాల్గొన్నారు. -
వాసన్న చొరవ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర..!
సాక్షి, ఒంగోలు: రేయింబవళ్లు కష్టపడి చదివి సాధించిన ఉద్యోగం ఓ చిన్న సాంకేతిక కారణంతో ఆ యువతికి అందకుండా పోయింది. కోర్టు ఆదేశించినా అధికారులు పోస్టు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించడంతో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. వివరాల్లోకి వెళితే..జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామం యానాది సామాజిక వర్గానికి చెందిన పొట్లూరి హనుమంతరావు, లలితమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి డీఈడీ పూర్తి చేసిం 2018లో డీఎస్సీ రాయగా మంచి మార్కులతో 3726 ర్యాంకు సాధించింది. ఈ డీఎస్సీలో ఎస్టీ యానాది ఉప కులానికి 8 తెలుగు మీడియం పోస్టులను కేటాయించారు. ఈ క్రమంలో 2020లో డీఎస్పీ 2018 పోస్టులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలంటూ విద్యాశాఖ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మెసేజ్‌లు పంపింది. అయితే ఫోన్ ప్రాబ్లం కారణంగా ఆ సమాచారాన్ని అంజలి అందుకోలేకపోయింది. దీంతో ఈమె కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన అదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు మహిళలు ఉద్యోగాలు సాధించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజలి అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. చదవండి👉🏾: (మంచి విజన్ ఉన్న యువ సీఎం జగన్: కుమార మంగళం బిర్లా) పూర్వాపరాలను పరిశీలించిన డివిజన్ బెంచ్ అంజలికి పోస్టు కేటాయించాలని, ఒకవేళ పోస్టు ఏదీ ఖాళీగా లేకపోతే సూపర్‌న్యూమరీ పోస్టు అయినా కేటాయించాలంటూ పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పాతికేళ్ల క్రితమే సూపర్ న్యూమరీ పోస్టులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో ఆమె విషయాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి అభ్యర్థించింది. బాలినేని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాసి పర్యవేక్షించారు. దీంతో అంజలికి గత నెల 10న సూపర్ న్యూమరీ పోస్టు మంజూరైంది. ఆమెకు గుడ్లూరు మండలం చేవూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పోస్టు కేటాయిస్తూ ఉత్తర్వులు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి.జగన్నాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉద్యోగం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. -
అవమానాలు దిగమింగి.. గిరిజన లిపిని ఆవిష్కరించా
కృష్ణా జిల్లా సీతానగరం స్వగ్రామమైనప్పటికీ తండ్రి రైల్వేలో ఉద్యోగ రీత్యా పశ్చిమ బెంగాల్, బిహార్లలో పెరిగా. చదువు కొనే వయసు వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డాం. తాత స్కూలు హెడ్మాస్టర్ కావడంతో నాకు కూడా విద్యాబోధన పట్ల ఆసక్తి పెరిగింది. గిరిజనులు ఉన్నత విద్య అభ్యసించాలంటే ఎన్నో వ్యయప్రయాసలు, అవమానాలు పడాల్సి వచ్చేది. వాటిని అధిగమిస్తూ ఉన్నత విద్య పూర్తిచేశా. సత్తుపాటి ప్రసన్న శ్రీ ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ – చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. మైనారిటీ గిరిజన భాషలను సంరక్షణ, గిరిజన భాషలకు నూతన రచనా విధానాలు అభివృద్ధి చేస్తుంటారు. భగత, గదభ, కొలామి, కొండ దొర మొదలైన 19 గిరిజన భాషలకు లిపి (అక్షరాలను) రూపొందించిన ప్రపంచంలోనే తొలి మహిళ. ఆమె సాహిత్య రచనలలో ’ఈస్ట్ అండ్ వెస్ట్ పోస్ట్ మాడర్న్ లిటరేచర్‌లో మహిళల సైకోడైనమిక్స్’ వంటి రచనలు ఉన్నాయి. ’షేడ్స్ ఆఫ్ సైలెన్స్’, ’ఉమెన్ ఇన్ శశి దేశ్‌పాండే నవల – ఒక అధ్యయనం,’ రచించారు. వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎన్డేంజర్డ్ ఆల్ఫాబెట్స్, యూఎస్ఏ (2019)లో ప్రదర్శించబడిన తొలి భారతీయ, ఆసియా మహిళ. మైనారిటీ గిరిజన భాషలను పరిరక్షణ నిమిత్తం చేసిన విశేష కృషికి నారీ శక్తి పురస్కారం లభించింది. ‘గిరిజనురాలివి అందులోనూ మహిళవి.. ఏం సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని బయల్దేరావు.. నీకు ఇంక వేరే పనిలేదా.. వంటి అనేక అవహేళనలు, అవమానాలు దిగమింగి గిరిజనుల కోసం లిపిని రూపొందించా’ అంటున్నారు నారీశక్తి–2021 పురస్కార గ్రహీత సత్తుపాటి ప్రసన్నశ్రీ. ఇలాంటి అవమానాలు ఎన్ని ఎదురవుతున్నా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తానని ధీమాగా చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొన్న సందర్భంగా ఆమె సాక్షితో ముచ్చటించారు. గిరిజనుల సంక్షేమం, విద్య కోసం చేసిన ప్రస్థానం ఆమె మాటల్లోనే... ‘‘గిరిజనుల కోసం చేస్తున్న కృషికి బూస్టప్ డోస్‌లా నారీశక్తి పురస్కారం దక్కింది. సుమారు మూడున్నర దశాబ్దాలుగా గిరిజనుల కోసం చేసిన ఒంటరి పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ఎన్ని అవమానాలు ఎదురైనా విద్య ఒక్కటే శాశ్వతమని నమ్మి నాలాగా ఇతర గిరిజనులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పట్టుదలతో ముందుకెళ్లా. నాన్న నా చదువుకోసం ఎన్నో త్యాగాలు చేస్తే, భర్త నా ఆశయ సాధన కోసం ఎంతో ఆసరా ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతో కొండ ప్రాంతాల్లోని గిరిజనులను కలిసి వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించా. ఈ క్రమంలో సెలవు రోజుల్లో ఉదయానికే విశాఖపట్నం చేరుకొని రైల్వేస్టేషన్లోనే కొండప్రాంతాల వారి మాదిరి దుస్తులు ధరించి అరకు గిరిజన ప్రాంతాలకు వెళ్లేదాన్ని. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన తర్వాత గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి మరింత సులభమైంది. తెలిసిన వారు ‘ఇదంతా ఎందుకమ్మా పనిపాటా లేదా’ అని హేళన చేసేవారు. ‘నిన్ను ప్రోత్సహిస్తే మాకు ఎన్ని ఓట్లు పడతాయి?’ అని అడిగిన రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అవమానాలకు, అవహేళనలకు తట్టుకోలేక వెనక్కి తగ్గి ఉంటే 30కిపైగా దేశాల్లో విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యేదాన్ని కాదు. 106 రిసెర్చి ఆర్టికల్స్, 18 ఎంఫిల్స్, 32 పీహెచ్‌డీలు 32 పుస్తకాలు రచించాను. అంతర్జాతీయంగా అనేక పరిశోధనలు చేశా. అల్జీరియా, అమెరికా ఫ్రాన్స్, ఇథియోపియా తదితర దేశాల్లో నా పొయిట్రీని పాఠ్యాంశంగా పెట్టుకున్నారు. సమానత్వం కోసం మాట్లాడేవారు గిరిజనుల సమానత్వం కోసం కూడా అదేస్థాయిలో పోరాడాలి. నేను రూపొందించిన లిపిని పాఠ్యపుస్తకాలుగా మార్చితే గిరిజనులు మాతృభాషలో విద్యాభ్యాసం చేయొచ్చు. గిరిజన విద్యార్థుల డ్రాపవుట్ సంఖ్య తగ్గించొచ్చు. నూతన విద్యా విధానంలో మాతృభాషలోనే బోధన అని చేర్చారు. భవిష్యత్తులో గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకానొక సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నా ప్రయత్నం గురించి చెప్పా. ఎనిమిది భాషల లిపి రూపొందిస్తున్నా అని చెబితే.. అవన్నీ పూర్తిచేసి వస్తే సముచిత గౌరవం దక్కేలా చేస్తానన్నారు. తొలిసారి గిరిజన మహిళకు వైస్ చాన్సలర్ హోదా దక్కేలా చూస్తానంటూ నన్ను ప్రోత్సహించారు. గిరిజనుల్లో కొండ, మైదాన ప్రాంతాల వారి విధానాలు వేర్వేరుగా ఉంటాయి. కొండప్రాంతాలవారు మనల్ని నమ్మితే∙కానీ ఏమీ చేయలేం. వారిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. వారికి నాగరక సమాజంతో తక్కువ సంబంధం ఉండటం వల్ల వారిలో విద్య పట్ల ఆసక్తి పెంచడానికి కొంత శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుతం సెలవుల సమయంలో ఉత్తరాది నుంచే కాదు క్యూబా, కొరియా, జర్మనీ తదితర విదేశాల నుంచి కూడా యువత వచ్చి గిరిజనులకు చదువు చెబుతున్నారు. గిరిజన లిపిని పాఠ్యాంశాలుగా మార్చితే వారెంతో రుణపడి ఉంటారు. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశ సమయంలో ఇదే అంశాన్ని ప్రస్తావించా. సమావేశం అనంతరం ప్రధాని మోదీ స్వయంగా నా దగ్గరకు వచ్చి ఇందాకా ఏదో చెబుతున్నారంటూ ఆసక్తిగా అన్ని విషయాలు విన్నారు. ప్రధాని సిబ్బంది నా ఫోన్ నంబరు కూడా తీసుకున్నారు. ఇదే స్థాయిలో ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ సాక్షితో తన భాషా సేవ గురించి వివరించారు ప్రసన్నశ్రీ. – సూర్యప్రకాశ్ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ -
ఓ తల్లి సాహసం: ఒట్టి చేతులతో చిరుతతో పోరాడి
MP Tribal Woman Fights Leopard With Bare Hands Rescue Her Son: అమ్మ అంటేనే అంతులేని ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం. తనకు ఏం జరిగినా పట్టించుకోదు కానీ బిడ్డకు ఆపద అని తెలిస్తే.. ఆ తల్లి ప్రాణం తల్లడిల్లుతుంది. ఎక్కడా లేని ధైర్యం ఆవహిస్తుంది. ఆది పరాశక్తికి ప్రతిరూపంగా మారి.. ఆపదతో పోరాడుతుంది. ఆ సమయంలో తల్లికి ఎలాంటి ఆయుధాలు అవసరం లేవు.. బిడ్డ మీద ప్రేమ ఒక్కటే ఆమెకు వెయ్యి ఏనుగులు బలాన్ని ఇచ్చి.. పోరాడేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. చంటి బిడ్డను నోట కరుచుకుని.. అడవిలోకి పారిపోయింది చిరుత పులి. బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం ఆ తల్లి పెద్ద యుద్ధమే చేసింది. తన చేతులనే ఆయుధాలుగా మార్చి.. చిరుతతో పోరాడి.. బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది ఆ తల్లి. ఆ వివరాలు.. (చదవండి: దేశంలోనే తొలిసారి కనిపించిన అరుదైన ‘గులాబీ’ చిరుత) మధ్యప్రదేశ్, సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్‌లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ పిల్లలతో జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కలిసి ఆరు బయట ఏర్పాటు చేసిన చలి మంట దగ్గర కూర్చుంది. కిరణ్ ఒడిలో ఓ పాప ఉండగా, మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి.. కిరణ్ బైగా ఎనిదేళ్ల కొడుకు రాహుల్‌ని నోట కరుచుకుని అడవిలోకి పరిగెత్తింది. జరిగిన సంఘటనతో కిరణ్ బైగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. వెంటనే తేరుకుని మిగిలిన పిల్లలను ఇంట్లో ఉంచి.. రాహుల్‌ని కాపాడుకోవడం కోసం అడవిలోకి పరుగు తీసింది. అప్పటికే చీకటి పడింది. ఎదురుగా ఏం కనిపించడం లేదు. చిరుత బిడ్డను తీసుకుని పొదల్లో దూరింది. ఏం చేయాలో కిరణ్బైగాకు పాలు పోలేదు. కానీ తన బిడ్డ ప్రాణం ఆపదలో ఉన్న విషయం ఆమెను వెంటాడింది. (చదవండి: బాయ్‌ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్ చేస్తే) చేతికి దొరికిన కర్ర తీసుకుని అడవిలో ముందుకు వెళ్లింది. అప్పటికే కిరణ్ బైగా ధైర్యాన్ని చూసి చిరుత కాస్త జంకింది. ఈ క్రమంలో ఆమె బిడ్డను వదిలేసింది. వెంటనే కిరణ్ అక్కడకు పరిగెత్తి.. బిడ్డను తన పొత్తిళ్లలోకి తీసుకుంది. అంతసేపు కిరణ్ బైగాను చూసి జంకిన చిరుత.. ఉన్నట్టుండి ఆమె మీద దాడి చేయసాగింది. వెంటనే అప్రమత్తమైన కిరణ్ బైగాను బిడ్డను కాపాడుకుంటూనే.. ఒట్టి చేతలతో చిరుతతో పోరాడసాగింది. అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులు కిరణ్, ఆమె బిడ్డ కోసం వెతుకుతూ.. అడవిలోకి వచ్చారు. జనాలను చూసిన చిరుత అడవిలోకి పరుగు తీసింది. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు కిరణ్బైగా సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. బిడ్డ ప్రాణం కోసం కిరణ్ బైగా చేసిన సాహసంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. The woman of the village saved her little child from the leopard, this would have been the mother of real India (the land of Shivaji Maharaj) Not like today's gentle mother who is busy eating pizza burger and her lust, who shouts help me help me every time. #IndianMother pic.twitter.com/o5V0VRhvtZ — Odd-Purush (Odd Man) (@prevaildatruth) December 1, 2021 చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ -
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
అక్రమ ఆపరేషన్లపై ప్రభుత్వం కొరడా
పాడేరు: ఇటీవల విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెంలోని మెడికల్ షాపులో నిబంధనలకు విరుద్ధంగా గిరిజన మహిళలకు సంక్షేమ ఆపరేషన్లు చేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆపరేషన్ చేసిన అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ గైనకాలజిస్టు డాక్టర్ ఎస్.తిరుపతిరావును సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్.సూర్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఈ నెల 10న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ వి.అభిషేక్ చేపట్టిన విచారణలో.. ఈ ఆపరేషన్లు చేసింది అనకాపల్లి ఆస్పత్రి గైనకాలజిస్టు తిరుపతిరావుగా తేలింది. అలాగే వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు జరిపిన విచారణ నివేదికను అందుకున్న జిల్లా వైద్యాధికారి సూర్యనారాయణ.. డాక్టర్ తిరుపతిరావుపై చర్యలు తీసుకున్నారు. తిరుపతిరావును సస్పెండ్ చేసి ఆయన స్థానంలో తగరంపూడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ రమేష్‌నాయుడును అర్బన్ ఫ్యామిలి వెల్ఫేర్ సెంటర్‌కు ఇన్చార్జిగా నియమించారు. -
అక్రమ ఆపరేషన్లపై విచారణ వేగవంతం
పాడేరు: విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం ఈదులపాలెం గ్రామంలోని ఓ మెడికల్ షాపు వద్ద ఇటీవల అక్రమంగా నిర్వహించిన కుటుంబ సంక్షేమ ఆపరేషన్లపై సమగ్ర విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. కలెక్టర్, పాడేరు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోల ఆదేశాల మేరకు పాడేరు తహసీల్దార్ ప్రకాష్‌రావు సోమవారం ఉదయాన్నే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు జరిగిన మెడికల్ షాపుతోపాటు సమీప వీధిని ఆయన పరిశీలించి అక్కడి గిరిజనులను విచారించారు. అనంతరం ఈదులపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని విచారించారు. మెడికల్ షాపులో ఆపరేషన్లు చేసిన వైద్యబృందం వివరాలు సేకరించారు. స్థానిక ఆస్పత్రి సిబ్బంది పాత్రపై ఆరా తీశారు. ఆపరేషన్ చేయించుకున్న గిరిజన మహిళల కుటుంబసభ్యుల నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల వీఆర్వోలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లో సంక్షేమ ఆపరేషన్లు చేయించుకున్న గిరిజన మహిళల వివరాలను సేకరిస్తున్నారు. -
షారూక్ ఖాన్ మెచ్చిన అరకు గిరిజన మహిళ
-
తన చెల్లికి వచ్చిన దుస్థితి మరోకరికి రాకూడదని..
అసలే పేదరికం, దానికి తోడు పదహారేళ్ల చెల్లికి మానసిక ఆరోగ్యం అంతంత మాత్రం. డాక్టర్ల సలహామేరకు ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ సభ్యుల ఆదరణ అంతగా లేకపోవడంతో చెల్లి నిరాశా నిస్పృహలకు లోనై రైలు కింద పడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ పరిణామాలన్నింటిని దగ్గర నుంచి గమనించిన 31 సంవత్సరాల అక్క సుమిత్ర గాగ్రై మనసు చలించి పోయింది. వైద్యం చేయించినప్పటికీ అవగాహన లేమి, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగా చెల్లి ప్రాణాలు కోల్పోవడంతో మానసిక ఆరోగ్యంపై ఎలాగైనా అందరిలో చైతన్యం తీసుకురావాలనుకుంది. మారుమూల గ్రామాల్లో గూడుకట్టుకున్న మూఢనమ్మకాలను దూరం చేసి వారిలో అవగాహన కల్పించాలనుకుంది. ఈ క్రమంలోనే జార్ఖండ్‌లోని పల్లెటూళ్లు, గ్రామాలు, గిరిజన తండాలను సందర్శించి వీధినాటకాలు, కథలు, చెప్పడం, వివిధ రకాల ఆటలు ఆడించడం ద్వారా మూఢనమ్మకాలు, మానసిక ఆరోగ్యంపై అక్కడి మహిళలకు అవగాహన కల్పిస్తోంది. ‘హో’తెగకు చెందిన సుమిత్ర స్థానిక ఎజెక్ట్ ఎన్జీవో కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ...సెల్ఫ్‌హె ల్ప్ గ్రూపులకు, మహిళలకు మధ్య వారధిగా పనిచేస్తూ మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆమె కూడా గిరిజన మహిళ కావడంతో ఆయా గ్రామాల్లోని మహిళలతో సులభంగా కలిసిపోయి వారికి అర్థమయ్యేలా చెప్పేవారు. గత పన్నెండేళ్లుగా 24 మారుమూల గ్రామాలను సందర్శించి 36 వేల మందికిపైగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. మానసిక ఆరోగ్యంతోపాటు, మహిళలు పిల్లలు తీసుకోవాల్సిన పోషకాహారం, శిశు మరణాల రేటు తగ్గించడానికి కృషి చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో ప్రసవం అయిన తరువాత బొడ్డు తాడు కత్తిరించడం నుంచి శిశువును పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలన్న అవగాహన లేమితో చాలామంది పురిటి శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో శిశు మరణాల రేటు అధికంగా ఉంటుంది. సుమిత్ర, తన ఎన్జీవో సభ్యులతో కలిసి అవగాహన కల్పించి మరణాల రేటును 45 శాతం తగ్గించారు. మానసిక ఆరోగ్యంపై సుమిత్ర చేసిన సేవను గుర్తించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతేడాది ‘ఉమన్ ఎగ్జంప్లర్’ అవార్డుతో సత్కరించింది. అంతేగాక ‘దలాన్సెట్’ మెడికల్ జర్నల్‌లో సుమిత్రా సేవా కార్యక్రమాలను ప్రస్తావించడం విశేషం. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, నీతి ఆయోగ్ ప్రకారం జార్ఖండ్ రాష్ట్రంలో మూఢనమ్మకాలు దయ్యం పిశాచి వంటి కారణాలతో మహిళలపై అనేక దారుణాలు అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. సుమిత్ర వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పించడం ద్వారా ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మహిళల మీద జరిగే అఘాయిత్యాలు, పోషకాహారంపై మంచి అవగాహన కల్పించడంతో ఇప్పుడు వారంతా మెరుగైన జీవనాన్ని సాగిస్తున్నారు. -
Photo Story: చలాకీ సీక్రెట్, నవ్వుతూ బతకాలి
జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటన్నింటిని చిరునవ్వుతో జయించాలని అంటున్నట్టుగా ఉంది కదూ ఈ ఆదివాసీ వృద్ధురాలి చిత్రం!. తరగని చిరునవ్వులే తన ఆస్తిపాస్తులని చెప్పే ఈ వృద్ధురాలు.. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, అయితే ఏనాడూ ఓడిపోలేదని అంటోంది. మెడలో సర్రి, కాళ్లు, చేతులకు కడలు వేసుకొని ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ వస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెమెరి మండలం పెద్దపాట్నాపూర్లో కనిపించిందీ చిత్రం. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ చలాకీ సత్యం ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామానికి చెందిన సత్యంకు 91 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన రోజూ పది తాడిచెట్లను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎక్కి కల్లు గీస్తాడు. గీసిన కల్లును సైకిల్‌పై తిరుగుతూ విక్రయిస్తాడు. 16 ఏళ్లుగా కల్లు గీస్తున్నానని, చెట్లెక్కినా అలసటనేదే రాదని అంటున్న ఈయన.. చెట్లు ఎక్కకపోతే మోకాళ్ల నొప్పులు వస్తాయని ‘సాక్షి’కి చెప్పాడు. ఇన్నేళ్ల జీవితంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోలేదని, మధ్యాహ్న జొన్న జావ, రాత్రికి వరి అన్నం తింటానని చెబుతున్నాడు. – సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం వాగు దాటితేనే నాట్లు ముమ్మరంగా నాట్లుపడే సమయంలో వానలు దంచికొడుతున్నాయి. పొలాలకు వెళ్దామంటే వాగులు వంకలూ ఉప్పొంగుతున్నాయి. అలాగని అదను దాటిపోతుంటే రైతులు చూస్తూ ఉండలేరు కదా.. అందుకే ఓ రైతు వరద నీట మునిగిన అర్కండ్ల వాగు (కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం) లోలెవల్ బ్రిడ్జి మీదుగా తన పొలానికి కూలీలను ఇలా ట్రాక్టర్‌పై తరలించాడు. – శంకరపట్నం పరుచుకున్న పచ్చదనం ఇటీవల రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఇలా పచ్చదనం నింపుకుంది. దట్టమైన అడవి, కొండ ప్రాంతంతో పాటు పార్క్ సమీపంలో నుంచి మహబూబ్‌నగర్–జడ్చర్ల రహదారి ఇటు వ్యవసాయ పొలాలు చూడటానికి ఆకట్టుకుంటున్నాయి. – పాలమూరు పాకాలకు కొత్త అతిథులు ఖానాపురం: తెల్లని రంగుతో, గరిటె లాంటి పొడవైన ముక్కు కలిగిన ఈ కొంగను తెడ్డుమూతి కొంగ అంటారు. ఇవి శీతాకాలంలో ఉష్ణ మండలాలకు వలస వస్తుంటాయి. నీటి మడుగులు, చెరువులు, నదీ ప్రాంతాల్లో, బురద నేలల్లో సంచరిస్తుంటాయి. ఈ కొంగలు మొదటిసారిగా పాకాల పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ చెల్పూరి శ్యాంసుందర్ వీటిని కెమెరాలో బంధించారు. -
అడవి పంపిన బిడ్డ
తప్పిపోయిన కొడుకు తిరిగొస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కుంతల కుమారికి ఇప్పుడు అంతకు మించిన సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం అరణ్యంలో కనిపించిన అడవి పంది కూనను ఇంటికి తెచ్చి పెంచుకుందామె. వారం క్రితం అటవీ అధికారులు వచ్చి ఆ పందిని అలా పెంచుకోకూడదని అడవిలో వదిలి వచ్చారు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఏడ్చింది. ఆ బిడ్డ ఆ తల్లిని వెతుక్కుంటూ బయలుదేరింది. రోమాంచితమైన ఈ అనురాగబంధపు కథ ఒడిసాలో జరిగి ప్రచారంలో ఉంది. మీడియాకు భావోద్వేగాలు ఉండవు అని అంటారుగాని కుంతల కుమారి కోసం మీడియా కూడా కన్నీరు పెట్టినంత పని చేసింది. వారం క్రితం ఒడిసాలోని గంజాం జిల్లాలో పురుషోత్తంపూర్ అనే చిన్న పల్లెలో నివసించే కుంతల కుమారి ఆక్రందనలు విని మీడియా కూడా అక్కడకు చేరుకుంది. ‘నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. నాకు న్యాయం చేయండి’ అని వారి ముందు ఏడ్చింది కుంతల కుమారి. ఆ బిడ్డ పేరు ‘ధుడ’ (పాలు). అది ఒక అడవి పంది. ‘నా సొంతబిడ్డ కంటే దానిని ఎక్కువ సాక్కున్నాను’ అని చెప్పింది కుంతల కుమారి. దేవుడు పంపిన కొడుకు రెండేళ్ల క్రితం కుంతల కుమారి కూతురు జబ్బు చేసి చనిపోయింది. అడవిలో ఆ కుమార్తె అంతిమ సంస్కారాలు పూర్తి చేసి విషాదంతో తిరిగి వస్తున్న కుంతల కుమారికి తల్లి నుంచి తప్పిపోయి భీతిల్లి తిరుగుతున్న రోజుల వయసున్న అడవి పంది పిల్ల కనిపించింది. ‘అది నన్ను చూడగానే నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. దానిని చూసి నేను నా కూతురు చనిపోయిందని బాధ పడాలా... ఈ పంది పిల్ల నా దగ్గరకు వచ్చిందని ఆనంద పడాలా తెలియలేదు. మొత్తం మీద ఆ కూన నాకు దేవుడు పంపిన కొడుకు అనుకున్నాను’ అంటుంది కుంతల కుమారి. ఆమెకు ఇంకో కూతురు కూడా ఉంది. తల్లీ కూతుళ్లు కలిసి ఆ పంది పిల్లకు ‘ధుడ’ అని పేరు పెట్టి పెంచసాగారు. అప్పటినుంచి ఆ అడవి పంది ఇంటి పందిగా మారిపోయింది. కుంతల కుమారి పిలిస్తే పరిగెత్తుకుని వస్తుంది. ఇంటి ముందే ఉంటుంది. అడవి పందితో ఆడుకుంటున్న కుంతలకుమారి కుమార్తె అటవీ అధికారుల ప్రవేశం అయితే ఒడిసా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందిని పెంచుకోవడం నేరం. అందువల్ల అటవీ అధికారుల ఇన్నాళ్లు ఊరికే ఉండి వారం క్రితం కుంతల కుమారి ఇంటికి వచ్చి ఆమెను హెచ్చరించి ‘ధుడ’ను అడవిలో విడుస్తామని తీసుకెళ్లి విడిచి వచ్చారు. పురుషోత్తం పూర్‌కు దగ్గరలోనే టెల్కొయ్ అభయారణ్యం ఉంది. అధికారులు దానిని తీసుకెళ్లి ఆ అరణ్యంలో విడిచి పెట్టారు. ఇది జరిగిన వెంటనే కుంతల కుమారి లబలబమని నోరుకొట్టుకొని తీవ్రంగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ సమాచారం అందుకున్న మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘అటవీ అధికారులు చేసింది తప్పు’ అని అందరూ తిట్టిపోశారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అడవి లో ధుడా తప్పిపోయింది. దాని ఆహారం ఎలా? ‘ధుడా ఇంటి తిండికి అలవాటు పడింది. అది అడవిలో బతకలేదు’ అని కుంతల కుమారి అంటే ‘అడవి పందులకు తాము అడవిలో ఎలా బతకాలో తెలుసు’ అని అధికారులు అన్నారు. కాని అది నిజం కాదు. అడవిలో పడ్డ ధుడా తిండి లేక నీరసించింది. అడవి కొత్త కావడంతో భీతిల్లిపోయింది. ‘ధుడా’ అని పేరు పిలుస్తూ వెతుక్కుంటూ తిరుగుతున్న కుంతలను చూసి గ్రామస్తులు కూడా ధుడాను వెతికారు. చివరకు అది 25 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వెంటనే కుంతల ఆగమేఘాల మీద వెళ్లి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర సేదదీరింది. కుంతల, కుంతల కుమార్తె ధుడాను ఇంటికి తెచ్చుకున్నారు. ‘అది అడవిలో తిండి సంపాదించుకోలేకపోయింది. దాని సంగతి ఆలోచిస్తాం’ అని అటవీ అధికారులు ఇప్పుడు నత్తులు కొడుతున్నారు. వారం రోజుల ఎడబాటు వల్ల భీతిల్లిపోయిన ధుడా, కుంతల ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండటం లేదు. ‘పడుకో నాన్నా.. కళ్లు మూసుకొని పడుకో’ అని కుంతల దాని ముట్టె మీద చేయి వేసి ఊరడిస్తే అది కళ్లు మూసుకొని నిద్రలోకి జారిపోవడం వీడియో లో చూసి ఆశ్చర్యపోయేవారు వారిద్దరికీ అభిమానులుగా మారారు. బహుశా వీళ్లను ఇక మీదట ఎవరూ విడదీయకపోవచ్చు. – సాక్షి ఫ్యామిలీ -
గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి
వెలుగోడు/గుంటూరు రూరల్: గిరిజన మహిళ (45)పై ముగ్గురు గిరిజన యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం నల్లమల అటవీ శివారు ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ► వెలుగోడు జమ్మినగర్ తండాకు చెందిన భార్యాభర్త గాలేరుపై నిర్మిస్తున్న వంతెన వద్ద వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు. ► దీని పక్కనే ఉన్న గూడెంలో కొందరు నాటుసారా కాస్తున్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారని నారపురెడ్డికుంట గూడేనికి చెందిన కొంతమంది జూలై 31 అర్ధరాత్రి భర్తపై దాడి చేసి భార్యపై లైంగికదాడికి ఒడిగట్టారు. ► సోమవారం వెలుగోడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసింది. ► దీంతో పోలీసులు తోట నాగన్నతోపాటు మరో ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇంకొకరి కోసం గాలిస్తున్నారు. ► కాగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మేకతోటి సుచరిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. -
నా తల్లివి కదూ వైద్యం చేయించుకో..
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: అవగాహన లేమి, మూఢ విశ్వాసాలతో వైద్యం చేయించుకునేందుకు నిరాకరిస్తున్న గిరిజన యువతిని ఒప్పించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అష్టకష్టాలు పడింది. చివరకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సైతం బతిమాలాల్సి వచ్చింది. ఆమె బుజ్జగించి, ధైర్యం చెప్పడంతో ఎట్టకేలకు ఆ బాలింత అయిష్టంగానే అంగీకరించింది. దీంతో వైద్యులు ఆక్సిజన్ పెట్టి సెలైన్ ఎక్కిస్తున్నారు. వివరాలు.. సీతంపేట మండలం కుశిమి పంచాయతీ సీదిమానుగూడకు చెందిన సవర రాజే శ్వరి విశాఖ కేజీహెచ్‌లో జనవరి 27న పండంటి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అక్కడ తనకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని అక్కడి వైద్యులకు చెప్పా పెట్టకుండా బిడ్డను తీసుకుని భర్త దుర్గారావుతో కలసి స్వగ్రామం వచ్చేసింది. గత రెండు రోజుల నుంచి రక్తహీనతతో రాజేశ్వరి శరీరం పొంగిపోయి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానిక ఆశా కార్యకర్తల ద్వారా ఈ విషయాన్ని కుశిమి పీహెచ్సీ వైద్యులు తెలుసుకున్నారు. తక్షణమే స్పందించిన వీరు బాలింతను శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి వైద్యానికి సహకరించకపోవటంతోపాటు తనకు చిన్నప్పటి నుంచి నాటు వైద్యం తప్ప ఇంగ్లీషు మందులు పడవని, వాటిని వాడనని, తనను తక్షణమే ఇంటికి పంపించేయాలని వాదులాటకు దిగింది. ఆమెకు తోడు రాజేశ్వరి సోదరుడు, వదిన కూడా వంత పాడటంతో భర్త చేసేదిలేక మిన్నకుండిపోయాడు. రాజేశ్వరి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఆర్డీవో, ఇతర అధికారులు వైద్యాధికారి రాజ్‌గోపాల్ అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వైద్యులు ఈ సమాచారాన్ని ఐటీడీఏ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఐటీడీఏ పీఓ సాయికాంత్ వర్మ స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో పాలకొండ ఆర్డీవో టీ.వీఎస్జీ.కుమార్, ఎస్సై ఆర్.జనార్దనరావు, కమిషనర్ లిల్లీ పుష్పనాథం, ఆర్ఐ రమేష్‌బాబు, వీఆర్వోలు బంకి రాజా, బలివాడ సాయి తదితరులు ఆస్పత్రికి చేరుకొని గిరిజన కుటుంబీకులను ఒప్పించే యత్నం చేశారు. అన్నివిధాలా చెప్పి ఆర్ధికంగా, అధికారికంగా సహకరిస్తామన్నారు. అయినా వారు తమను ఇంటికి పంపేయాలని, పసరు వైద్యం చేయించకుంటామని తేల్చిచెప్పటంతో శతవిధాల ఓప్పించే యత్నం చేశారు. ఈ కాలంలో కూడా నాటు, పసరు వైద్యంపై ఇంత నమ్మకమేమిటని, వైద్యులకు సహకరించాలని నచ్చచెప్పినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే రాకతో.. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి రాత్రి 8 గంటల సమయంలో ఆస్పత్రికి చేరుకొని రాజేశ్వరిని, ఆమె కుటుంబ సభ్యులను వైద్యం చేయించుకోవాలని బతిమలాడారు. తన బిడ్డ వంటి దానివని, తన మాట విని మందులు వేసుకోవాలని నచ్చజెప్పారు.ఒకానొక దశలో ఆ మందులు తానుకూడా వేసుకుంటానని చెప్పటంతో రాజేశ్వరి మాట విని కొంత మేర వైద్యానికి సహకరించడంతో తక్షణమే వైద్యులు ఆక్సిజన్ అందించి సెలైన్ పెట్టారు. ఓ గిరిజన బాలింత ఆరోగ్యం కాపాడేందుకు అధికారులు స్పందించిన తీరును అంతా ప్రశంసించారు. ఎమ్మెల్యే రాత్రి 9 గంటల వరకు ఉండి బాలింత వైద్యానికి సహకరించాక అక్కడి నుంచి నిష్క్రమించారు. -
భర్త కళ్లెదుటే..
పాడేరు: భర్తతో కలిసి వరి కోతకు వెళ్లిన గిరిజన మహిళ ఆకస్మికంగా కుప్పకూలి ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే మృతి చెందింది. ఈ విషాద సంఘటన గొండెలి పంచాయతీ లింగాపుట్టు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇదే గ్రామానికి చెందిన పలాసి కొండమ్మ (40) తన భర్త పలాసి నూకరాజుతో కలిసి శుక్రవారం ఉదయం తమ పంట పొలంలో వరి కోతకు వెళ్లింది. వరి చేనును కోస్తున్న సమయంలో ఆకస్మికంగా ఆమె కుప్పకూలి పడిì పోయింది. నోటి నుంచి నురగ వస్తుండడంతో పాము కాటేసిందని భావించిన భర్త నూకరాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. గ్రామస్తుల సాయంతో అంబులెన్సులో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కళ్లెదుటే భార్య చనిపోవడంతో భర్త నూకరాజు తీవ్రంగా రోదించాడు. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కొండమ్మకు ప్రభుత్వం తరఫున రావాల్సిన రాయితీలు ఏమైనా ఉంటే త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు కూడా సింహాచలం, కిముడు సింహాచలం, కిముడు విశ్వ, రామకృష్ణ, తదితరులు ఉన్నారు. -
గిరిజన యువతి దారుణ హత్య
అరకులోయ: భార్య ఉండగానే, నెల రోజుల క్రితం రెండో వివాహం చేసుకొని ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన అరకులోయలో కలకలం సృష్టించింది. విశాఖ ఏజెన్సీ అరకులోయ మండలం చినలబుడు గ్రామానికి చెందిన కిల్లో పుష్ప (20) అనే గిరిజన యువతిని, అరకులోయకు చెందిన గిరిజనుడు కె.రమేష్ (25) ప్రేమించాడు. అతనికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ పుష్పను రెండో వివాహం చేసుకుని, స్థానిక సి.కాలనీలో కాపురం పెట్టాడు. రమేష్ రెండో వివాహం చేసుకున్న తరువాత కుటుంబ కలహాలు అధికమైనట్టు తెలిసింది. గిరిజనేతర యువతి రాజేశ్వరిని కూడా ఐదేళ్ల క్రితం రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి ఒత్తిడి అధికం కావడంతో పుష్పను అడ్డు తొలగించుకునేందుకు భర్త రమేష్ ఈ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు కూడా పుష్ప హత్యకు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్ప మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తోంది. పుష్పను శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భర్త రమేష్ బయటకు తీసుకువెళ్లినట్టు చుట్టు పక్కల వారు చెబుతున్నారు. శనివారం ఉదయాన్నే శరభగుడ సమీపంలోని నీలగిరి తోటలలో సగం వరకు బట్టలు లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, సీఐ పైడయ్య, ఎస్ఐ అరుణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రమేష్‌పై అనుమానం వచ్చి పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు ధర్మారావు, అనసూయలను కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పుష్ప ధరించిన చున్నీనే ఆమె మెడకు బిగించి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. కాగా, హత్యకు గురైన పుష్ప తల్లిదండ్రులు కిల్లో పరశురామ్, పుణ్యవతితో పాటు, కుటుంబ సభ్యులు, బంధువులు అరకులోయలో ఆందోళన చేపట్టారు. నిందితులను అరెస్టు చేశామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హమీ ఇవ్వడంతో వారు శాంతించారు. మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
గంగ.. మన్యంలో మెరవంగ
ఆ అమ్మాయికి ‘జీవనది’ గంగమ్మ పేరు పెట్టారా తల్లిదండ్రులు. పేరుకు తగ్గట్లే.. కష్టాలు కూడా.. ఆ చిన్నారిని వెంటాడాయి. మన్యంలో పుట్టినా.. చదువంటే ప్రాణంగా భావించింది. కష్టాలు రోజురోజుకీ పెరిగాయి. తండ్రి మరణంతో చదువును వదిలేయాలనుకుంది. కూతురి ఆశయాన్ని బతికించేందుకు తల్లి ముందుకొచ్చింది. కూలీ పని చేసుకుంటూ గంగను బడికి పంపింది. గంగ ప్రస్థానాన్ని తెలుసుకున్న ‘నన్హీకలీ’ అనే స్వచ్ఛంద సంస్థ వెన్నుతట్టింది. అంతే చదువులో గంగా ప్రవాహం పరుగులెత్తింది. పీఈటీగా ఉద్యోగం సాధించింది. మన్యంలోనే సేవలందిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ మారుమూల మండలమైన హుకుంపేట మండలం తాడిపుట్టులో బొజ్జయ్య, భీమలమ్మ దంపతులకు పుట్టింది గంగమ్మ. పేదరికం ఆ కుటుంబంపై పగబట్టింది. అభివృద్ధికి దూరంగా విసిరేసినట్లుండే ఆ గ్రామంలో పుట్టి పెరిగిన గంగమ్మకు చదువుకోవాలనే ఆకాంక్ష కలిగింది. తల్లిదండ్రులు ప్రభుత్వ బడికి పంపించారు. గ్రామంలోని పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన గంగకు.. పాఠాల్లో నేర్చుకున్న జీవిత గాధలు విని.. భవిష్యత్తు గురించి ఆలోచించే భావనలు మొదలయ్యాయి. పెద్ద చదువులు చదువుతానని.. ప్రభుత్వ కొలువు సాధిస్తానంటూ తల్లిదండ్రులతో చెప్పేది. కానీ.. ఆరో తరగతి చదవాలంటే.. ఆమడ దూరం వెళ్లాల్సిందే. ఇంట్లో వద్దని చెప్పినా.. గంగ పట్టుబట్టడంతో హుకుంపేటలోని హైస్కూల్లో చేర్పించారు. రెండు గంటల పాటు నడిచి వెళ్తేనే హైస్కూల్‌కి చేరుకోగలరు. అయినా పట్టు విడవక రోజూ నడిచి వెళ్లి క్లాస్ ఫస్ట్ వచ్చేది. తండ్రి మరణంతో.... గంగమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి బొజ్జయ్య మరణించాడు. దీంతో కుటుంబ పోషణ భారమైపోయింది. ఆశలు, లక్ష్యాలు పక్కనపెట్టి.. కుటుంబ పెద్ద భారం మోయాలని నిర్ణయించుకుంది. తల్లి మాత్రం ..తాను కష్టపడతాను.. చదువుకో అని చెప్పడంతో.. నెల రోజుల విరామం తర్వాత.. పాఠశాల మెట్లు ఎక్కింది గంగ. రోజు కూలీగా చేరిన తల్లి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. నన్హీకలీ ఫౌండేషన్ చేయూతతో... అదే సమయంలో మన్యంలో పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఆ ప్రాంతానికి వచ్చిన నన్హీకలీ ఫౌండేషన్ ప్రతినిధులు.. చదువులోనూ, ఆటపాటల్లోనూ గంగమ్మ చురుకుదనం చూసి ముగ్ధులయ్యారు. ఆమె కుటుంబ పరిస్థితులు చూసి చలించిపోయారు. వెంటనే గంగమ్మ విద్యా బాధ్యతను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, ఇతర విద్యాసామగ్రి అందించి ప్రోత్సహించారు. పదోతరగతి ఏ గ్రేడ్‌లో పాసయిన గంగమ్మకు.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నన్హీకలీ కమ్యూనిటీ అసోసియేట్ ట్యూటర్ల సహాయంతో ఇంటర్మీడియట్‌ను ఏపీ గిరిజన సంక్షేమ ప్రాంతీయ జూనియర్ కాలేజీలో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైంది. తాడిపుట్టు గ్రామంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మొట్టమొదటి వ్యక్తిగా గంగమ్మ చరిత్రకెక్కింది. డిగ్రీ వద్దనుకొని.... ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత తొలుత డిగ్రీ పూర్తి చెయ్యాలని నిర్ణయించుకుంది గంగమ్మ. అయితే.. డిగ్రీ పూర్తి చేసేందుకు మూడేళ్ల సమయం పడుతుందనీ.. ఆ తర్వాత ఉద్యోగం కోసం మరికొన్ని సంవత్సరాలు శ్రమించాల్సి వస్తుందని భావించింది. డిగ్రీ విద్యని మొదటి సంవత్సరంలోనే స్వస్తి చెప్పింది. హైదరాబాద్‌లోని దోమల్‌గూడలోని గవర్న్మెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో చేరి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ పొందింది. తన జీవితంలో ఎదురైన ప్రతికూలతలను అనుకూలతలుగా మలచుకుని..పీఈటీగా ఉద్యోగం సాధించింది గంగమ్మ. అరకులోని పెదగరువు పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వర్తిస్తోంది. జీవితంలో ఎదురైన ప్రతి పాఠాన్నీ నేర్చుకొని.. లక్ష్యం వైపు దూసుకుపోయిన గంగను గ్రామస్తులు అభినందనల్లో ముంచెత్తారు. అమ్మ మాటలే స్ఫూర్తి... పదమూడేళ్ల వయసులో నాన్న చనిపోయినప్పుడు.. చదువు మానేసి అమ్మతో పాటు పనిలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అయితే అమ్మ దీనికి ఇష్టపడలేదు. చదువుతోనే ఏదైనా సాధ్యమవుతుందనీ, ఊరికి మంచి పేరు తీసుకురావాలని అమ్మ చెప్పింది. అప్పుడే మన కష్టాలన్నీ తీరిపోతాయని అమ్మ చెప్పింది. అప్పటి నుంచి వెనుదిరగలేదు. కష్టపడి చదువుతున్న సమయంలో నన్హీకలీ ఫౌండేషన్ నన్ను అక్కున చేర్చుకుంది. వారి ప్రోత్సాహంతోనే ఇంత వరకు రాగలిగాను. ఏ కష్టం వచ్చినా నన్ను ఆదుకున్నారు. – గంగమ్మ, పీఈటీ, పెదగరువు పాఠశాల -
పురిటి పాట్లు
నార్నూర్(ఆసిఫాబాద్): ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఓ గర్భిణి పురిటి నొప్పులతో ప్రసవ వేదన అనుభవించింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం డాబా–బి గ్రామపంచాయతీ పరిధిలోని పావునూర్ లొద్దిగూడ గ్రామానికి చెందిన సిడాం జంగుబాయికి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడానికి సరైన రోడ్డు లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏమి చేయాలో అర్థం కాక పావునూర్ గ్రామ యువకుడి సాయంతో ఏఎన్ఎం శ్రీదేవికి ఫోన్లో సమాచారం అందించారు. వర్షాకాలంలో గ్రామానికి కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని పరిస్థితి. అయినా ఏఎన్ఎం శ్రీదేవి డాబా–బీ నుంచి పావునూర్ లొద్దిగూడకు దాదాపు 12 కిలో మీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఏఎన్ఎం ఇంట్లోనే పురుడు పోశారు. ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత మహిళకు రక్తస్రావం బాగా జరగడంతో మెరుగైన వైద్యం కోసం ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి నానా తంటాలు పడ్డారు. లొద్దిగూడ నుంచి 12కి.మీ. దూరంలో ఉన్న డాబా వరకు ఎడ్లబండిపై తీసుకొచ్చి..అక్కడి నుంచి 108లో ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పావునూర్ లొద్దిగూడలో మొత్తం 30 కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ గ్రామానికి కనీసం రోడ్డు మార్గం లేదు. రోడ్డు కోసం గత పదేళ్లుగా పాలకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. -
అమ్మ కన్నుమూత...
విజయనగరం, కొమరాడ: ఆమె గిరిజనురాలు. గర్భం దాల్చింది. వైద్యంపై పెద్దగా అవగాహన లేదు. వైద్యులు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది కూడా ఆ గర్భిణికి ప్రసవం, అంతకుముందు పరిస్థితులపై అవగాహన కల్పించలేదు. దీంతో 8 నెలల గర్భిణి నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం పూడేసు పంచాయతీ కోన గ్రామానికి చెందిన హిమరిక దమయంతి (32) అనే గర్భిణి సోమవారం మృతి చెందింది. ఆదివారం పొలం పనిచేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులుఆమె పరిస్థితి విషమంగా ఉందని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు స్కానింగ్ చేసి తల్లి, బిడ్డ పరిస్థితి బాగాలేదని, విజయనగరంలో పెద్దాస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చా రు. కానీ ఆమె అక్కడకు వెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయింది. సోమవారం హఠాత్తుగా మృతి చెందింది. ఆమె హైరిస్క్ గర్భిణి కావడం, కిందపడిపోవడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ అయి చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. దీనిపై పలువురు గిరిజన సంఘాల నేతలు ఆధునిక భారతంలో ఇంకా అవగాహన లేక మరణాలు సంభవిస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు గిరిజనం ఆరోగ్యంపై దృష్టిసారించాలని కోరుతున్నారు. ఆస్పత్రి ఫోన్ నంబర్లు ఆస్పత్రి పేరు ఫోన్ నంబరు వెంకటరామ ఆస్పత్రి 08922–236759 సిటిస్కాన్ డయోగ్నోస్టిక్స్ 08922–222022 వెంకటాద్రి ఆస్పత్రి 9440018606 సాయి రమ్య ఆస్పత్రి 9440120277 వెంకటపద్మ ఆస్పత్రి 7702612346 తిరుమల ఆస్పత్రి 08922–225850 ,9491759216 -
పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు
విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై లైంగిక దాడి కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న 13 మంది పోలీసు సిబ్బందికి లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30తేదీలోపు ఆ ప్రక్రియ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వెంకటనాగేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కేసును ఈనెల 30కి వాయిదా వేశారు. 2008 ఆగస్టు 21న కొంతమంది గ్రేహౌండ్ పోలీసులు తనిఖీల నెపంతో విశాఖ జిల్లా గిరిజన ప్రాంతమైన జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామంపై దాడి చేశారు. ఆ సమయంలో కొంతమంది గిరిజన మహిళలపై లైంగికి దాడికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ కేసు పలు మలుపులు తిరిగి చివరికి విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విచారణకు వచ్చింది. గిరిజన మహిళల అభ్యర్థన మేరకు హైకోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాజేంద్రప్రసాద్‌ను నియమించింది. అయితే పోలీసులు తమకు సంబంధం లేదని, ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో ఫోర్స్‌నిక్ డిపార్టుమెంట్ జారీ చేసిన ఒక లేఖను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో నిందితులైన పోలీసులకు లైంగిక సామర్థ్య పరీక్షలు జరపాలని ప్రాసిక్యూషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 13 మంది పోలీసులకు పరీక్షలు నిర్వహించాలని ఆ రిపోర్టును ఈనెల 30లోపు కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు. -
అడవి బిడ్డలకు పురిటి కష్టాలు
సాక్షి,మంగపేట: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి పంచాయతీ పరిధి కమలాపురం అటవీ ప్రాంతంలో ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. కనీస రవాణా సదుపాయం కూడా లేకపోవడంతో గొత్తికోయ మహిళలు పురుటి నొప్పులతో అల్లాడిపోతున్నారు. తాజాగా కోమటిపల్లి పంచాయతీ పరిధి రేగులగూడెం గొత్తికోయ గిరిజన గ్రామానికి చెందిన మహిళ రోడ్డుపై ప్రసవించిన సంఘట దీపావళి పండుగ రోజు చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రేగులగూడేనికి చెందిన మడకం మల్లమ్మకు తొలికాన్పు. బుధవారం పురిటినొప్పులు రావడంతో మధ్యాహ్నం మూడు సమయంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గంట సమయం గడిచిన తరువాత మల్లమ్మకు మళ్లీ నొప్పులు రావడంతో ఆందోళన చెందిన గూడెం వాసులు పుట్టిన బిడ్డలోపాటు ఆమెను ఎడ్లబండిలో కమలాపురం తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు బండి నుంచి మల్లమ్మను దింపుతున్న క్రమంలో మరో బిడ్డకు రోడ్డుపైనే జన్మనిచ్చింది. వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో ప్రైవేట్ వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలు, తల్లి క్షేమంగా ఉన్నారు. -
గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలు
తూర్పుగోదావరి, చింతూరు (రంపచోడవరం): ఏజెన్సీలో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయనడానికి మంగళవారం ఓ గిరిజన మహిళ మృతి చెందిన సంఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. ఆమె పరిస్థితి విషమంగా వుండగా పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో లేక సొంతంగా తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల వద్ద సొమ్ములు లేక చివరకు ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... చింతూరు మండలం నేలకోట గ్రామానికి చెందిన వెట్టి కన్నమ్మ(45) ఐదు రోజులుగా వ్యాధితో బాధపడుతోంది. ఆమె పరిస్థితి విషమించడంతో చిన్న కొడుకు మహేష్, పెద్ద కోడలు సీతమ్మ స్థానిక ఆశ వర్కర్ సాయంతో సోమవారం మధ్యాహ్నం ఆటోలో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడయ్యాయని చికిత్స నిమిత్తం వెంటనే భద్రాచలం లేదా కాకినాడ తీసుకెళ్లాలని రిఫర్ చేసి లేఖ రాసి ఇచ్చారు. ఆసుపత్రికి చెందిన అంబులెన్సు రిపేరులో ఉందని సొంత ఖర్చులతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పినట్లు మహేష్ తెలిపాడు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు తమ వద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో చింతూరు ఆసుపత్రిలోనే ఉంచేశామని, దీంతో మంగళవారం ఉదయం ఏడు గంటలకు తన తల్లి మృతి చెందిందని అతను వాపోయాడు. అంబులెన్సు ఏర్పాటు చేస్తే కాకినాడ పెద్దాసుపత్రికి తీసుకెళ్దామని భావించామని, అది లేకపోవడంతోనే ఇక్కడే ఉవచేశామని అతను తెలిపాడు. కాగా మృతదేహం తరలించేందుకు ఆసుపత్రిలో ఎలాంటి అంబులెన్సు లేకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట వరకు కన్నమ్మ మృతదేహం ఆసుపత్రిలోని వరండాపైనే ఉండిపోయింది. కనీసం మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా సొమ్ములు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏమి చేయాలో పాలుపోలేదు. మరోవైపు గతంలో వ్యాధితో కన్నమ్మ పెద్దకొడుకు మృతి చెందగా, గత నెలలో వ్యాధితోనే భర్త కూడా మృతి చెందగా ప్రస్తుతం కన్నమ్మ కూడా మృతి చెందింది. ఈ విషయాన్ని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, విలేకరులు ఐటీడీఏ ఏపీఓ పిచుక వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్యకు సూచించారు. దీంతో ఆయన ఆటో ద్వారా మృతదేహాన్ని వారి స్వగ్రామం పంపించారు. కిడ్నీలు పాడైన కన్నమ్మ పరిస్థితి విషమంగా వుండడంతో భద్రాచలం లేదా కాకినాడ తీసుకెళ్లాలని రిఫర్ చేశామని, టైర్లు బాగాలేవని డ్రైవర్ అంబులెన్సును నిలిపి వేయడంతో ఆమెను పంపేందుకు వాహనం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. టైర్లు బాగా లేకపోవడంతో అంబులెన్సును కేవలం లోకల్ వరకే పంపిస్తున్నామని, దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుంటానని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ పుల్లయ్య తెలిపారు. -
ఊరుకాని ఊరిలో.. మృతదేహంతో రాత్రంతా..
గిరిజనుల ప్రాణాలు గాలిలో దీపాల్లా మారాయి. సకాలంలో వైద్యసేవలందకపోవడంతో పాటు పేదరికం కారణంగా విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొందలేని నిస్సహాయ స్థితిలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గురువారం రాత్రి ఓ గిరిజన మహిళ పాడేరు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ముంచంగిపట్టు మండల కేంద్రంలో కన్నుమూసింది. దీంతో ఆమె కుటుంబం ఊరుకాని ఊరిలో మృతదేహంతో రాత్రంతా జాగారం చేయవలసి వచ్చింది. ముంచంగిపుట్టు(అరకులోయ): ఎపిడమిక్‌కు ముందే ఏజెన్సీని వ్యా ధులు చుట్టేస్తున్నాయి. మలేరియా, విషజ్వరాలు, అతిసార లక్షణాలతో ఆదివాసీలు అల్లాడిపోతున్నారు. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ దాబుగూడ గ్రామానికి చెందిన కొర్రా లలిత(25)అనే మహిళ జ్వరం, అతిసార లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై గురువారం రాత్రి మృతి చెందింది. వైద్యసేవలు సక్రమంగా అందకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని బాధితుడు వాపోతుండగా, మెరుగైన వైద్యసేవలు కోసం విశాఖ కేజీహెచ్ తీసుకు వెళ్లమని అంబులెన్స్ సమకూర్చినా వినిపించుకోలేదని వైద్య సిబ్బంది అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొర్రా లలిత జ్వరం, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త కుస్సో ఈ నెల 4న లబ్బూరు పీహెచ్సీకీ తీసుకువచ్చాడు. అక్కడి సిబ్బంది ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి రిఫర్ చేశారు. సీహెచ్‌సీలో వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యసేవలు కోసం ఈ నెల 6న పాడేరు ఏరియా ఆస్పత్రికి తరిలించారు. అక్కడ వైద్యసేవలు అందించినా పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. కేజీహెచ్‌కు వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు లేవని తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లిపోతామని కుస్సో తెలిపాడు. వైద్యసిబ్బంది ఎంత చెప్పిన వినకుండా గురువారం సాయంత్రం ముంచంగిపుట్టు వచ్చేశారు. అప్పటికే రాత్రి 10 గంటలు కావడంతో ఉదయం దాబుగూడ వెళ్లేందుకు అవకాశం లేక మండల కేంద్రంలోనే ఉండిపోయారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో లలిత తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. దీంతో ఏం చేయాలో తెలియక, తమ ఊరికి ఎలా వెళ్లాలో అర్థం కాక మృతదేహంతోనే రాత్రంతా ఎంపీడీవో కార్యాలయ సమీపంలో పుట్టెడు దు:ఖంతో ఉండిపోయారు. ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ బలరాం,సీపీఎం నాయకులు శాస్త్రీబాబు,త్రినాథ్,సోనియన్న,గంగధర్లు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా అందని వైద్యసేవలు : ముంచంగిపుట్టు,పాడేరు ఆరోగ్య కేంద్రాలకు తన భార్యను తీసుకు వెళ్లిన వైద్యసేవలు సక్రమంగా అందించలేదని అందుకే తన భార్య లలిత మృతి చెందిందని భర్త కుస్సో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే కేజీహెచ్‌కు పంపిస్తామని చెబితే వినకుండా ఇంటికి వెళ్లిపోవడంతోనే లలిత చనిపోయిందని పాడేరు వైద్య సిబ్బంది ఫోన్లో మండల స్థాయి అధికారులకు తెలిపారు. స్థానిక నాయకులు పాడేరు ఐటీడీఏ ఉన్నతాధికారులకు సమచారం ఇవ్వడంతో మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై వివరాలను ముంచంగిపుట్టు ఇన్చార్జి ఎస్ఐ రామకృష్ణ సేకరించారు.అనారోగ్యంతో మృతిచెందిన లలిత కుటుంబానికి రూ. పదిలక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పి.శాస్రీబాబు డిమాండ్ చేశారు. -
గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచార కేసు..
సాక్షి, హైదరాబాద్: విశాఖ జిల్లా వాకపల్లిలో గిరిజన మహిళలపై గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారం చేశారన్న ఆరోపణల కేసులో బాధితుల తరఫున వాదించే నిమిత్తం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కోసం ఎంపిక చేసిన న్యాయవాదుల జాబితా గురువారం హైకోర్టుకు అందింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిద్ధం చేసిన జాబితాలో క్రిమినల్ కేసుల విచారణలో బాగా అనుభవం ఉన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, విశాఖలో ప్రాక్టీస్ చేస్తున్న కేవీ రామమూర్తి, డి.శ్రీనివాస్‌రెడ్డి (ఒంగోలు) సుంకర రాజేంద్రప్రసాద్ (విజయవాడ), జీఎం విజయకుమార్ (సికింద్రాబాద్) హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఈ.ఉమామహేశ్వరరావు, వి.సురేంద్రరావుల పేర్లు జాబితాలో ఉన్నాయి. జాబితాను గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. ఏడు పేర్లతో ఉన్న జాబితాలోని వారిని ప్రాధాన్యత క్రమంలో సంప్రదించి వారిలో అంగీకారం తెలిపిన ముగ్గురి పేర్లను తమకు తెలియజేయాలని బాధిత గిరిజన మహిళల తరఫు న్యాయవాది వసుదా నాగరాజ్‌కు ధర్మాసనం సూచన చేసింది. విచారణ శుక్రవారం (నేడు) వాయిదా పడింది. 2007లో కూబింగ్‌కు వచ్చిన గ్రేహౌండ్స్ పోలీసులు తమపై అత్యాచారం చేశారని ఆరోపిస్తూ గిరిజన మహిళలు దాఖలు చేసిన కేసు విశాఖ జిల్లా ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక కేసుల విచారణ కోర్టులో ఉంది. పౌరహక్కుల ఉద్యమ నేత పల్లా త్రినాథరావును తమ తరఫున వాదించేందుకు నియమించాలని బాధితుల అభ్యర్థనను సింగిల్ జడ్జి ఆమోదించారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేయడంతో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం కోసం ధర్మాసనం కసరత్తు చేసే క్రమంలో ఏడుగురి పేర్ల జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమర్పించారు. విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
ఆ చిన్నారులకు ఆమే అమ్మ
ఆత్మకూరు: ఆమె ఓ గిరిజన మహిళ. తల్లిదండ్రులు చేపల విక్రయం చేస్తూ కష్టపడి పిల్లలను పెంచారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు పడిన కష్టాన్ని పరిశీలించిన ఆమె ఉన్నంతలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తగా అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకొని వందలాది మంది చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగేలా కేంద్రంలో శిక్షణ ఇస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పట్టణంలోని మేదరవీధి గిరిజన కాలనీకి చెందిన కొమరగిరి రమణమ్మ. చిన్నారులకు విద్యాబుద్ధులు కొమరగిరి రమణమ్మకు 2002లో అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా ఉద్యోగం వచ్చింది. తాను కష్టపడి చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని కేంద్రానికి వచ్చే చిన్నారులను పూర్తిగా చదువువైపు మళ్లేలా తన వంతు కృషి చేస్తున్నారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ కాలనీలోని గిరిజన చిన్నారులందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఉన్నంతలోనే సౌకర్యాల ఏర్పాటు హిల్ రోడ్డులో అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఉన్నంతలోనే తన సొంత నగదును వెచ్చించి పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు బోధించేందుకు కోవూరులో రూ.మూడు వేలను వెచ్చించి బొమ్మలను కొనుగోలు చేశారు. వీటి ద్వారా పాఠాలను చెప్పడం సులభతరమవడంతో పలువురు ఆమెనే అనుసరిస్తున్నారు. అద్దె గదిలో స్థలం చాలకపోవడంతో వెలుపల తాటాకుల పందిరిని ఏర్పాటు చేయించి ఆరుబయటే పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారు. సమీపంలోని బీసీ కాలనీ, నారాయణరావుపేట అంగన్వాడీ కేంద్రాలను ఈ కేంద్రంలోనే విలీనం చేశారు. దీంతో ఈ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య 54కు చేరుకుంది. అయినా మొక్కవోని దీక్షతో విద్యార్థులందర్నీ పాఠశాలకు అలవాటు చేసి ఓ తల్లిలా వారందర్నీ తీర్చిదిద్దుతున్నారు. ఇసుకలోనే అక్షరాల దిద్దింపు ఇక్కడి చిన్నారులకు రాసుకునేందుకు పలకల్లేవు.. బ్లాక్ బోర్డూ లేదు. దీంతో ఆమె గోడపై నల్లరంగుతో బోర్డును ఏర్పాటు చేయించారు. విద్యార్థులు రాసుకునేందుకు ఒక చిన్న అట్టపెట్టెలో ఇసుకపోసి దానిపై వారితో అక్షరాలు దిద్దిస్తున్నారు. వంట గది చాలకపోవడంతో విద్యార్థుల కోసం ఆహార పదార్థాలను పాత కేంద్రాల్లోనే తయారుచేయించి ఈ కేంద్రానికి తీసుకొచ్చి వడ్డించేలా కృషి చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తమ కేంద్రం పేరును చాటి చెప్పేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. -
అనాథల అమ్మ
నంద్యాలటౌన్: ఆమె గిరిజన మహిళ. చదివింది ఇంటర్. ఆర్థిక, రాజకీయ బలం లేదు. కుటుంబ సభ్యులందరూ కులవృత్తి అయిన బుట్టలు అల్లుకునేవారే. సమాజ సేవ చేయాలన్న తలంపుతో ఆమె స్టార్ సొసైటీ స్థాపించారు. బడి బయట ఉన్న బాల కార్మికులను, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆమె సేవలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అవార్డులు సైతం వరించాయి. అందరిచేత మన్ననలు అందుకుంటున్న ఎరుకలి రాజేశ్వరమ్మ స్ఫూర్తిగాథ ఇదీ.. గోస్పాడు గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ, సుబ్బరాయుడుల రెండో సంతానం రాజేశ్వరమ్మ. వీరికి ఎలాంటి ఆస్తులు లేవు. గుడిసెలో జీవనం. బుట్టలు అల్లుకుని జీవించారు. తలిదండ్రుల రెక్కల కష్టంతో రాజేశ్వరమ్మ ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్ నంద్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. ఆర్థిక కారణాలతో తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో కొన్ని రోజులు ఇంటి వద్దనే ఉంటూ బుట్టలు అల్లేవారు. ఈ సమయంలో సమాజ సేవ చేయాలనే తలంపు వచ్చింది. తనలాంటి పేదలకు సాయం చేయా లనే ఆలోచనతో తన స్నేహితుడైన సుబ్బరాయుడుతో కలిసి స్టార్ సొసైటీని 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ స్టార్ సొసైటీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్చేవారు. రాజేశ్వరి సేవలను గుర్తించిన బాలకార్మిక పునరావాస సంస్థ అధికారులు స్టార్ సొసైటీకి ఎన్సీఎల్పీ కింద ప్రభుత్వ నిధులతో బాల కార్మిక పాఠశాలను మంజూరు చేశారు. ప్రస్తుతం 50 మంది బాలకార్మిక విద్యార్థులతో ఈ పాఠశాల నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే అహోబిలం లో మరో పాఠశాలను 50 విద్యార్థులతో ప్రభు త్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. స్నేహితుడైన సుబ్బరాయుడును 2007లో ఈమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి స్టార్ సొసైటీ సేవలను విస్తరించారు. నిరాశ్రయులకు వసతి గృహం.. నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో 2015లో నిరాశ్రయుల వసతి గృహం ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలందరినీ వసతి గృహంలో చేర్చుకొని వారికి ఉచిత భోజనం, వసతితో పాటు విద్యాబుద్ధులను నేర్పిస్తున్నారు. నంద్యాల డివిజన్లో తప్పిపోయిన పిల్లలు, అనాథ పిల్లలు కనిపిస్తే పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు రాజేశ్వరమ్మకు ఫోన్ చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహిస్తున్న ఈ వసతి గృహం అనతి కాలంలోనే జిల్లాలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ 30మంది ఆశ్రయం పొందుతున్నారు. పురస్కారాలివీ.. ♦ 2010లో ఉత్తమ ఎన్జీఓగా గుర్తింపు ♦ 2011లో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ ♦ 2011లో రాజీవ్ విద్యామిషన్ ద్వారా అవార్డు అందజేత ♦ ఉత్తమ మహిళగా గుర్తించి 2017 మార్చిలో అవార్డు అందజేత ♦ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలుగా నియామకం. సేవలు ఇవీ.. స్టార్ సొసైటీ ద్వారా రాజేశ్వరమ్మ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలో టైలరింగ్ ప్రోగ్రాం కింద 2 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్ విజయమోహన్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలకు డీఆర్డీఏ సహకారంతో ఉచితంగా కుట్టుమిషన్లను ఇప్పించారు. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ప్యాపిలి మండలం పీఆర్‌పల్లె గ్రామంలో వలసల నివారణ ప్రభుత్వం కేంద్రాన్ని స్థాపించగా.. పలువురు విద్యార్థులను రాజేశ్వరమ్మ ఈ కేంద్రంలో చేర్పించి జిల్లా కలెక్టర్ చేత ప్రశంసలు పొందారు. -
ప్రియుడు మోసగించాడని..
రాజవొమ్మంగి (రంపచోడవరం): ప్రియుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన ఓ గిరిజన యువతి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. జడ్డంగి పీహెచ్సీలో చికిత్స పొందుతూ మరణించింది. స్థానిక ఎస్సై వెంకటనాగార్జున కథనం ప్రకారం.. మండలంలోని దోనెలపాలెం గ్రామానికి చెందిన కేదారి శివనాగకుమారి (22) బుధవారం రాత్రి ఇంటి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడి అపస్మారక స్థితికి చేరింది. ఆమెను వెంటనే కుటుంబీకులు జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందన్నారు. పెళ్లికి నిరాకరించడంతో.. శివనాగకుమారి పక్కగ్రామమైన జడ్డంగిలోని వట్టూరి మల్లికార్జునరావు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లికి నిరాకరిస్తున్నాడు. దీంతో పాటు అతడికి మరొకరితో పెళ్లి సంబంధం కుదిరిందని తెలిసి కుమారి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. మల్లికార్జునరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు యువతిని ప్రేమించానని మోసగించి, ఆమె మరణానికి కారణమైన మల్లికార్జునరావుపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
మాగాణికి మహారాణి
ఆమె స్పర్శిస్తే భూమి పులకరించిపోతుంది. పలకరిస్తే చేను పరవశించిపోతుంది. పంట చెప్పినట్టు వింటుంది. పసిడి పంటను చేతికందిస్తుంది. భూమితోనే సహవాసం. భూదేవి అంత సహనం. ఆమె ఇప్పుడు.. ఇంటికే కాదు.. మాగాణికి కూడా మహారాణి. శక్తియుక్తులతో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న ధీశాలి. అలాంటి మగ‘ధీర’ల విజయగాథలకు అక్షర రూపమిది. సాలూరు రూరల్ (పాచిపెంట): కొండకొనలే ఆమె ప్రపంచం. ప్రకృతితోనే సహవాసం. పంట పొలాలతోనే జీవితం. అధిక దిగుబడులు సాధించడంలో అద్భుతమైన నైపుణ్యం. అవే ఆమెను దేశాధ్యక్షుని ప్రశంసలు అందుకునేలా చేశాయి. ఆ ఆదర్శ గిరిజన మహిళా రైతు పాచిపెంట మండలం పణుకువలస గ్రామానికి చెందిన మంచాల పారమ్మ. ప్రయోగాలకు పెట్టింది పేరు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలకు పెట్టింది పేరు పారమ్మ. ఆమె సేంద్రియ ఎరువుల వినియోగానికే అధిక ప్రాధాన్యం ఇస్తుంది. వ్యవసాయాధికారులు చెప్పే సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటించింది. భూమి సారాన్ని బట్టి పంటను సాగు చేస్తూ మెలకువలతో మంచి ఫలితాలు సాధిస్తోంది. పంటల సాగులో ప్రయోగాల వల్లే ఎకరాకు పది క్వింటాళ్లు కూడా రాని రాగులు.. ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడిని సాధించి రైతులందరికి ఎంతో ఆదర్శంగా నిలిచింది. జాతీయ ఉత్తమ రైతు పురస్కారాన్ని అప్పటి రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకుంది. ఓల్డ్ఈజ్ గోల్డ్ అధిక దిగుబడులు సాధించడం వెనుక విజయ రహస్యం ఏమిటని రైతులంతా పారమ్మను ఆసక్తిగా అడుగుతారు. ‘నాకు తెలిసిన పాత విధానాలే అమలు చేస్తున్నాను. వ్యవసాయాధికారులు చెప్పిన సూచనలు, సలహాలను తూచా తప్పకుండా పాటిస్తాను. తోటి రైతులతో కలిసి పొలంలో పనులు చేస్తాను. ఇది ఆరోగ్యానికి మంచిది’.. అని వినయంగా పారమ్మ సమాధానమిస్తుంది. కిచెన్ గార్డెన్లో భాగంగా కూరగాయలను అంగన్వాడీలు, పాఠశాలలకు గతేడాది వరకూ సరఫరా చేసింది. వ్యవసాయంతో పాటు చికెన్మదర్ పౌల్ట్రీ యూనిట్ నిర్వహణ వైపు దృష్టి సారించింది. ధృడమైన సంకల్పం ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధించగలమని చెబుతోంది. శభాష్ ఎల్లమ్మా.. గరుగుబిల్లి: అందరూ పంటలు పండిస్తారు. కానీ మిరియాల ఎల్లమ్మ కాస్త భిన్నం. రసాయనాల జోలికెళ్లదు. సేంద్రియ ఎరువులతోనే సాగు చేస్తోంది. అధిక దిగుబడులతో ఆదర్శంగా నిలుస్తోంది. సంతోషపురం పంచాయతీ ఖడ్గవలస గ్రామానికి చెందిన మిరియాల ఎల్లమ్మకు మూడెకరాల పొలం ఉంది. భర్త గుంపస్వామి, కుమారుడు సహకారంతో ఎకరాలో అరటి పంట, 1.5 ఎకరాల్లో వరి, 0.50ò సెంట్లలో అన్నపూర్ణ పంటల నమూనాలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలు సేద్యం చేస్తున్నారు. ద్రవజీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం తదితర కషాయాలతోనే తెగుళ్లు అదుపు చేస్తోంది. ఎరలు, రంగుపళ్ళాలు వినియోగించి మంచి దిగుబడి సాధిస్తోంది. ఏటా రూ.1.3 లక్షల ఆదాయం కుటుంబంలో ఇద్దరు పనిచేస్తే ఖర్చులు పోను ఏడాదికి రూ.లక్షా 30 వేల వరకు ఆదాయం వస్తుందని ఎల్లమ్మ అంటోంది. జట్టు సంస్థ క్లస్టర్ కో–ఆర్డినేటర్ అన్నపూర్ణమ్మ సూచనల మేరకు మెలకువలు పాటిస్తోంది. -
జగన్ సభకు వెళ్లినందుకు గిరిజన మహిళలపై దాడి
సూళ్లూరుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు వెళ్లినందుకు గిరిజన మహిళలపై ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు దాడిచేసి, గాయపరిచిన ఘటన శుక్రవారం జరిగింది. ఈ మేరకు దాడిలో గాయపడిన మహిళలు స్థానిక ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాల మేరకు.. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత బుధవారం నాయుడుపేటలో జగన్మోహన్రెడ్డి సభ జరిగింది. ఈ సభకు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నారుపోలూరు ఎన్టీఆర్ గిరిజన కాలనీకి చెందిన మహిళలు వెళ్లారు. దీంతో ఈ కాలనీ పక్కనే ఉంటున్న కార్డు అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు కమలకుమారి.. తనకు చెప్పకుండా సభకు ఎందుకు వెళ్లారని గిరిజన మహిళలపై దాడి చేశారు. తన సోదరి, మరో ఇద్దరితో కలిసి తమ ఇళ్లల్లో చొరబడి సాటి ఆడవాళ్లని కూడా చూడకుండా చీరలు, జాకెట్లు చించి రౌడీల్లా దాడిచేశారని బాధిత గిరిజన మహిళలు వాపోయారు. ముందుగా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పెనుబేటి మారెమ్మపై కక్షకట్టి ఆమెపై దాడిచేసి, జుట్టు పట్టుకుని ఈడ్చి కాళ్లతో తన్నారని, అడ్డం వచ్చిన పెరి మేటి అంకమ్మ, అంబూరు రాములమ్మతో పాటు మరో నలుగురు మహిళలపై కూడా దాడిచేసి గాయపరిచారని ఎస్సైకు వివరించారు. జగన్ సభకు ఎవరెవరు వెళ్లారో.. వారికి ఇళ్లే లేకుండా చేసేస్తాన ని కమలకుమారి బెదిరిం చారని పేర్కొన్నారు. ఆమెకు ఆర్థిక, అంగబలం ఉందని, తమను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోందని వాపోయారు. ఆమె ఎప్పుడైనా తమపై దాడి చేయిస్తుందని, తమకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు కోరారు. గిరిజనులు కేసు పెట్టారని తెలిసి కమలకుమారి కూడా గిరిజనులు తనపై దాడికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. -
ఉద్యోగం పేరిట మోసం..
కురుపాం: ఉద్యోగం పేరుతో ఓ గిరిజన మహిళ నుంచి లక్ష రూపాయలు స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రంజిత్‌కుమార్ తన దగ్గర డబ్బులు తీసుకుని నకిలీ ఆర్డరిచ్చి మోసం చేశాడని బాధితురాలు విలేకరులు, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి వద్ద సోమవారం గోడు వెళ్ల్లబోసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మొండెంఖల్‌కు చెందిన పైల రాజేశ్వరి అనే గిరిజన మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రంజిత్‌కుమార్ నమ్మబలికాడు. అయితే ఇందుకు లక్ష రూపాయలు ఖర్చుఅవుతుందని చెప్పడంతో, బాధితురాలు డబ్బును రంజిత్‌కుమార్‌కు అప్పగించింది. దీంతో రాజేశ్వరిని విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో అడెంటర్గా నియమించినట్లు ఆర్డర్ కూడా ఇచ్చేశాడు. వెంటనే రాజేశ్వరి తన కుటుంబాన్ని విజయనగరానికి మార్చేసింది. అలాగే ఆర్డర్ పట్టుకుని జెడ్పీ కార్యాలయానికి వెళ్లగా ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడే అసలు కథ... ఉద్యోగంలో చేరిన రాజేశ్వరికి అధికారులు జీతం ఇవ్వలేదు. ఇలా ఏడు నెలల పాటు ఆమె ఉచితంగానే సేవలందించింది. చివరకు నెల రోజుల కిందట రూ. 15 వేలు ఇచ్చి వెళ్లిపొమ్మన్నారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటూ సదరు కో ఆప్షన్ సభ్యుడు రంజిత్‌కుమార్ వద్దకు వెళ్లి సమస్య వివరించింది. ఉద్యోగం లేనప్పుడు తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని కోరగా ఇదుగో.. అదుగో.. అని చెబుతూ కాలయాపన చేస్తున్నాడు. వాస్తవానికి రాజేశ్వరికి ఇచ్చింది నకిలీ నియామకపత్రం. జెడ్పీలో సక్రమంగా విధులకు హాజరుకాని ఓ ఉద్యోగి స్థానంలో రాజేశ్వరిని తాత్కాలికంగా నియమించారు. ఏడు నెలలు పాటు పనిచేసిన తర్వాత అసలు ఉద్యోగి విధులకు హాజరుకావడంతో రూ. 15 వేలు ఇచ్చి రాజేశ్వరిని తప్పించారు. అటు ఉద్యోగం.. ఇటు డబ్బులు నష్టపోయిన తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. -
భర్త ఇంటి ముందు...భార్య మౌన పోరాటం
♦ గిరిజన మహిళకు మద్దతుగా మహిళ సంఘాలు ♦ తలుపులు వేసి పరారైన అత్తింటి వారు... ♦ చర్చించిన ఎస్ఐ ♦ కాపురానికి తీసుకెళ్లే వరకు ఆందోళన కొనసాగిస్తా... శృంగవరపుకోట రూరల్: తనను కులాంతర వివాహం చేసుకున్న భర్త కాపురానికి తీసుకువెళ్లాలని గిరిజన మహిళ కాకి సుదీప(20) భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. తనకు మద్దతుగా వచ్చిన కరకవానిజోరు, రాయవానిపాలెం, అడ్డతీగ, డెప్పూరు తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మతో కలిసి జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వెల్లడించింది. రాయవానిపాలెం గ్రామానికి చెందిన తనను ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు గౌరీపురం గ్రామానికి చెందిన చల్లా శంకరరావు ప్రేమించాడని తెలిపింది. ఏడాది పాటు ప్రేమించుకున్న తాము పెద్దల అంగీకారంతోనే గత ఏడాది మార్చి 5వ తేదీన రాయవానిపాలెం చర్చిలో, 6న ఎస్.కోట దారగంగమ్మ ఆలయంలో తమ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని పేర్కొంది. అదే నెల 7న స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోగా ఇక్కడకు తమ అత్తమామలు హాజరు కాలేదని సుదీప చెప్పింది. అనంతరం హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న తన భర్త శంకరరావు అక్కడకు తీసుకువెళ్లి ఒక హాస్టల్లో ఉంచాడని, అక్కడకు వస్తూపోతూ...తనుంటున్న గదికి కూడా తీసుకువెళ్లేవాడని చెప్పింది. దీనిపై ప్రశ్నించగా నా ఇష్టం అంటూ...తానేమి చేసినా అడ్డు చెప్పనంటూ లేఖ రాసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. దీన్ని తాను వ్యతిరేకించడంతో వేధింపులు ప్రారంభించాడని ఆరోపించింది. నిద్రమాత్రలు మింగా.. నా భర్త శంకరరావు పెట్టే వేధింపులు భరించలేక..మా అమ్మకు విషయాలు చెప్పలేక తీవ్ర మనోవేదనతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించానని, చుట్టు పక్కల వారు ఆసుపత్రికి తీసుకువెళ్లి బతికించారని సుదీప చెప్పింది. దీనిపై తన భర్త ఈ పనేదో మీ కన్నవారింటి దగ్గర చేయాలని వేధించాడని తెలిపింది. హైదరాబాద్‌లో ఉండగా తనకు అబార్షన్ మాత్రలు కూడా వేయించాడని చెప్పింది. విషయం నా తల్లికి తెలిసి పెద్ద మనుషుల సమక్షంలో విషయం పెట్టారని హాస్టల్లోనే ఉంచాలని సూచించడంతో అక్కడే ఉన్నానని పేర్కొంది. తరువాత వేధింపులు భరించలేక విశాఖలోని అక్క దగ్గరకు వచ్చి ఉన్నానని డబ్బులు కావాలంటే చిరాకు పడేవాడని రోదిస్తూ చెప్పింది. అత్తవారింటికి గౌరీపురం వెళ్తానంటే చంపుతానని బెదిరించేవాడని, దీంతో కన్నవారింటికి వచ్చేశానని తెలిపింది. కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాటం.. తనను కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాడతానంటూ సుదీప అత్తింటి ముందు మౌన పోరాటానికి కూర్చోవటం, ఆమెకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మ గౌరీపురం చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారమందుకున్న ఎస్.ఐ ఎ.నరేష్, పోలీసు సిబ్బంది గౌరీపురం చేరుకుని మహిళలతో చర్చించారు. ఎస్.ఐ నరేష్ సూచన మేరకు మౌన పోరాటానికి దిగిన గిరిజన మహిళ సుదీప, ఆమె తల్లి దేముడమ్మ, మహిళా మండలి సభ్యులు పోలీసు స్టేషన్‌కు తరలివెళ్లారు. -
గిరిజన యువతిపై పోలీస్ వేధింపులు
– మానవహక్కుల కమిషన్‌కు బాధితురాలి ఫిర్యాదు కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): డోన్ పట్టణం శ్రీరామ థియేటర్ వద్ద తోపుడు బండిపై వ్యాపారం చేసుకునే గిరిజన మహిళ సుజాత పై పోలీసుల వేధింపులు అధికమయ్యాయి. గత శుక్రవారం రాత్రి రౌండ్స్‌కు వచ్చిన ఓ పోలీసు అధికారి.. గిరిజన మహిళను కులంపేరుతో దూషిస్తూ నానా దుర్భాషలాడటంతో బాధితురాలు, ఆమె భర్త శనివారం విలేకరులకు వివరాలు తెలిపారు.. గత ఏడాది వినాయక చవితి రోజున తోపుడు బండల వ్యాపారుల మధ్య వివాదం చోటుచేసుకొని ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాజు అనే వ్యాపారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. అంతేగాకుండా తమను పోలీసులు వేధిస్తుండడంతో గత ఏడాది డిసెంబర్లో జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణతో పాటు, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గత నెల 25వ తేదీన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నేపథ్యంలో వేధింపులు మరింత ఎక్కువవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై డోన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాత్రి 10గంటలు దాటినా వ్యాపారం చేస్తుడడం, అదీ వైన్‌షాపుల పక్కనే తోపుడు బండి ఉండడంతో మందలించామన్నారు. ఎవరినీ కులం పేరుతో దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. -
మహిళపై అత్యాచారయత్నం
ఎల్ తాండ (వెల్దుర్తి రూరల్): పొలం వద్ద ఒంటరిగా ఉన్న గిరిజన మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్ తండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. పొలం వద్ద పనులు చేసుకుంటున్న మహిళపై పశులు మేపేందుకు వెళ్లిన ఎల్నగరం గ్రామానికి చెందిన హరిజన జమ్ములు అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించగా గొడ్డలితో దాడి చేశాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడి తమ్ముడు కిట్టు కూడా అతని సహకరించాడు. వారి నుంచి తప్పించుకుని గ్రామానికి చేరుకున్న మహిళ తన తమ్ముడి సహాయంతో వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. మహిళ కాలికి తీవ్రం కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. -
వైఎస్ హయాంలోనే మంచిగా ఉండె
మంత్రి రామన్నతో గిరిజన మహిళ దేవరకొండ: వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో రెండొందల పెన్షనొచ్చినా.. మంచిగా ఉండె.. వంద రూపాయలిస్తే సంచి నిండా సరుకులొచ్చేరుు. ఇప్పుడు ధరలన్నీ పెరిగి నయ్.. సరుకులు రావడం లేదు.. కూలీ రేట్లు పెరగలేదు. ఎట్ల బతకాలె? అని చం దంపేట మండలం పోలేపల్లి వన నర్సరీని పరిశీలించేందుకు వచ్చిన మంత్రి జోగు రామన్నను అక్కడ కూలీ రమావత్ నాన్కి నిలదీశారు. మంత్రి కూలీల యోగక్షే మాలను తెలుసుకుంటుండగా అప్పుడు పెన్షన్ రెండొందలొచ్చినా సరిపోయేవి.. ఇప్పుడు వెయ్యొచ్చినా సరిపోవట్లే అని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్నవారు ఆ మహిళను వారించబోయారు. మంత్రి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
శవంతో 5 రోజులు ఒంటరిగా గడిపింది!
కోల్‌కతా: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని గిరిజన మహిళ ఐదు రోజులు ఇంట్లో ఒంటరిగా గడిపిన ఘటన పశ్చిమ బెంగాల్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. బరద్వాన్ జిల్లాలోని ముక్తర్ఫార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో, ఏదో జరిగిందన్న అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహంతో మహిళ ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకోవడం ఇక్కడి గిరిజనుల ఆచారమని చెబుతున్నారు. మృతి చెందిన వ్యక్తిని పాంచు సొరేన్గా గుర్తించామని, నాలుగైదు రోజుల క్రితమే అతడు చనిపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి తన సోదరి అస్తిపంజరం రెండు నెలలు గడిపిన ఘటన గతేడాది జూన్ లో వెలుగు చూసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
అయ్యో...శ్రీలత
* గిరిజన యువతి బ్రెయిన్‌డెడ్ * పేద కుటుంబానికి పెద్ద కష్టం చీడికాడ : కోర్టులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు టెస్ట్‌కు హాజరు కావాలని లేఖ అందింది. ఉద్యోగం వస్తే కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. ఈ నెల 31న పరీక్షకు హాజరు కావలసి ఉంది. అంతలోనే ఆమెను మృత్యువు కబళించింది. ఉద్యోగం చేసి అమ్మానాన్నల కష్టం తీరుద్దామని ఆ యువతి ఆ కోరిక తీరకుండానే కాల్‌లెటర్ వచ్చిన రోజే అకస్మాత్తుగా అపస్మారకస్థితికి చేరుకుంది. ఆ యువతి పెదనాన్న వంతంగి పేరయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి మండలం పెదగంగవరానికి చెందిన అల్లం బుచ్చిబాబు,అతని భార్యమహాలక్ష్మీ ఇద్దరు పిల్లలతో చీడికాడ మండలం కొండ్లకొత్తూరులోని అత్తవారింట్లో ఉండేవారు. గ్రామంలో పూట గడవక బుచ్చిబాబు కుటుంబాన్ని తీసుకుని కొత్తగాజువాకలో ఉంటూ పోర్టులో రోజుకూలిగా పనిచేస్తున్నాడు. బుచ్చిబాబు పెద్దకుమార్తే శ్రీలత(20) ఇంటర్,ఐటీఐ పూర్తి చేసింది. గురువారం ఉదయం 8గంటల సమయంలో పాలుతాగుతూ శ్రీలత ఆకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చెసిన వైద్యులు శ్రీలతకు బ్రెయిన్‌డెడ్ అయిందని చెప్పారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. శ్రీలత మృతి వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. జిల్లాకోర్టులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు ఈనెల 31న టెస్ట్‌కు అటెండుకావాలని గురువారం ఉదయమే కాల్‌లెటర్ అందింది. ఆ ఆనందంలో ఉండగానే మృత్యువు ఆమెను కబళించింది. -
మలుపు తిరగనున్న సుశీల హత్య కేసు
♦ పథకం ప్రకారమే..? ♦ ఒక్కడే నిందితుడని చేతులు దులుపుకున్న పోలీసులు ♦ తాజాగా వెలుగులోకి సరికొత్త అంశం పుల్కల్: గిరిజన మహిళ హత్య కేసు మరో మలుపు తిరగనుంది. ఇప్పటికే పోలీసులు గిరిజన మహిళను హత్య చేసింది ఒక్కరే అని నిర్ధారించి కోర్టుకు సైతం రిమాండ్ చేశారు. తీరా బుధవారం మృతురాలికి సంబంధించిన టిఫిన్ బాక్సుతోపాటు ఇతర సామగ్రి, అక్కడే హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న యాక్సర్ బ్లేడు లభించడంతో ఈ కేసు కొత్త మలుపు తిరగనుంది. ఇప్పటికే హత్యకు గురైన మహిళ వివాహేతర సంబంధం పెట్టుకున్న బస్వాపూర్‌కు చెందిన వెండికోల్ రాజు జూన్ 1న రాత్రి ఆమెతో గడపాలనుకున్నాడు. కానీ ఆమె నిరాకరించినందు వల్లే కరెంటు వైరుతో గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు ధృవీకరించారు. కానీ గురువారం లభించిన యాక్సర్ బ్లేడును పరిశీలించినట్లయితే ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే లభించిన బీరు బాటిళ్లను పరిశీలిస్తే రాజుతోపాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి హత్యకు గురైన సుశీల టిఫిన్ బాక్సుతోపాటు బీరు బాటిళ్లు లభించడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. నిందితుడు రాజు వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే... తనకు సహకరించనందునే మహిళను హత మార్చినట్లుగా వెల్లడించడానికి, సంఘటన స్థలంలో లభించిన వాటిని పరిశీలిస్తే ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. దీంతో సుశీలను హత్య చేసింది రాజు ఒక్కడేనా? మరి ఇంకెవరితో అయినా కలిసి చేశాడా? అనే దానిపై విచారణ జరిపితే అసలు నిందితులు బయటపడే అవకాశముంది. ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్న యాక్సర్ బ్లేడు, సుశీలకు సంబంధించిన క్లిప్పులు, టిఫిన్ బాక్సు లభించడాన్ని చూస్తే ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. హతురాలు సుశీల మెడ పైన స్వల్ప గాయమున్నా, గొంతు మాత్రం పూర్తిగా తెగిపోవడాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం లభించిన యాక్సర్ బ్లేడుతోనే కోసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఏమైనా సుశీల హత్యలో గోపాల్‌తోపాటు మరికొంత మంది హస్తం ఉందని తెలుస్తోంది. -
గిరిజన మహిళ దారుణ హత్య
నాగులపల్లిలో ఘటన నర్సాపూర్ రూరల్: ఓ గిరిజన మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నాగులపల్లి వద్ద చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగులపల్లి పంచాయతీ పరిధి తౌర్యా గిరిజన తండాకు చెందిన మెగావత్ విఠల్ భార్య మెగావత్ తార (48) తన కూతురు బుజ్జీ ఇటీవలే కవలల పిల్లలకు జన్మనిచ్చింది. కూతురి కోసం నాగులపల్లిలోని అంగన్వాడి కేంద్రంలో పాలు, గుడ్లు తీసుకునేందుకు శనివారం ఉదయం వచ్చింది. అంగన్వాడీ కేంద్రం నుంచి పాలు, గుడ్లు తీసుకొని నాగులపల్లి పాఠశాల సమీపంలో కర్నాలకుంట శిఖం పక్క నుంచి ఉన్న దారి వెంట వెళ్తుండగా దుండగులు దారికాచి ఆమెను కుంటలో ఉన్న జేసీబీ గుంతలోకి లాక్కెళ్లి కల్లుసీసాతో హత్యచేసినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలిసింది. పాఠశాలకు సమీపంలో కర్నాల కుంట ఉండడంతో నాగులపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు మూత్రవిసర్జకు వెళ్లారు. కుంటలో మహిళ పడి ఉండడం చూసి వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు, గ్రామస్తులకు తెలిపారు. సర్పంచ్ నాగశ్రీజీవన్రెడ్డి నుంచి సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటపతిరాజు, సీఐ తిరుపతిరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కల్లుసీసాతో గొంతు, పలుచోట్ల కిరాతకంగా పొడిచి హత్యచేసినట్టు గుర్తించారు. శవాన్ని నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రి మర్చూరీకి తరలించారు. మృతురాలి భర్త విఠల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని హంతకులకోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే హత్య జరగడంతో నాగులపల్లితోపాటు తౌర్యతండా గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. మృతురాలికి ఒకే ఒక కూతురు.. మెగావత్ తార, విఠల్ దంపతులకు ఒకే ఒక కూతురు బుజ్జీ. ఆమెను తండాకు చెందిన జగదీష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఇటీవల బుజ్జీ ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. అత్త తార, మామ విఠల్‌కు సంబంధించిన ఆస్తి కోసమె అల్లుడు జగదీష్ అత్తను హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం అదే కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. -
ఏదీ న్యాయం.!
► గిరిజన యువతిని మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న యువకుడు ► న్యాయం కోసం పోలీస్ సేషన్ల చుట్టూ కాళ్లరిగేలా ► తిరుగుతున్న బాధితురాలు సాక్షి, విశాఖపట్నం : ‘పట్టుకుంటామమ్మా... తొందరపడితే ఎలా... వాడు పారిపోయాడు... నీకేమైనా వాడి ఆచూకీ తెలిస్తే చెప్పు వెళ్లి తీసుకు వస్తాం...’ ఇవీ ఒక యువకుడి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయిన గిరిజన యువతితో బాధ్యత గల పోలీసులు అంటున్న మాటలు. నేను అనాథనని, తనకు ఎవరూ తోడు లేరని, మిమ్మల్నే నమ్ముకున్నానని ఆ యువతి ఎంతగా ప్రాధేయపడుతున్నా ఖాకీల్లో కదలిక రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే... విశాఖ ఏజెన్సీ నర్సీపట్నం ప్రాంతం నుంచి నగరానికి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న మధులత అనే యువతి తనతో పాటు పనిచేసే నారాయణరావు తనను ప్రేమించి వంచించాడని కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆమె పోలీసులను ఆశ్రయించి పదిహేను రోజులు కావస్తున్నా ఇంత వరకూ నిందితుడిని పట్టుకోలేదు సరి కదా కనీసం ఆ అభాగ్యురాలికి భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు. అనాథ గిరిజన యువతికి ఇలాంటి కష్టం వచ్చిందని తెలిసినా ఇంత వరకూ ఏ మహిళా సంఘాలూ ఆమె తరఫున నిలబడి న్యాయం కోసం పోరాడేందుకు ముందుకు రాలేదు. గిరిజన సంఘాల నేతలు వచ్చి ఒకటి రెండు సార్లు పోలీసు అధికారులను కలవడం తప్ప ఇంత వరకూ పెద్దగా ఉద్యమించింది లేదు. ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం జరగదని, విసిగి వేసారిపోయిన బాధితురాలు ఆత్మహత్యే శరణ్యమంటూ రోధిస్తోంది. ఈ విషయాన్ని ఏసీపీ బి.మోహన్‌రావు వద్ద ప్రస్తావించగా గిరిజన యువతి మధులత కేసులో విచారణ పూర్తయిందని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని తండ్రిని విచారించామని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఆత్మహత్యే శరణ్యం ‘‘పోలీసులంటే ఎంతో నమ్మకం. వాళ్ల దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకున్నాను. కానీ ఇన్ని రోజులైనా ఆ దుర్మార్గుడిని పట్టుకోలేదు. ఇప్పటికే చాలా సార్లు ఏసీపీ సర్ని కలిశాను. వైద్య పరీక్షల కోసం మూడు రోజులు కేజీహెచ్‌లో ఉంచారు. రోజూ నన్ను స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు తప్ప అతనిపై చర్యలు తీసుకోవడం లేదు. అడిగితే పారిపోయాడంటున్నారు. నీకు టచ్‌లోకి వస్తే మాకు చెప్పు అంటున్నారు. నన్ను మోసం చేసి పోయిన వ్యక్తిని ఎవరూ లేని నేను ఎలా వెతికి తేగలను. ఇప్పటికే జరిగిన అనర్థానికి కుమిలిపోతున్నాను. న్యాయయం జరగకపోతే చచ్చిపోతాను.’- మధులత, బాధితురాలు -
గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి
మెంటాడ: భర్తను కూలి పనుల కోసం పంపించేందుకు వెళ్లి తిరిగి ఇంటికెళ్తున్న గిరిజన మహిళపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు, గ్రామపెద్దలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలంలోని కొండలింగాలవలస పంచాయతీ మూలపాడు గిరిజన గ్రామానికి చెందిన మహిళ(28) తన భర్త కూలి పనికోసం వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఆయన్ను పంపించేందుకు బుధవారం రాత్రి ఆండ్రకు వచ్చింది. భర్త బయలుదేరాక నిత్యావసర సరుకులు, పిల్లలకు మిఠాయిలు కొని తిరిగి మూలపాడు వెళ్తుండగా ఆండ్రకు చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి ఆండ్ర ఎస్టీ కాలనీ నీటి ట్యాంకు సమీపంలోకి మహిళను ఎత్తుకుపోయారు. అక్కడ నోట్లో గుడ్డ కుక్కి లైంగికదాడికి పాల్పడ్డారు. కొంతసేపటికి తెలివిరావడంతో కేకలు వేయగా సమీపంలో ఉన్న జి.బాషా, టి.పైడితల్లితో పాటు పలువురు మహిళలు వచ్చి దుస్తులు అందించి నీరు తాగించారు. శరీరమంతా గాయాలై కదల్లేని పరిస్థతిలో ఉన్న ఆమె రాత్రంతా ఆండ్రలోనే ఉండిపోయి గురువారం ఉదయం మూలపాడు వెళ్లి కులపెద్దలకు విషయాన్ని చెప్పింది. గ్రామపెద్దలతో కలిసి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆండ్ర పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. భర్త తనకు ఇచ్చిన రూ.5 వేలను కూడా యువకులు లాక్కున్నారని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నలుగురు వ్యక్తుల్లో ఎలుసూరి ఆది, సవరవిల్లి శంకరరావును గుర్తించానని, మిగతా ఇద్దరిని గుర్తించలేకపోయానని తెలిపింది. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజపతినగరం సీఐ కె.కె.వి.విజయ్‌నాథ్ తెలిపారు. -
ఈ అభాగ్యురాలెవరో?
► దిక్కుతోచని స్థితిలో గర్భిణి కాకినాడ క్రైం : ఓ అమాయక గిరిజన యువతి తనకు ఎవరూ లేరంటూ కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెగర్భిణికావడం, సహాయకులు ఎవరూ లేకపోవడంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. తన పేరు పార్వతి అని, తమది కొత్తపల్లి అని మాత్రమే ఆ యువతి చెబుతోంది. మరే ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడంతో ఆమె వివరాలు తెలియరాలేదు. వైద్యులు ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసుకోకపోవడంతో అధికారులకు విలేకరులు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు స్పందించి ఆమెను ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు. ఆ యువతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరనే విషయాలు తెలియకపోవడంతో సిబ్బంది సందిగ్ధంలో పడ్డారు. గర్భవతి అయిన ఆ యువతి షాక్‌కు గురై ఉంటుందని, ఎవరో ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసి ఉంటారని పలువురు పేర్కొంటున్నారు. ఆమె గిరిజన యువతి కావడంతో ఐటీడీఏ అధికారులు స్పందించి ఆమెను చేరదీయాలని కోరుతున్నారు. -
గిరిజన వివాహితపై అత్యాచారం
కోవూరు: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కోవూరు మండలం పాటూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఓ గిరిజన వివాహితపై అత్యాచారం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై గుర్తుతెలియని దుండగుడు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్పత్రి ఎదుట పురిటి నొప్పులతో గర్భిణి యాతన
అల్లాదుర్గం: నిండు గర్భిణి ప్రసవం కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అక్కడున్న సిబ్బంది.. ఇంకా టైమ్ ఉండగానే వెళ్లిపోయారు. రాత్రి విధులకు రావాల్సిన సిబ్బంది ఎంతకీ రాలేదు. దీంతో పట్టించుకునే వారెవరూ లేక ఆరోగ్య కేంద్రం ఎదుట రోడ్డుపైనే ఆ గిరిజన మహిళ నరకయాతన అనుభవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీతానగర్ తండాకు చెందిన పడ్త్యా మంజుల బుధవారం సాయంత్రం ప్రసవం నిమిత్తం అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అప్పటికి విధుల్లో ఉన్న సిబ్బంది ఇంకా సమయం ఉండగానే వెళ్లిపోయారు. నైట్ డ్యూటీకి ఎవరూ హాజరు కాలేదు. ఒకపక్క ఆరోగ్య కేంద్రంలో ఎవరూ పట్టించుకోకపోవడం, మరోపక్క నొప్పులు తీవ్రం కావడంతో మంజుల రోడ్డుపైనే అవస్థలు పడింది. చివరకు 108 వాహనంలో ఆమెను జోగిపేట ఆస్పత్రికి తరలించారు. -
గురి తప్పని చికిత్స
విశాఖ మెడికల్: గిరిజన మహిళ కంటి నుంచి మెదడులోకి గుచ్చుకున్న బాణాన్ని కేజీహెచ్ న్యూరో సర్జరీ, ప్రాంతీయ కంటి ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. చూపు తీసుకురాడానికి విఫలయత్నం చేశారు. ఈనెల 12 కేజీహెచ్ అత్యవసర ఆపరేషన్థియేటర్లో జరిగిన క్లిష్టమైన శస్త్ర చికిత్సను ఏకకాలంలో న్యూరోసర్జరీ, కంటి వైద్యులు నిర్వహించారు. జీకేవీధి మండలం లంకపాకల గ్రామానికి చెందిన 40ఏళ్ల జి.సుభద్రపై భర్త తాగిన మైకంతో ఈనెల 11న బాణంతో దాడి చేశాడు. బాణం ఆమె కుడికంటిలోంచి మెదడులోని టెంపోరల్ లోబ్లోకి చొచ్చుకుపోయింది. గుచ్చుకున్న బాణాన్ని తీసే క్రమంలో బాణం నుంచి పుల్ల వేరుకావడంతో అదే రోజు ఆమెను జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం 12వ తేదీ సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆమెకు ఎక్స్‌రే, సీటీస్కాన్లు నిర్వహించిన అనంతరం అత్యవసర ప్రాతిపదికన రెండు గంటలు శ్రమించి మెదడులోకి చొచ్చుకుపోయిన బాణాన్ని ప్రాణహాని లేకుండా బయటకు తీశామన్నారు. ఈ శస్త్రచికిత్సను న్యూరోసర్జరీ విభాగాధిపతి కె.సత్యవరప్రసాద్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింహరావు ఆధ్వర్యంలో వైద్యులు నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం.మదుసూదనబాబు తెలిపారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. -
'గిరిజన మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నా'
విశాఖ: తాను గిరిజన మహిళగా పుట్టినందుకు గర్వపడుతున్నాని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. పాడేరు గురుకులం కాలేజీలో ఆదివారం ఆదివాసి దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఆమె.. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అధికారులు, విద్యార్థులదేనన్నారు. గిరిజన మహిళగా పుట్టినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. ఆదివాసి దినోత్సవాన్ని ప్రతీ కార్యాలయల్లో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. -
గిరిజన యువతి కిడ్నాప్, గ్యాంగ్ రేప్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఓ గిరిజన యువతిని దుండుగులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి బీర్బుం జిల్లాలోని తంతిపరలో ఓ వివాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా 6 నుంచి 8 మంది తనను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు పోలీసు అధికారులు తెలిపారు. -
గిరిజన మహిళపై అత్యాచారం
దారుణానికి ఒడిగట్టిన యువకుడు పాడేరు: గిరిజన మహిళపై ఓ వ్యక్తి దారుణంగా దాడిచేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు .. విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం కుమడ గ్రామానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్లుగా పాడేరులో ఉంటోంది. ఇటీవల భర్తతో తగాదాపడి ఒంటరిగా ఉంటోంది. పాడేరుకు చెందిన క్షత్రి నరేష్ అనే వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ వేధించేవాడు. ఈనెల 12న ఇంటిలోకి చొరబడి ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. బెల్ట్, ఇనుపరాడ్‌తో కొట్టాడు. తీవ్ర గాయాలతో స్ఫృహ తప్పిపడిపోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరునాడు ఉదయం మెలకువ వచ్చిన ఆమె బంధువులకు విషయం తెలిపింది. పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు నరేష్‌ను కోరగా కులదూషణకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడ్ని అదుపులో తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. నిందితునిపై నిర్భయ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. -
ఇదీ ఫ్యాషనే..
ఆదిలాబాద్: ఆధునిక తరం ఫ్యాషన్ పేరిట చిత్రవిచిత్రమైన ఉంగరాలను ధరించడం మనం చూస్తునే ఉన్నాం.. ఈ గిరిజనురాలు చూడండి.. పాత రూపాయి నాణేలనే ఉంగరాలుగా మార్చుకుని.. తనదైన ఫ్యాషన్‌ను ప్రదర్శిస్తోంది. ఆదిలాబాద్ మండలం ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోతగూడలో ఈ మహిళ ధరించిన ఉంగరాలను అందరూ చిత్రంగా చూశారు. పోతగూడలో మంత్రి జోగు రామన్న సభకు వచ్చిన ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. -
గిరిజన మహిళ దారుణ హత్య
విజయనగరం: కుటుంబ కలహాలతో ఒక యువకుడు గిరిజన మహిళపై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన బుధవారం విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గరిశెగుడ్డి గ్రామ పంచాయతీ పరిధిలోని శిముడివలస గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మెరకమ్మ(50)కు అదే గ్రామానికి చెందిన ఆమె మరిది కొడుకు లక్ష్మయ్య కుటుంబంతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన గొడవ సందర్భంగా లక్ష్మయ్య, మెరకమ్మపై గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించాడు. కాగా, పోలీసులు సీఎం బహిరంగసభలో ఉండటం, ఏజెన్సీ ప్రాంతం కావడంతో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టేలా ఉందని సమాచారం. (పాచిపెంట) -
అమెరికాలో పైలట్ శిక్షణకు ఎంపికైన గిరిజన మహిళ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో పైలట్ శిక్షణకు తెలంగాణ నుంచి ఎంపికైన గిరిజన యువతి అజ్మీరా బాబీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రూ.28 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన అజ్మీరా బాబీ ఫ్లోరిడాలోని డీన్ ఇం టర్నేషన్ ఫ్లైయింగ్ స్కూల్లో కమర్షియల్ పైలట్ ట్రైనిం గ్ కోర్సుకు ఎంపికైంది. ఆర్థికంగా ఇబ్బందులుండటంతో.. ఈ కోర్సు పూర్తి చేసేందుకు సాయం చేయాలని సీఎంను ఆశ్రయించగా.. ట్యూషన్ ఫీజుకు రూ. 21.21 లక్షలు, వసతి సదుపాయాలు, మిగతా ఖర్చులకు రూ.6.89 లక్షలు మం జూరు చేశారు. ఇటీవలే పైలట్ శిక్షణ పొందేందుకు పాతబస్తీకి చెందిన సయిదా సల్వా ఫాతిమాకు రూ.35.50 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
టమాటా.. చిలుక
ఫై ఫొటో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులా కన్పిస్తుంది కదూ. ఇది సహజ సిద్ధంగా కాసిన టమాట. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం కోమటికుంటకు చెందిన గిరిజన మహిళ తన తోటలో కాసిన టమాటాలను తెచ్చి మంగళవారం సూర్యాపేట కొత్తబస్టాండ్ సమీపంలో విక్రయించింది. వసుకుల శ్రీనివాస్ కొనుగోలు చేసిన టమాటాల్లో ఒకటి ఇలా చిలుక ఆకారంలో కనిపించింది. - సూర్యాపేట -
ఆదుకోవాలని గిరిజన యువతి వేడుకోలు
రాజవొమ్మంగి : తండ్రిని కోల్పోయి.. దిక్కు లేకుండా బతుకీడుస్తున్న తనను ఆదుకోవాలని రాజవొమ్మంగి మండలం గొబ్బిలమడుగు గ్రామానికి చెందిన ఆదివాసీ(పీటీజీ) యువతి శ్యామల అధికారులను విజ్ఞప్తి చేసింది. 1993 అక్టోబర్‌లో నక్సలైట్ల తుపాకీ గుళ్లకు తన తండ్రి మరణించాడని, అప్పటికి తన వయసు కేవలం రెండు నెలలని పేర్కొంది. తల్లి మరో వివాహం చేసుకుని వెళ్లిపోవడంతో పెద తండ్రి వద్ద పెరిగానని, పదో తరగతి వరకు చదువుకున్నట్టు తెలిపింది. తన తండ్రి చనిపోవడంపై జెడ్డంగి పోలీసు స్టేషన్లో క్రైం నంబర్ 12/93గా నమోదైందని తెలిపింది. చార్జ్‌షీట్ 22-6-95గా నమోదైనట్టు వివరించింది. గతంలో తనకు కొంత ఆర్థికసాయం అందగా, దానిని తల్లి తీసుకుందని పేర్కొంది. ప్రభుత్వం తనలాంటి వారిని ఆర్థికంగా ఆదుకుంటోందని, చదువుకున్న వారికి ఉద్యోగం ఇస్తోందని తెలిసి తన ఇబ్బందులను వెల్లడి స్తున్నట్టు మంగళవారం విలేకరులకు తెలిపింది. ఈ విషయాన్ని సీఐ రాంబాబు దృష్టికి తీసుకువెళ్లగా, పాత రికార్డులను పరిశీలించి, అవకాశం ఉంటే ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తానని హామీ ఇచ్చారు. -
వైద్యశాఖ వింత వైఖరి
నాయుడుపేట: మండల పరిధిలోని పుదూరు పంచాయతీ కుప్పరగుంట గిరిజన మహిళ మాధవి సరైన పౌష్టికాహారం, వైద్యం అందక మృతి చెందిన ఘటనలో చిరుద్యోగిపై వైద్యశాఖ బుధవారం వేటు వేసింది. అయితే అసలు బాధ్యులపై ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భిణి అయిన మాధవి మృతి చెందడంపై ‘హంతకులెవరు’ శీర్షికన కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ కథనంపై స్పందించిన జిల్లా వైద్యాశాఖాధికారి కోటేశ్వరమ్మ నాయుడుపేట ప్రభుత్వాస్పత్రి తోటిని విధుల నుంచి తొలగించాలని సంబంధిత క్లస్టర్ అధికారి డాక్టర్ సాయిబాబాను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ ఆస్పత్రి అధికారులకు నివేదించాలని సూచించారు. నివేదిక అనంతరం పూర్తి విచారణ చేపడతామని ఆమె వివరించారని తెలిసింది. స్థానిక వైద్యారోగ్యశాఖాధికారులు చేసిన తప్పిదాలతో పాటు ప్రభుత్వాస్పత్రుల్లో నిర్లక్షంగా వ్యవహరించిన తీరుపై ఆమె చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.గర్భిణికి రక్తం లేకపోవడం వల్లే మృతి చెంది ఉంటుందని డాక్టర్ కోటేశ్వరమ్మ అన్నారు. గర్భిణి మృతికి అసలు కారకులను విడిచి చిరుద్యోగిపై చర్యలు తీసుకోవడం వింతగా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. కుప్పరగుంటలో విచారణ.. మండలంలోని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమాదేవి బుధవారం కుప్పరగుంట గిరిజన కాలనీలో విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సరుకులను పరిశీలించారు. సక్రమంగా అందరికీ పౌష్టికాహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు. అలాగే వైద్యశాఖ సిబ్బంది తూతూ మంత్రంగా విచారణ చేపట్టింది. -
వివాహిత పై సామూహిక అత్యాచారం
-
గిరిజన మహిళపై భర్త సహా పదిమంది అత్యాచారం
ఖండ్వా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన జరిగింది. ఓ గిరిజన మహిళపై భర్తతో పాటు పది మంది అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖండ్వా జిల్లా పిప్లాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిలాయ్ ఖేడా గ్రామంలో ఆస్తి తగదాల వల్ల ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. భర్త ప్రోద్బలంతో బంధువులు, ఇతర గ్రామస్తులు పదిమంది కలసి కత్తులతో ఆయన భార్యపై దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి మూత్రం మూత్రం తాగాలని బెదిరించారు. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరినీ అరెస్ట్ చేశారు. బంధువలు ఆమెను చికిత్స నిమిత్తం ఖండ్వా జిల్లా ఆసుపత్రికి తరలించారు. -
తుదిశ్వాస వరకు జగనన్న వెంటే..వంతల రాజేశ్వరి
రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రంపచోడవరం, న్యూస్‌లైన్ : మారుమూల ప్రాంతానికి చెందిన నిరుపేద గిరిజన మహిళ నైన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి శాసనసభకు వెళ్లేందుకు అవకాశం కల్పించిన జగనన్న వెంటే నా తుది శ్వాస వరకూ ఉంటానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. గిరిజనులపై తరగని ప్రేమాభిమానాలను జగనన్న చూపించారన్నారు. మండలంలోని వాడపల్లి సర్పంచ్ కోసు వెంకటరమణ వివాహానికి ఎమ్మెల్యే రాజేశ్వరి, రంపచోడవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) సోమవారం హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వారి స్వార్థం కోసం ఇద్దరు ఎంపీలు పార్టీని విడిచి వెళ్లినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అనంతరం గ్రామంలో గిరిజనులను కలసి ఎన్నికల్లో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కొంత మంది గిరిజనులు చెప్పిన సమస్యలను విన్నారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఎంపీటీసీ సభ్యురాలు కారుకోడి పూజ, కాంతం, నాయకులు కాపారపు రూతూ, రామాంజనేయులు, సీహెచ్ రాజు, నాగు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్
సూరి(పశ్చిమబెంగాల్): వేరే వర్గానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న కారణంతో 20 ఏళ్ల గిరిజన యువతిపై 13 మంది సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బిర్భుమ్ జిల్లాలోని లభ్పూర్లో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. 13 మంది నిందితులను, ఆ యువతితో సన్నిహితంగా ఉండే యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి ప్రస్తుతం సూరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. తమ కూతురికి వేరే వర్గానికి చెందినవాడితో సంబంధం ఉందని తమ వర్గానికి చెందినవారే పంచాయితీ పెట్టి ఈ శిక్ష విధించారని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'బాబుకు.. ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు'
విజయనగరం: రెండు కళ్ల సిద్దాంతాన్ని నమ్ముకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్ సీపీ నేత సుజయ్‌కృష్ణరంగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని మక్కువలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్మత్స, సుజయకృష్ణరంగారావు, రాజన్నదొరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేత సుజయ్‌కృష్ణరంగారావు మాట్లాడుతూ.. ఓట్లు, సీట్ల కోసం రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. ఈ సమైక్య శంఖారావం కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. -
గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం
నల్గొండ: కీచకుల సంతతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అత్యాచార ఘటనలు ఆగడం లేదు. నిర్భయ చట్టాలు తెచ్చినా కీచకుల అకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. నల్గొండ జిల్లాలో 11మంది గిరిజన బాలికలపై కీచక ట్యూటర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే మరో దారుణం హాలియాలో శనివారం చోటుచేసుకుంది. ఓ గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజన మహిళపై దుబ్బాక ఎస్ఐ లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కోరిక తీరిస్తేనే అనుకూలంగా వ్యవహరిస్తానంటూ దుబ్బాక ఎస్ఐ లెనిన్‌బాబు తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ చల్లాపూర్ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వి.వెంకటలక్ష్మి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయవాది తీగల రాంప్రసాద్‌గౌడ్ నేతృత్వంలో బాధిత మహిళ శుక్రవారం కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్తి కోసం తన అన్న రామచంద్ర తల్లిని వేధింపులకు గురిచేస్తున్నారని, తరచూ కొడుతున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసి ప్రశ్నించినందుకు తనపై కూడా దాడి చేశారని, కర్రతో చితకబాదారని వెంకటలక్ష్మి పేర్కొన్నారు. అన్న దాడి చేసిన ఘటనపై సెప్టెంబరు 19న దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె తెలిపారు. తన ఫిర్యాదును పక్కనబెట్టిన ఎస్సై లెనిన్‌బాబు తనను దుర్భాషలాడారని,‘కేసు నమోదు చేయను, ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ బెదిరింపులకు గురిచేశాడని వాపోయారు. తామే రామచంద్రపై దాడి చేసినట్లుగా తప్పుడు కేసు నమోదు చేసి తమను రిమాండ్‌కు తరలించారని కన్నీటిపర్యంతమయ్యారు. బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా వేధింపులు ఆపడం లేదని, నిత్యం పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆమె తెలిపారు. తన కోరిన తీరిస్తేనే రామచంద్రపై కేసు నమోదు చేస్తానంటూ బెదిరిస్తున్నారన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న లెనిన్‌బాబుపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్...ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా విచారణ జరపాలని సిద్దిపేట డీఎస్పీని ఆదేశించిస్తూ నోటీసులు జారీచేసింది. అలాగే బాధితురాలికి రక్షణ కల్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
డొంకరాయిలో గిరిజన యువతిపై సామూహిక అత్యాచారం
విశాఖపట్నం: విశాఖ జిల్లా సరిహద్దులలో గిరిజన వివాహిత యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డొంకరాయి గ్రామంలో ఈ దారుణం జరిగింది. గిరిజన యువతిని కొందరు మభ్యపెట్టి మద్యం మత్తులో అత్యాచారం చేశారు. గత నెల 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం: ముగ్గురి అరెస్టు
ఒడిశా రాష్ట్రంలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం, హత్యాప్రయత్నం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు (27) ఇప్పటికీ కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల హాస్టల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కటక్ జిల్లాలోని బంకి ప్రాంతంలో మద్యం వ్యాపారం చేస్తున్న ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండు విధించింది. గిరిజన మహిళ అడవికి సమీపంలోని తన తల్లిదండ్రుల కూరగాయల తోటలో పనిచేస్తుండగా ఆమెను ఈ ముగ్గురూ ఎత్తుకెళ్లారు. కటక్ సమీపంలోని కౌమడ ప్రాంతంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె స్పృహలేని పరిస్థితిలో.. కాళ్లు కట్టేసి కనపడింది. ఒంటిపై తీవ్రగాయాలు కూడా అయ్యాయి. దీంతో, అత్యాచారం అనంతరం ఆమెపై హత్యాయత్నం కూడా జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలోప తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితురాలికి చికిత్స, ఉద్యోగం, నష్టపరిహారం అందించాలంటూ స్థానికులు రాస్తారోకో చేశారు.