కోవూరు: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కోవూరు మండలం పాటూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున ఓ గిరిజన వివాహితపై అత్యాచారం జరిగింది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై గుర్తుతెలియని దుండగుడు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.