కీచకుల సంతతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అత్యాచార ఘటనలు ఆగడం లేదు.
నల్గొండ: కీచకుల సంతతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అత్యాచార ఘటనలు ఆగడం లేదు. నిర్భయ చట్టాలు తెచ్చినా కీచకుల అకృత్యాలకు అంతు లేకుండా పోతోంది. నల్గొండ జిల్లాలో 11మంది గిరిజన బాలికలపై కీచక ట్యూటర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మరవకముందే మరో దారుణం హాలియాలో శనివారం చోటుచేసుకుంది.
ఓ గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.