అమెరికాలో పైలట్ శిక్షణకు ఎంపికైన గిరిజన మహిళ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో పైలట్ శిక్షణకు తెలంగాణ నుంచి ఎంపికైన గిరిజన యువతి అజ్మీరా బాబీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రూ.28 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన అజ్మీరా బాబీ ఫ్లోరిడాలోని డీన్ ఇం టర్నేషన్ ఫ్లైయింగ్ స్కూల్‌లో కమర్షియల్ పైలట్ ట్రైనిం గ్ కోర్సుకు ఎంపికైంది. ఆర్థికంగా ఇబ్బందులుండటంతో.. ఈ కోర్సు పూర్తి చేసేందుకు సాయం చేయాలని సీఎంను ఆశ్రయించగా.. ట్యూషన్ ఫీజుకు రూ. 21.21 లక్షలు, వసతి సదుపాయాలు, మిగతా ఖర్చులకు రూ.6.89 లక్షలు మం జూరు చేశారు. ఇటీవలే పైలట్ శిక్షణ పొందేందుకు పాతబస్తీకి చెందిన సయిదా సల్వా ఫాతిమాకు రూ.35.50 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.