pilot training
-
ఆకాసా ఎయిర్‌కు రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్ ప్యానల్(ఏటీఆర్పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్ 2/3 ఆపరేషన్(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్ ఇన్స్పెక్షన్ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. -
కర్నూలులో ఓరియంట్ ఫ్లైట్స్ పైలెట్ శిక్షణ కేంద్రం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో తొలి పైలెట్ శిక్షణ కేంద్రం కర్నూలు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఏర్పాటవుతోంది. ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఓరియంట్ ఫ్లైట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అనుమతిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడులు శాఖ ఉత్తర్వులిచ్చింది. పైలెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఏడీసీఎల్) టెండర్లు పిలవగా మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో రిత్విక్ ఏవియేషన్, ధిల్లాన్ ఏవియేషన్ లిమిటెడ్‌లు నిర్దేశిత నిబంధనల అర్హతలను అందుకోలేకపోయాయి. ఏపీఏడీసీఎల్ ప్రతీ విమానానికి గంటకు కనీస ఆదాయంగా రూ.500 చెల్లించాల్సి ఉంటుందన్న నిబంధన విధిస్తే.. ఓరియంట్ ఏవియేషన్ దానికి అదనంగా రూ.750 చెల్లించడానికి ముందుకొచ్చింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఓరియంట్ ఏవియేషన్ ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ గురువారం ఉత్తర్వులిచ్చారు. సంవత్సరానికి 100 మంది వరకు శిక్షణ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.155 కోట్లతో ఓర్వకల్లు వద్ద ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో సుమారు రూ.30 కోట్లతో పైలెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. దీర్ఘకాలిక లీజు విధానంలో తొలుత 20 ఏళ్లకు ఆ తర్వాత పరస్పర అంగీకారంతో మరో పదేళ్లు పొడిగించుకునేలా ఈ ఎఫ్‌టీవోని ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికి కనీసం 80 నుంచి 100 మందికి పైలెట్ శిక్షణ ఇచ్చేలా ఈ ఎఫ్‌టీవోని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం విమాన సర్వీసులే కాకుండా కర్నూలు ఎయిర్‌పోర్టును ఆధారం చేసుకుని పైలెట్ శిక్షణ, పారాగ్లైడింగ్, ఎంఆర్వో యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా విమానాశ్రయ ఆదాయం పెంచే మార్గాలను ఏపీఏడీసీఎల్ పరిశీలిస్తోంది. -
కర్నూలులో పైలట్ల శిక్షణ కేంద్రం
కర్నూలు విమానాశ్రయంలో పైలట్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇప్పటికే అయిదారు సంస్థలు ఆసక్తి కనబరిచాయని ఏపీ ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ వి.ఎన్.భరత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. టెండర్లకు జనవరి 31 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే ఏటా 40–50 మంది శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. గడువు కంటే ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2025 మే నాటికి ఇది సిద్ధం అవుతుందని వెల్లడించారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది, తుది దశ పూర్తి అయ్యే నాటికి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విమానాశ్రయాన్ని నిరి్మస్తున్నట్టు వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో జీఎంఆర్ నిరి్మస్తోంది. 2,200ల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతోందని భరత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టులను అనుసంధానిస్తూ కొత్త రూట్లలో సర్వీసులను అందించాల్సిందిగా కోరుతూ పలు విమానయాన సంస్థలతో ఇటీవల చర్చలు జరిపామని చెప్పారు. -
కిసాన్ డ్రోన్లకు రైతుల ఆసక్తి
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో ఆగస్టులో అన్ని జిల్లాల్లో మొత్తం 500 డ్రోన్లను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. రైతులతోపాటు నిరుద్యోగ యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇస్తున్నారు. జిల్లాకు 20 మంది చొప్పున మొత్తం 520 మందికి డ్రోన్ పైలెట్ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 212 మంది రైతులు, 96 మంది నిరుద్యోగులు డ్రోన్ పైలట్ శిక్షణ పొందేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ మొత్తం 308 మందిలో 203 మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆగస్టు కల్లా రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఉన్న కస్టమ్ హైరింగ్ కేంద్రాల్లో 500 డ్రోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున మిగతా యూనిట్లకు అవసరమైన వారికి శిక్షణ కోసం ఈ నెల 15వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కస్టమ్ హైరింగ్ సెంటర్‌కి తప్పనిసరిగా ఒక డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) సర్టిఫైడ్ పైలెట్ ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధన కేంద్రమైన సెంటర్ ఫర్ అప్సరాకు డ్రోన్ల రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కోర్సుకు డీజీసీఏ అనుమతి ఇచ్చిందని తెలిపారు. అక్కడ ఒక్కో బ్యాచ్‌లో 20 మందికి 12 రోజులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి డీజీసీఏ అనుమతి ఇచ్చిందని, ఇక్కడ పదిరోజుల శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. రైతులకు లబ్ధి వ్యవసాయ కార్యకలాపాల్లో మానవశ్రమను తగ్గించడంతో పాటు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఉత్పత్తి పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచుతోంది. పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలు పిచికారీ చేయడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రైతుల ఉత్పాదక వ్యయం తగ్గి ఆదాయం పెరుగుతుంది. -
ఏపీ: ఓర్వకల్లులో పైలట్ శిక్షణ కేంద్రం
సాక్షి, అమరావతి: ఏపీలో తొలి పైలట్ శిక్షణ కేంద్రాన్ని కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో పాటు ఎయిరో అడ్వంచర్ స్పోర్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓర్వకల్లు విమానాశ్రయంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది, ఇది లాభదాయకమా కాదా? వంటి వివరాలతో పూర్తిస్థాయి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తున్నారు. ఏపీఏడీసీఎల్ పంపిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలించి ఈ నివేదికను తయారు చేసే బాధ్యతను తమకు అప్పగించినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఇన్‌క్యాప్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.పవనమూర్తి ‘సాక్షి’కి చెప్పారు. ఈ ప్రాజెక్టు నోడల్ ఏజెన్సీగా ఇన్‌క్యాప్‌ను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. టీఎఫ్ఆర్ను తయారు చేయడానికి, కన్సల్టెన్సీ ఎంపిక చేయడానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఓర్వకల్లు వద్ద సహజసిద్ధంగా ఉన్న పలు ఆకృతులతో కూడిన కొండలు పారాగ్లైడింగ్ వంటి సాహస క్రీడలకు అనువుగా ఉంటాయని అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ, రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు వీఎన్ భరత్‌రెడ్డి తెలిపారు. -
ఏపీలో తొలి పైలెట్ శిక్షణా కేంద్రం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి పైలెట్ శిక్షణా కేంద్రం కర్నూలులో ఏర్పాటు కానుంది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు దగ్గరగా ఉండటం, కర్నూలు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ పైలెట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ వి.ఎన్.భరత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఈ కేంద్రానికి సంబంధించి ఫైనాన్షియల్ బిడ్లు పిలవనున్నట్టు తెలిపారు. ఈ శిక్షణా కేంద్రానికి సంబంధించిన మౌలిక వసతులను ఆ సంస్థే సమకూర్చుకోవాలని, కర్నూలు ఎయిర్పోర్ట్ ల్యాండ్‌ను వినియోగించుకున్నందుకు ఏపీఏడీసీఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆయన ఇంకా చెప్పారంటే.. ►కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు వస్తే కర్నూలు ఎయిర్‌పోర్టును విజయదశమికి అందుబాటులోకి తీసుకువస్తాం. ►కర్నూలు నుంచి ఉడాన్ పథకం కింద చౌక విమాన సర్వీసులు నడపడానికి ట్రూజెట్ మూడు రూట్లు దక్కించుకుంది. కర్నూలు నుంచి విజయవాడ, విశాఖ, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. ►ప్రస్తుతం పగటి పూట మాత్రమే విమానాలు నడుపుతారు. రెండవ దశలో రాత్రి వేళ కూడా సర్వీసులు ప్రారంభిస్తారు. ►సుమారు 970 ఎకరాల్లో రూ.160 కోట్లతో ఏపీఏడీసీఎల్ కర్నూలు ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2 వేల మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేశారు. -
విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పౌర విమానయాన రంగం తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నా ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. భాగస్వామ్య పెట్టుబడులతో విమానయాన రంగం బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) సహకారంతో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (ఎఫ్ఎస్టీసీ) హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రాన్ని కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎనిమిది విమానాలు నిలిపే సామర్థ్యమున్న (8–బే) పైలట్ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పటికే ఏ–320 నియో, బాంబార్డియర్ డాష్–8, ఏటీఆర్ 72–600 సిమ్యులేటర్లను హైదరాబాద్ బేలో ఏర్పాటు చేయగా ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లోనూ ఇప్పటికే మరో ఐదు సిమ్యులేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. గురుగ్రాం, హైదరాబాద్‌లో ఏర్పాటైన ఎఫ్ఎస్టీసీ శిక్ష ణ కేంద్రాల ద్వారా పైలట్లకు అత్యాధునిక శిక్షణ సాధ్యమవుతుందన్నారు. స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక శిక్షణ లభిస్తుండటంతో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వైమానిక సంస్థలతోపాటు దేశీయ సంస్థలు కూడా భారత్‌లో శిక్షణ భాగస్వాములుగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాయ న్నారు. ఎఫ్ఎస్టీసీని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ సిమ్యులేటర్‌ను కాసేపు సరదాగా నడిపారు. 2011లో ఎఫ్ఎస్టీసీ ప్రస్థానం ప్రారంభం... వైమానిక రంగంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ఎఫ్ఎస్టీసీ 2012లో ఎయిర్‌బస్ ఏ– 320, బోయింగ్ బి–737 సిమ్యులేటర్లను అందుబాటులోకి తెచ్చింది. కార్యకలాపాలను విస్తరించుకుంటూ 2015లో యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గుర్తింపు కూడా పొందింది. 2018లో హైదరాబాద్ శిక్షణ కేంద్రాన్ని శంకుస్థాపన చేయడంతోపాటు గుజరాత్ ఫ్లయింగ్ క్లబ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే 1,100 మందికి శిక్షణ ఇచ్చిన ఎఫ్ఎస్టీసీ... హైదరాబాద్ శిక్షణా కేంద్రం ద్వారా దక్షిణాదిలో పైలట్ల శిక్షణ అవసరాలను తీరుస్తుందని అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఎఫ్ఎస్టీసీ ఫ్లయింగ్ స్కూల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పైలట్లకు శిక్షణ ఇస్తున్న ప్రముఖ సంస్థ ఫ్లయిట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (ఎఫ్ఎస్టీసీ) రెండు ఫ్లయింగ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోంది. ఒకటి ఉత్తరాదిన, మరొకటి దక్షిణాది రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఏర్పాటు చేయనుంది. వీటి ఏర్పాటుకు మౌలిక వసతులు మెరుగ్గా ఉండి, రద్దీ లేని విమానాశ్రయం తమకు అనువుగా ఉంటుందని ఎఫ్ఎస్టీసీ సీఈవో దిలావర్ సింగ్ బస్నాన్ శుక్రవారమిక్కడ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే బేగంపేట విమానాశ్రయాన్ని ఫ్లయింగ్ స్కూల్‌కు వాడుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. శంషాబాద్‌లో సిమ్యులేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్న కంపెనీ.. ఫ్లయింగ్ స్కూల్‌ను సైతం హైదరాబాద్‌లో నెలకొల్పేందుకే మొగ్గు చూపుతోంది. ఒక్కో కేంద్రానికి రూ.100 కోట్లు.. ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతాయని దిలావర్ సింగ్ పేర్కొన్నారు. ‘‘స్కూల్ ద్వారా పైలట్ శిక్షణ ఇస్తాం. ఇందుకోసం శిక్షణ విమానాలను కొనుగోలు చేస్తున్నాం. 40 విమానాలను సమకూర్చుకోవాలన్నది ఆలోచన. వచ్చే 10 ఏళ్లలో భారత్‌కు 9– 10 వేల మంది పైలట్లు అవసరం. గుర్గావ్లోని సిమ్యులేషన్ సెంటర్ ద్వారా ఇప్పటికే 600కు పైగా పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చాం. భారత్‌లో ఉన్న పైలట్లలో 40 శాతం మా దగ్గర శిక్షణ తీసుకున్నవారే. శంషాబాద్‌లో రూ.500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిమ్యులేషన్ సెంటర్ ఆగస్టు నాటికి సిద్ధం కానుంది. ఎఫ్ఎస్టీసీ పైలట్లకు కోర్సు ఫీజు రూ.15–30 లక్షలు ఉంది’’ అని దిలావర్ వివరించారు. -
ఉద్యమ సేవలకు గుర్తింపుగా..
- పైలట్ శిక్షణకు రూ.30 లక్షలు.. - టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ - ఆనందంలో విద్యార్థిని సంజన కౌడిపల్లి: తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థినికి సీఎం కేసీఆర్ బాసటగా నిలిచారు. కౌడిపల్లికి చెందిన సంజన అలియాస్ స్వీటీ చిన్నవయస్సులోనే తన తల్లితో కలిసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఓవైపు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు చదువుపై దృష్టిసారించింది. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసింది. పెలైట్ శిక్షణ కోసం అధిక మొత్తంలో డబ్బు అవసరం ఉండగా ఆ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి, సంజనకు రు.30 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. వివరాలు.. కౌడిపల్లికి చెందిన ఓం ప్రకాశ్, అనిత దంపతులు. ఓం ప్రకాశ్ ప్రస్తుతం కౌడిపల్లి మండలం దేవులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అనిత టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే పార్టీలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ జిల్లా మహిళా కార్యదర్శిగా, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా, బీఎస్ఎన్ఎల్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో పాపన్నపేట మండలం కొడపాక నుంచి ఎంపీటీసీగా పోటీ చేశారు. వీరి మూడో కూతురు సంజన. ఈమె కూడా తల్లితో కలిసి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంతోపాటు మెదక్ జిల్లా సింగూర్ నీటిని సాగు, తాగు అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నిర్వహించిన సింగూర్ సింహగర్జనలో సంజన పాల్గొంది. మహబూబ్‌నగర్ జిల్లాలో మాల్పల్ నుంచి గద్వాల వరకు జరిగిన పాదయాత్రలో సైతం పాల్గొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కేసీఆర్ వెంట నడిచింది. దీంతో సంజన పైలట్ కావాలనే తన బలమైన కోరికను సీఎం దృష్టికి తీసుకెళ్లింది. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ శుక్రవారం జరిగిన ప్లీనరీలో రూ.30 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. తన కోరిక నెరవేరబోతుండడంతో సంజన ఆనందంలో మునిగింది. -
దేవుడు వరమిచ్చినా..
గిరిజన యువతి బాబీ పైలట్ ట్రైనింగ్‌కు రూ. 25 లక్షల మంజూరు వ్యవహారం హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న సామెత ఈ ఉదంతానికి అక్షరాలా అతికినట్లుగా సరిపోతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకున్నా, విధివిధానాలు, ప్రొసీజర్స్ అంటూ సంబంధిత శాఖ అధికారులు జాప్యం చేశారనే విమర్శలొచ్చాయి. దీనిపై చివరకు సీఎం కార్యాలయం కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఎదురైంది. దీని పూర్వాపరాలిలా ఉన్నాయి. అట్టడుగువర్గానికి చెందిన గిరిజన యువతి అజ్మీరా బాబీ పైలట్ ్రైటె నింగ్ లెసైన్స్ శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షలు సాయం అందించనున్నట్లు ప్రకటిం చింది. అమెరికాలోని ఫ్లోరిడా మియామీ అంతర్జాతీయ ఫ్లయింగ్ స్కూల్లో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ లెసైన్స్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సహాయం కింద కె.హరిరాం నాయక్ కుమార్తె అజ్మీరా బాబీకి రూ.25 లక్షలకు పరిపాలనా మంజూరునిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఈనెల 10వ తేదీన గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఈనెల 10వ తేదీన పరిపాలనాపరమైన మంజూరును కూడా ప్రభుత్వం ఇచ్చింది. అయితే రెండువారాలు గడుస్తున్నా ఈ మొత్తం అందకపోవడంతో బాబీ కుటుం బంలో ఆందోళన మొదలైంది. తాము మొత్తం డబ్బును ఒకేసారి చెక్కురూపంలో ఇవ్వలేమని, ముందుగా రూ.5 లక్షలు ఇస్తామని, ఈ ట్రైనింగ్‌లో చేరినట్లు ఆధారాలు చూపాక మిగతా మొత్తాన్ని విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం రూ.25 లక్షలను ఒకేసారి ఇచ్చేస్తే ఒకవేళ ఆ కోర్సులో ఆమె చేరకపోతే పరిస్థితి ఏమిటనే సందేహాల్ని సైతం వారు వ్యక్తంచేశారు. దీనితో ఈ అంశాన్ని బుధవారం గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ దృష్టికి బాబీ కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ఆయన ఈ అంశాన్ని సీఎం కార్యాలయం దృష్టికి, ఆ తర్వాత సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం కార్యాలయం సంబంధిత అధికారులను పిలిపించి, వారి వివరణ తీసుకుంది. అప్పటికప్పుడు రూ.25 లక్షలకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బాబీకి అందజేశారు. ఈ మొత్తాన్ని గురువారం విడుదల చేయాలని గిరిజనశాఖ అధికారులను సీఎం కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం. అధికారుల అలసత్వం, ఆయా పనుల నిర్వహణలో విపరీతమైన జాప్యం, ప్రభుత్వపరంగా ఆదేశాలు జారీచేసినా, ప్రత్యేక ఉదంతంగా (స్పెషల్ కేసు) పేర్కొన్నా.. గిరిజన సంక్షేమశాఖే కాదు, ఏ అధికార యంత్రాంగమైనా వ్యవహరించే తీరుకు ఇదొక ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తుంది. -
గిరిజన మహిళా పైలట్ బాబీ శిక్షణకు రూ. 25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా మియామీ అంతర్జాతీయ ఫ్లైయింగ్ స్కూల్లో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ లెసైన్స్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సహాయం కింద కె.హరి రాం నాయక్ కుమార్తె అజ్మీరా బాబీకి రూ.25 లక్షలకు పరిపాలనా మంజూరునిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవా రం గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు. -
అమెరికాలో పైలట్ శిక్షణకు ఎంపికైన గిరిజన మహిళ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో పైలట్ శిక్షణకు తెలంగాణ నుంచి ఎంపికైన గిరిజన యువతి అజ్మీరా బాబీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రూ.28 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లికి చెందిన అజ్మీరా బాబీ ఫ్లోరిడాలోని డీన్ ఇం టర్నేషన్ ఫ్లైయింగ్ స్కూల్లో కమర్షియల్ పైలట్ ట్రైనిం గ్ కోర్సుకు ఎంపికైంది. ఆర్థికంగా ఇబ్బందులుండటంతో.. ఈ కోర్సు పూర్తి చేసేందుకు సాయం చేయాలని సీఎంను ఆశ్రయించగా.. ట్యూషన్ ఫీజుకు రూ. 21.21 లక్షలు, వసతి సదుపాయాలు, మిగతా ఖర్చులకు రూ.6.89 లక్షలు మం జూరు చేశారు. ఇటీవలే పైలట్ శిక్షణ పొందేందుకు పాతబస్తీకి చెందిన సయిదా సల్వా ఫాతిమాకు రూ.35.50 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.