ఓ గిరిజన మహిళపై భర్తతో పాటు పది మంది అత్యాచారానికి ఒడిగట్టారు.
ఖండ్వా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లో దారుణ సంఘటన జరిగింది. ఓ గిరిజన మహిళపై భర్తతో పాటు పది మంది అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖండ్వా జిల్లా పిప్లాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిలాయ్ ఖేడా గ్రామంలో ఆస్తి తగదాల వల్ల ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. భర్త ప్రోద్బలంతో బంధువులు, ఇతర గ్రామస్తులు పదిమంది కలసి కత్తులతో ఆయన భార్యపై దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి మూత్రం మూత్రం తాగాలని బెదిరించారు. బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరినీ అరెస్ట్ చేశారు. బంధువలు ఆమెను చికిత్స నిమిత్తం ఖండ్వా జిల్లా ఆసుపత్రికి తరలించారు.