ఒడిశా రాష్ట్రంలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం, హత్యాప్రయత్నం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు (27) ఇప్పటికీ కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాల హాస్టల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కటక్ జిల్లాలోని బంకి ప్రాంతంలో మద్యం వ్యాపారం చేస్తున్న ముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండు విధించింది.
గిరిజన మహిళ అడవికి సమీపంలోని తన తల్లిదండ్రుల కూరగాయల తోటలో పనిచేస్తుండగా ఆమెను ఈ ముగ్గురూ ఎత్తుకెళ్లారు. కటక్ సమీపంలోని కౌమడ ప్రాంతంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె స్పృహలేని పరిస్థితిలో.. కాళ్లు కట్టేసి కనపడింది. ఒంటిపై తీవ్రగాయాలు కూడా అయ్యాయి. దీంతో, అత్యాచారం అనంతరం ఆమెపై హత్యాయత్నం కూడా జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలోప తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితురాలికి చికిత్స, ఉద్యోగం, నష్టపరిహారం అందించాలంటూ స్థానికులు రాస్తారోకో చేశారు.
గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం: ముగ్గురి అరెస్టు
Published Mon, Oct 7 2013 8:09 PM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement