ముజాహిద్ పూర్: ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పలేక, భార్యా కొడుకును చంపేందుకు యత్నించాడో భర్త. ఈ ఘటనలో కొడుకు చనిపోగా, భార్య చావు తప్పించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ హత్యకేసులో అసలు నిజాలు వెలుగు చూశాయి. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపినట్టుగా భావిస్తున్న మహిళ, ఆమె కొడుకును .. నిజానికి భర్త, మరిది హతమార్చారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం ఎల్కగూడెంకు చెందిన కిశోర్, షాద్‌నగర్‌కు చెందిన సుజాతలు పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుని, హైదరాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల బాబు. తమ పెళ్లి, బాబు విషయాన్ని ఇంట్లో చెప్పమని సుజాత తరచూ కిశోర్‌తో గొడవపడుతూ ఉండేది. ఈ నేపథ్యంలో అత్తారింటికి తీసుకెళతానని భార్య, కొడుకును కిశోర్, అతడి తమ్ముడు ఆనంద్ బైకుపై తీసుకెళ్లారు.
ముజాహిద్‌పూర్ అటవీప్రాంతంలో ఆమె గొంతు నులిమేశారు. తల్లిని కొడుతుండగా అడ్డొచ్చిన బాబును దారుణంగా హతమార్చారు. అయితే, సుజాత స్పృహ తప్పిపడిపోగా, ఆమె చనిపోయిందనుకుని అక్కడ్నించి వెళ్లిపోయారు. కానీ, ఆమె కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఉండటాన్ని గమనించిన స్థానికులు, ఆసుపత్రికి తరలించగా, ఆమె కోలుకుంది. జరిగిన విషయాన్ని పోలీసులకు తెలపగా .. వారు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పలేక....
Published Tue, Aug 5 2014 2:15 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement