తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్గా ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి నియమితులయ్యారు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్లో మూడేళ్ల బాలుడిని చంపి...తల్లిపై అత్యాచారయత్నం కేసులో కొత్త నిజాలు వెలుగు చేస్తున్నాయి. కట్టుకున్న భర్తే ... కొడుకుతో పాటు తనను హతమార్చేందుకు యత్నించినట్లు బాధితురాలు సుజాత వెల్లడించింది. బాధితురాలి వివరణతో పోలీసులు షాక్ తిన్నారు. భర్త శివకుమార్ ముందుగా తనపై హత్యాయత్నం చేసి, అనంతరం కొడుకును చంపి అక్కడ నుంచి పరారయ్యాడని ఆమె తెలిపింది. సుజాత చనిపోయిందనుకుని ఘటనా స్థలం నుంచి భర్త వెళ్లిపోయాడు. అయితే కొన ఊపిరితో ఉన్న సుజాతను స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్ కథనం ప్రకారం ముజాహిద్ పూర్ శివారులో మహబూబ్ నగర్ జిల్ఆ కొందుర్గు మండలం వెల్కిచర్లకు వెళ్లే రోడ్డులోని అటవీ ప్రాంతంలో నిన్న ఓ మహిళ అపస్మారక స్థితిలో పడిఉంది. ఈ విషయాన్ని గమనించిన ఓ పశువుల కాపరి స్థానికులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు తెలపటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోలుకోవటంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. బాధితురాలి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్. నిందితుడు శివకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.