
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(చెన్నై): భర్తతో ఏర్పడిన గొడవ కారణంగా.. ఇద్దరు బిడ్డలను గొంతు నులిమి హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుక్కోట్టై జిల్లా పొన్ అమరావతి సమీపంలోని కరుప్పర్ కోయిల్ పట్టికి చెందిన పొన్నాడైకల్ (28) పొల్లాచ్చిలోని కొబ్బరి మండీలో పని చేస్తున్నాడు. అతని భార్య పంచవర్ణం (21). వీరిద్దరూ ప్రేమించి మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి జగదీష్ (2) అనే కుమారుడు, దక్షిత (8 నెలలు) అనే కుమార్తె ఉన్నారు. సొంత ఇల్లు కట్టాలని పంచవర్ణం భర్తను తరచూ కోరేది.
అయితే పొన్నాడైకల్ మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరునాళ్లను పురస్కరించుకుని సోమవారం అదే ప్రాంతంలో ఉన్న అత్తింటికి భార్య పిల్లలతో కలిసి పొన్నాడైక్కల్ వెళ్లాడు. అక్కడ దంపతుల మధ్య మళ్లీ గొడవ ఏర్పడింది. ఆ సమయంలో ఆగ్రహం చెందిన పంచవర్ణం భర్త బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న ఇద్దరు బిడ్డల గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పంచవర్ణంను అరెస్టు చేశారు.
చదవండి: ‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’
Comments
Please login to add a commentAdd a comment